Shivanand Tiwari
-
14 ఏళ్లకే ఐఐటీ జేఈఈ లో ఉత్తీర్ణత
పాట్నా: పద్నాలుగు ఏళ్లకే బీహార్ కు చెందిన ఓ బాలుడు 2014 సంవత్సరపు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఐఐటీ జేఈఈ) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. గురువారం విడుదలైన ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో 2587 ర్యాంక్ ను సాధించాడు. బీహార్ రోహ్ తాస్ జిల్లాలోని ఓ వ్యవసాయ కుటుంబానికి చెందిన శివానంద్ ఇటీవల జరిగిన 12వ తరగతిలో 93.4 శాతంతో పాస్ అయ్యాడు. ఐఐటీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన శివానంద్.. ఫిజిక్స్ పరిశోధన చేయాలని ఉందని తెలిపారు. చిన్నతనంలోనే ఓ ప్రత్యేకతను దక్కించుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మాకు చాలా గర్వంగా ఉంది అని శివానంద్ తండ్రి కమలకాంత్ తివారీ అన్నారు. ఐఐటీ-జేఈఈ పరీక్షకు 126,997 మంది దరఖాస్తు చేసుకోగా, 27,151 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. గత సంవత్సరం బీహార్ లోని భోజ్ పూర్ జిల్లాకు చెందిన విద్యార్ధి సత్యం కుమార్ 13 ఏళ్లకే ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షలో 679 ర్యాంకును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. -
భారత రత్న సచిన్ కు కాకుండా.. లాలూకి ఇవ్వాలా?
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు దేశ అత్యున్నత అవార్డు భారత రత్న ఇవ్వడాన్ని ప్రశ్నించిన జేడీ(యూ) సీనియర్ నేత శివానంద్ తివారీపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. సచిన్ భారత రత్న అనడంలో సందేహం అక్కర్లేదని శివసేన తెలిపింది. సచిన్ కాకుండా లాలూ ప్రసాద్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలా అని శివసేన నేత సంజయ్ రావత్ నిలదీశారు. సచిన్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడానికి తివారీ హక్కులేదు అని రావత్ అన్నారు. దేశ అస్థిత్వంలో సచిన్ ఓ భాగం అని అన్నారు. అంతేకాకుండా మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయికి భారత రత్న అవార్డును ప్రకటించాలి అని రావత్ డిమాండ్ చేశారు. రాజీవ్ గాంధీకి అవార్డును ప్రకటించినపుడు వాజ్ పేయికి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నించారు. వాజ్ పేయికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వారు సచిన్ కు భారత రత్న ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదు అన్నారు. క్రికెట్ ఆడటం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన సచిన్ కు భారత రత్న ఇవ్వడం ఓ జోక్ అని.. దేశం తరపున సచిన్ ఉచితంగా క్రికెట్ ఆడలేదు అని తివారీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.