
ప్రధాని నరేంద్ర మోదీకి బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘన స్వాగతం లభించింది. అక్కడ ఆయనకు ప్రజలు భారీ మఖానా పూల దండతో సత్కరించి గౌరవించారు. ఎందుకంటే తాజగా కేంద్ర బడ్జెట్‌లో సైతం మఖానా పంటకి పెద్దపీటవేయడంతో బీహార్ రైతులకు ఇది కాసుల పంటగా మారింది. అలాగే కేంద్ర ప్రభుత్వం మఖానా బోర్డుని ఏర్పాటు చేసి మరీ రైతులకు మరింత చేయూత అందించనున్నాట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలోనే మోదీకి ఇలా మఖానా దండతో స్వాగతం పలికారు. అలాగే మోదీ ఆ కార్యక్రమంలో తనకు ఈ సూపర్ ఫుడ్ ప్రీతికరమైన ఆహారమని హైలెట్ చేసి మరీ చెప్పారు. తాను ఏడాదిలో 300 రోజులు మఖానును చాలా ఇష్టంగా తింటానని అన్నారు. మరీ ప్రధాని మోదీ డైట్‌లో దీనికి ఎందుకంత ప్రాముఖ్యతను ఇచ్చారో చూద్దామా..!.
భారతదేశంలో మఖాన్ ఉత్పత్తిలో బిహార్ అతిపెద్దది. దేశసరఫరాలో సుమారు 80% వాటాను కలిగి ఉంది. ఈ సూపర్‌ఫుడ్ కోసం పెరుగుతున్న ప్రపంచ డిమాండ్‌ను కొనసాగించడానికి రాష్ట్రం చాలా కష్టపడుతోంది.
దీనికి పరిష్కారంగానే కేంద్ర బడ్జెట్ 2025లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిహార్‌లో ప్రత్యేక మఖానా బోర్డుని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ బోర్డు ద్వారా రైతులకు మఖానా ఉత్పత్తి, ప్రాసెసింగ్ మార్కెటింగ్‌కి మద్దతు ఇవ్వడమేగాక అందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన సహకారాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అంతేగాదు ప్రభుత్వ పథకాల నుంచి ప్రయోజనాలు పొందేలా కూడా చూస్తుంది.
మఖానా అంటే..?
మఖానాని ప్రిక్లీ వాటర్ లిల్లీ విత్తనాల నుంచి తయారు చేస్తారు. ఇది కాస్తా శ్రమతో కూడిన ప్రక్రియ.
సూపర్ ఫుడ్‌గా ఎందుకు పరిగణిస్తారంటే..
ప్రధానమంత్రి దీనిని తన రోజువారీ ఆహారంలో ఎందుకు చేర్చుకున్నారంటే..
ఇది పోషకశక్తికి కేంద్రంగా ప్రజాదరణ పొందిన ఆహారం.
దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటా
బరువుని అదుపులో ఉంచుకోవాలనుకునేవారికి బెస్ట్ స్నాక్ ఐటెం
శాకాహారులకు మొక్కల ఆధారిత ప్రోటీన్ మూలం
శారీరక విధులకు అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌లను కలిగి ఉంటాయి.
వివిధ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ ఇది
జీర్ణ ఆరోగ్యానికి సహాయపడుతుంది
అలాగే మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది
పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
ఈ ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా మోదీ దీన్ని సూపర్‌ఫుడ్‌గా పిలుస్తూ..తన రోజువారి ఆహారంలో ప్రాధాన్యత ఇచ్చారు. మరీ మనం కూడా మన డైట్‌లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉందామా..!.
Comments
Please login to add a commentAdd a comment