ప్రణాళికతో చదివితే సీఏ సులభమే | CA-planned, easy read | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో చదివితే సీఏ సులభమే

Published Mon, Dec 23 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

CA-planned, easy read

=సీఏ విద్యపై శ్రీమేధ‘వి’లో అవగాహన సదస్సు
 =పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు

 
తిరుచానూరు, న్యూస్‌లైన్ : సరైన ప్రణాళిక, కృషి ఉంటే సీఏలో సులభంగా ఉత్తీర్ణత సాధించవచ్చని శ్రీమేధ‘వి’ సీఏ కళాశాల విద్యా సంస్థల జిల్లా డెరైక్టర్ కె.షరీఫ్ పేర్కొన్నారు. సాక్షి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి ఎయిర్ బైపాస్‌రోడ్డులోని శ్రీమేధ‘వి’ సీఏ కళాశాలలో సీఏ-సీపీటీ, సీఏ-ఐపీసీసీ కోర్సులపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు. షరీఫ్ మాట్లాడుతూ సీఏ కోర్సు చేయడం చాలా కష్టమని ఒకప్పుడు అనుకునేవారని పేర్కొన్నారు. శ్రీమేధ‘వి’తో సులభమంగా మారిందన్నారు.

రాయలసీమ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని గత విద్యా సంవత్సరంలో తిరుపతి, ఈ విద్యా సంవత్సరంలో మదనపల్లెలో శ్రీమేధ‘వి’ సంస్థను స్థాపించినట్లు పేర్కొన్నారు. తిరుపతిలో స్థాపించిన మొదటి ఏడాదిలోనే జూనియర్ ఎంఈసీలో టాప్ టెన్‌లో 6 ర్యాంకులు సాధించడం తమ విద్యా బోధనకు నిదర్శనమన్నారు. జులైలో వెలువడిన సీపీటీ ఫలితా ల్లో తమ విద్యా సంస్థల విద్యార్థి కే.శరత్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. డిసెంబర్ 15న జరిగిన సీపీటీ పరీక్షలోని ఒకట్రెండు ప్రశ్నలు మినహా మిగిలిన అన్నింటికీ శ్రీమేధ‘వి’ రూపొందించిన మెటీరియల్స్ నుంచి వచ్చినవేనని తెలిపారు.

సుదీర్ఘ అనుభవం కలిగిన సీఏ క్వాలిఫైడ్ అధ్యాపకులతో విజయవాడకు దీటుగా శిక్షణ ఇవ్వడం తిరుపతి శ్రీమేధ‘వి’ ప్రత్యేకతని వివరించారు. డెరైక్టర్ కె.అస్రఫ్ మాట్లాడుతూ సమాజంలో వస్తు సేవల వినియోగం ఉన్నంత కాలం, ఆర్థిక లావాదేవీలు జరిగినంత కాలం సీఏల అవసరం ఉంటుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు సీఏ-సీపీటీ ప్రవేశ పరీక్షలు రాయకుండా నేరుగా సీఏ-ఐపీసీసీలో అడ్మిషన్ పొందవచ్చన్నారు. ప్రస్తుతం సీఏ-ఐపీసీసీ తరగతులు ప్రారంభమయ్యాయన్నారు.

ఐపీసీసీలో చేరే విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌ను అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ బి.ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ సీఏ చేయాలన్న దృఢ సంకల్పం, ఆత్మ విశ్వాసం ఉంటే తప్పకుండా సాధించవచ్చన్నారు. ఇతర కోర్సులతో పోలిస్తే అతి తక్కువ ఖర్చుతో సీఏ పూర్తి చేయవచ్చన్నారు. అలాగే వంద శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశం ఉంటుందని వివరించారు. ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ ఇవ్వడం శ్రీమేధ‘వి’ సొంతమన్నారు. సీఏ కోర్సుపై ఉన్న సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, ఇతర వివరాలకు 9581722223, 95818 22223 నంబర్లలో సంప్రదించాలని శ్రీమేధ‘వి’ విద్యాసంస్థల జిల్లా డెరైక్టర్లు కె.షరీఫ్, కె.అస్రఫ్ కోరారు.

ఈ సదస్సుకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. శ్రీమేధ‘వి’ బాలుర క్యాంపస్ ప్రిన్సిపాల్ కామేశ్వరరావు, సీపీటీ అధ్యాపకులు కిరణ్, ఢిల్లీబాబు, సందీప్, ఏవో మురళీకృష్ణ, మేనేజర్ జనార్దన్, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
 
 క్రమం తప్పకుండా చదవాలి
 సీఏ కోర్సులో చేరడం గొప్పకాదు. ఇతర కోర్సుల్లా పరీక్షలకు ముందు ఒక నెల చదివితే కుదరదు. క్రమం తప్పకుండా తరగతులకు హాజరవ్వాలి. అధ్యాపకులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా వినాలి. విన్నదాన్ని అవగాహన చేసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకోవాలి. అలా చేస్తే సీఏ కోర్సును సులువుగా పూర్తి చేయొచ్చు.        
 -ఎం.వెంకటాచలం, ఫ్యాకల్టీ, లా, ఎథిక్స్, కమ్యూనికేషన్
 
 బేసిక్స్ ముఖ్యం
 సీపీటీకి సిద్ధమయ్యే విద్యార్థులకు అకౌంట్స్, ఎకనామిక్స్, లా, మ్యాథమెటిక్స్‌లోని బేసిక్స్ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. ఇంటర్ ఎంఈసీ, సీఈసీలోని కామర్స్, సీపీటీలో అకౌంట్స్ బేసిక్ తెలిసి ఉంటే ఫైనల్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్లొచ్చు. అకౌంట్స్ అనే పునాదిపైనే సీఏ ఆధారపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  - సి.అశోక్‌కుమార్, ఫ్యాకల్టీ, అకౌంట్స్
 
 సబ్జెక్టుపై అవగాహన అవసరం
 సబ్జెక్టుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అందుకు అధ్యాపకులు చెప్పిన విషయాలను నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా చదవాలి. చదివిన అంశాన్ని అవగాహన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎంతో కష్టమనుకున్న సీఏ కోర్సును సులువుగా పూర్తి చేయొచ్చు.
 - వి.అరుణ్‌కుమార్, ఫ్యాకల్టీ, కాస్ట్ అకౌంట్స్
 
 ఉపయోగకరంగా ఉంది
 తిరుపతి శ్రీమేధ‘వి’లో సాక్షి ఆధ్వర్యంలో సీఏ-సీపీటీ, ఐపీసీసీ కోర్సులపై అవగాహన సదస్సు జరుగుతుందని కొందరు చెప్పడంతో కడప నుంచి వచ్చాను. సీఏ చేయాలంటే చేపట్టాల్సిన అంశాలు, పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలనే అంశాలను ఫ్యాకల్టీలు వివరించడం నాలాంటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది.
 -ఎస్.అన్వర్, విద్యార్థి, కడప
 
 పక్కా ప్రణాళిక అవసరం
 సీఏ-సీపీటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే పక్కా ప్రణాళిక ఎంతో అవసరం. సాధారణ డిగ్రీ పరీక్షలకు చదివినట్లు చదివితే కుదరదు. విద్యార్థులు క్రమం తప్పకుండా చదువుతూ పరీక్షకు సిద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ సూత్రం ఒక సీపీటీకే కాదు, సీఏ పూర్తయ్యేంత వరకు అమలు చేయాలి. ప్రతి సబ్జెక్టునూ చాలెంజ్‌గా తీసుకుని పూర్తి స్థాయిలో అవగాహన కలిగించుకుని చదవాలి. కోర్సు పూర్తి చేసిన వారికి బంగారు భవిత ఉంటుందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
 - ఏ.సురేష్, ఫ్యాకల్టీ, ఆడిటింగ్  
 
 వంద శాతం ఉపాధి
 దేశంలో సీఏల కొరత తీవ్రంగా ఉంది. ఇతర కోర్సులతో పోలిస్తే సీఏ చేసిన వారికి వంద శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సీఏ ఎంచుకున్న విద్యార్థులు ఏరోజుకారోజు నేర్చుకున్న అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో తయారు చేసుకోవాలి. వాటిని సీఏ పరీక్షకు నెల ముందు రివైజ్ చేసుకుంటే సరిపోతుంది.
 -సీహెచ్.నాగేందర్, ఫ్యాకల్టీ, కాస్టింగ్, ఎఫ్‌ఎం, సీపీటీ అకౌంట్స్
 
 నమ్మకం కలిగింది
 ఈ ఏడాది జూన్‌లో జరిగిన సీపీటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. తర్వాత ఐపీసీసీకి సిద్ధమవుతున్నా. ఐపీసీసీకి ఎలా సిద్ధమవ్వాలనే విషయం నాకు తెలియలేదు. శ్రీమేధ‘వి’లో జరిగిన అవగాహన సదస్సులో చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను కూడా సీఏ పూర్తి చేయగలనన్న నమ్మకం కుదిరింది.
 - వై.డమరక్‌నాథ్‌రెడ్డి, విద్యార్థి, చిన్నగొట్టిగల్లు
 
 సీఏ చేయాలనుకుంటున్నా
 ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేశాను. మా అమ్మానాన్నల కోరిక మేరకు డిగ్రీలో బీకాం తీసుకున్నాను. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు సీఏ చేయాలనుకుంటున్నా. సీఏ చేయలేమోనని కొంత భయమేసింది. అవగాహన సదస్సుకు వచ్చిన తర్వాత సీఏ చేయాలన్న తన ఆకాంక్ష మరింత బలపడింది.
  - కె.లావణ్య, విద్యార్థిని, తిరుపతి
 
 సీఏ చేయడమే లక్ష్యం
 సీఏ చేయడమే నా లక్ష్యం. డిసెంబరు 15వ తేదీన జరిగిన సీఏ-సీపీటీకి ఇంటి వద్ద నుంచే  సిద్ధమవుతుండడంతో నేను చదివిన విక్రమ్ విద్యాసంస్థ అధ్యాపకులు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. వారి అందించిన సహకారం, అవగాహన సదస్సులో తెలుసుకున్న విషయాలతో నా ఆకాంక్ష నెరవేరుతుందనే ధైర్యం వచ్చింది.
 - పి.హేమలత, విద్యార్థిని, శ్రీకాళహస్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement