కార్పొరేట్‌ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్‌ ర్యాంక్‌ కొట్టిన యువతి స్టోరీ | Meet Noida Woman Who Quit Corporate Job Makes UPSC Top 20, Know Her Inspirational Story In Telugu- Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ జాబ్ వదిలేసి మరీ..సివిల్స్‌ ర్యాంక్‌  కొట్టిన యువతి స్టోరీ

Published Wed, Apr 17 2024 1:06 PM | Last Updated on Wed, Apr 17 2024 3:23 PM

Meet Noida Woman Who Quit Corporate Job Makes UPSC Top 20 - Sakshi

సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచి పెట్టేసింది. పట్టుదలతో చదివి ఊహించని ఫలితాన్ని సాధించింది. తాజా యూపీఎస్‌సీ ఫలితాల్లో టాప్‌-20లో ర్యాంకు సాధించింది. ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల యువతి సక్సెస్‌ స్టోరీ గురించి  తెలుసుకుందాం  రండి..!

ప్రతిష్టాత్మక పరీక్ష సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించాలంటే అంత ఈజీకాదు.  దీనికి ఎంతో పట్టుదల కృషి కావాలి. అలా దీక్షగా చదివి  తన ప్రత్యేకతను చాటుకుంది నోయిడా సెక్టార్ 82 లోని వివేక్ విహార్‌లో నివసించే వార్దా ఖాన్.  మంగళవారం ప్రకటించిన తాజా యూపీఎస్సీ ఫలితాల్లో 18 వ ర్యాంక్ సాధించింది.  తన తొలి ప్రిఫరెన్స్‌గా ఇండియన్ ఫారిన్ సర్వీస్‌(ఐఎఫ్ఎస్‌) అని తెలిపింది.  ప్రపంచంలోనే భారత దేశాన్ని మరింత ఉన్నత స్థానంలో ఉంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్దా ఖాన్ తెలిపింది. సివిల్స్‌లో మంచి తన టార్గెట్‌. కానీ టాప్‌ 20లో ఉంటానని అస్సలు ఊహించలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది వార్దా ఖాన్‌. దీంతో తన ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉందని పేర్కొంది.  వాస్తవానికి సివిల్స్‌కోసం 2021 నుండి సిద్ధమవుతున్నాననీ, రెండో ప్రయత్నంలో విజయం సాధించానని వెల్లడించింది. ఈ సందర్బంగా కుటుంబం, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

నోయిడా సెక్టార్ 82లోని వివేక్ విహార్‌లో ఉండే వార్ధా ఖాన్ ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి తొమ్మిదేళ్ల క్రితం చనిపోగా ప్రస్తుతం తల్లితో కలసి ఉంటోంది. ఢిల్లీలోని ఖ‌ల్సా కాలేజీ నుంచి బీకామ్ హాన‌ర్స్‌ పూర్తి చేసింది. చదువు తరువాత ఎనిమిది నెలల పాటు కార్పొరేట్‌ కంపెనీలో పనిచేసింది. అది సంతృప్తి నివ్వలేదు. పైగా సమాజానికి సేవ చేయాలనే ఆశయం. దీంతో కష్టపడి చదవి తమ కలను సాకారం చేసుకుంది. 

హిస్టరీ, జియోపాలిటిక్స్ స‌బ్జెక్టులు అంటే ఇష్టమని పేర్కొంది. అలాగే కాలేజీ రోజుల్లో ఎక్కువగా డిబేట్లలో, MUN లలో (మాక్ యునైటెడ్ నేషన్స్) పాల్గొనేదాన్ని ఆ స‌మ‌యంలో సివిల్స్ సాధించాలనే ఆలోచ‌న తనలో కలిగిందని  చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement