
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఇప్పటికే అన్ని పరీక్షలను రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు వాయిదా వేశాయి. సీబీఎస్సీ కూడా పరీక్షలను రద్దు చేసింది. అయితే తాజాగా మే31న జరగవల్సిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2020ని కూడా వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు ఈ వారంలో విడుదల చేయాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. తదుపరి వివరాలను మే 20న తెలియజేస్తామని తెలిపింది. (యూపీఎస్సీ 2020 సన్నద్ధమవుదామిలా..)
కరోనా మహమ్మారి కారణంగా యూపీఎస్సీ పరీక్షలను వాయిదా వేయలని సివిల్ సర్వీసస్‌కి తయారవుతున్న విద్యార్ధులు కోరగా దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని, దీని గురించి విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తే విద్యార్ధులు పరీక్షల కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవలసి వస్తుంది కనుక ఆ విషయం పై మరోసారి ఆలోచిస్తామన్నారు. అయితే గత 4-5 సంవత్సరాలతో పోలీస్తే ఈ ఏడాది సివిల్స్ సర్వీసెస్ ఎగ్జామ్ షెడ్యూల్ ముందుగానే ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తోన్న అనేక పరీక్షలను ఇప్పటికే వాయిదా వేసిన విషయం తెలిసిందే. (ఉద్యోగ పరీక్షలపైనా కరోనా ప్రభావం)
Comments
Please login to add a commentAdd a comment