CA
-
‘EY ఉద్యోగి చావుకు కారణం ఆ మేనేజర్ క్రికెట్ పిచ్చి’
యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) సీఏ అన్నా సెబాస్టియన్ మరణం ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ పని సంస్కృతిపై పెను చర్చకు దారితీసింది. ఆమె 'అధిక పని' కారణంగానే మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన అన్నా సెబాస్టియన్ పెరాయిల్ తండ్రి సీబీ జోసెఫ్ కొత్త విషయాలు చెప్పారు. ఆమె మేనేజర్‌కు ఉన్న క్రికెట్ పిచ్చే తమ కుమార్తెపై పని ఒత్తిడి పెంచిందంటూ ఆరోపిస్తున్నారు."ఆమె (అన్నా సెబాస్టియన్) మార్చి 18న అక్కడ (EY) చేరింది. ఒక వారం తర్వాత, ఆమె సాధారణ ఆడిటింగ్‌ను ప్రారంభించింది. EY పూణేలో 6 ఆడిట్ బృందాలు ఉన్నాయి. ఆమెను 6వ టీమ్‌లో చేర్చారు. ఆడిట్ మేనేజర్ పనిని సమీక్షించారు. ఆమె అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. ఆమె పీజీకి చేరుకున్న తర్వాత కూడా అదనపు పనిని చేయవలసి వచ్చింది.నిద్రించడానికి, తినడానికి కూడా ఆమెకు సమయం లేదు. ఆమె పని ఒత్తిడిని కలిగి ఉంది. మేనేజర్ సమయానికి పనిని సమీక్షించలేదు. అతను క్రికెట్ అభిమాని. మ్యాచ్ షెడ్యూల్‌కు అనుగుణంగా తన షెడ్యూల్‌ను మార్చాడు. దాని కారణంగా ఆమె తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి చాలా సేపు ఆలస్యంగా కూర్చోవలసి వచ్చింది.అంతటి ఒత్తడితో తాను అక్కడ పనిచేయలేనని ఏడ్చేది. రాజీనామా చేసి వచ్చేయాలని మేం కోరాం. కానీ ఆమె ఈవైలో కొనసాగాలని నిర్ణయించుకుంది. దురదృష్టవశాత్తు జూలై 21న ఆమె తన గదిలో కుప్పకూలిపోయి ఆసుపత్రికి చేరుకునేలోపు మరణించింది" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు సీబీ జోసెఫ్.#WATCH | EY employee's death allegedly due to 'overwork' | Ernakulam, Kerala: Father of EY employee Anna Sebastian Perayil, Sibi Joseph says, "... She joined there on March 18... After one week, she started the regular auditing. There are 6 audit teams in EY Pune and she was… pic.twitter.com/aMTabuAei0— ANI (@ANI) September 21, 2024 -
నవ్విపోదురు గాక.. మాకేటి సిగ్గు.. 'ఛీ'డీపీ అంటున్నా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘నవ్విపోదురు గాక.. మాకేటి సిగ్గు’’ అన్నట్లుంది టీడీపీ నేతల తీరు. మునిగిపోయిన టీడీపీ నావను ఎలాగైనా దారిలో పెట్టాలనే ఉద్దేశంతో నీచ రాజకీయాలకు తెర లేపుతున్నారు. జనం ఏమనుకుంటే ఏంటి.. అన్నట్లుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా అధికార పార్టీకి అంటగడుతూ.. చివరికి అవన్నీ అవాస్తవాలని తేలాక నవ్వులపాలవుతున్నారు. గత కొన్ని రోజులుగా జిల్లాలో జరిగిన కొన్ని ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ‘సంక్షేమం’ వెల్లివిరిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరిగాయి. జరుగుతున్నాయి. ఇంటి వద్దకే పథకాలు అందుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగానూ పెద్దపీట వేయడంతో ఆయా వర్గాల్లో ఆనందం నెలకొంది. కొన్ని రోజులుగా అధికార పార్టీ నిర్వహిస్తున్న సాధికార బస్సు యాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఓర్వలేని టీడీపీ.. సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష పార్టీల నేతలు రగిలిపోతున్నారు. ‘మీ బిడ్డ మంచి చేస్తేనే మళ్లీ ఆశీర్వదించండి’ అంటూ ప్రజలను నమ్ముకుని ముఖ్యమంత్రి ముందుకు సాగుతుంటే.. టీడీపీ నాయకులు మాత్రం బురదను నమ్ముకుని నీచ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వంపైనా, పథకాలపైనా, అధికార పార్టీ నాయకులపైనా ఏదో రకంగా బట్టకాల్చి మీద వేసిన చందంగా ప్రవర్తిస్తున్నారు. తమకు వత్తాసు పలికే ఎల్లో మీడియాలో దిగజారి అచ్చేసుకుంటున్నారు. ప్రజల్లో మరింతగా చులకనమవుతున్నారు. భార్యాభర్తలు గొడవ పడినా, అన్నదమ్ముల మధ్య వివాదం నెలకొన్నా వైఎస్సార్ సీపీ నాయకులే కారణమంటూ ప్రజలకే వెగటు పుట్టిస్తున్నారు. ఏమైందయ్యా మీకు..? టీడీపీ నేతలు జేసీ ప్రభాకరరెడ్డి, కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ ఇప్పటికే ప్రజల్లో చులకనైపోయారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు, చంద్రబాబు స్కాములు, జైలు పాలు కావడం వంటి పరిణామాలతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింతగా దిగజారి పోయింది. ఇక.. ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో వారిని ప్రజలు పట్టించుకోవడం లేదు. దీంతో ఎలాగైనా ప్రజల దృష్టి మరల్చాలనే దురుద్దేశంతో పచ్చ మీడియా తోడుగా విష ప్రచారం చేస్తున్నారు. దొంగే దొంగ అన్నట్లుగా.. • ఉరవకొండ నియోజకవర్గంలో వేలల్లో దొంగ ఓట్లు నమోదైనట్టు ఇటీవల తేలింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలో నమోదైనవే. కానీ అధికార పార్టీపై పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేసి అభాసుపాలయ్యారు. • రాయదుర్గం నియోజకవర్గంలో శనగల వ్యాపారి ఐపీ పెడితే దాన్ని మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కుటుంబానికి కాలవ శ్రీనివాసులు అంటగట్టారు.దీన్ని గురునాథ్ రెడ్డి సోదరుడు తీవ్రంగా ఖండించారు. ఉషశ్రీచరణ్ మంత్రి అయ్యాక తొలిసారి కళ్యాణదుర్గం వచ్చిన సందర్భంలో.. ఓ బాలింతకు దారి ఇవ్వక శిశువు మృతిచెందా రని కాలువ రాద్ధాంతం చేశారు. సీసీ ఫుటేజీల్లో చూస్తే ఎక్కడా అడ్డుకున్న దాఖలాలే లేవు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి దిగజారి ప్రవర్తించిన కాలవను ఆ పార్టీ కార్యకర్తలే విమర్శించారు. • విడపనకల్లులో ఉపాధ్యాయుడు మల్లేష్ ఆర్థిక కారణాలతో ఆత్మహత్యాయత్నం చేస్తే మాజీ మంత్రి పరిటాల సునీత రాద్ధాంతం చేశారు. తమను రాజకీయాలకు వాడుకోవద్దు అంటూ బాధిత కుటుంబం కాళ్లా వేళ్లా పడినా పరామర్శల పేరుతో పత్రికలకెక్కారు. • తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. సీఐ సస్పెండ్ అయినా అధికార పార్టీనే అంటారు. అభివృద్ధి పనులు అడ్డుకోవడం, కళాశాల ప్రహరీ కట్టొద్దంటూ అడ్డుకోవడం ఒకటా రెండా.. జిల్లాలో తీవ్ర వివాదాలకు జేసీ కేంద్ర బిందువుగా ఉన్నారు. ఇప్పటికే బస్సుల కొనుగోలులో ఈడీ కేసులను ఎదుర్కొంటున్న ఆయన తాను పవిత్రుడినని.. మిగతా అందరూ అవినీతి పరులని బురద జల్లుతుంటడం గమనార్హం. ఇవి చదవండి: పేద పిల్లల భవిష్యత్తుపై దెబ్బ కొట్టే రాతలు సహించం -
సీఏ విద్యార్థిని తీవ్ర నిర్ణయం! అసలేం జరిగింది?
సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న.. -
డైనమిక్ అయ్యర్
సవాలును తలకెత్తుకోవడం అంటే ‘తలకు మించిన భారం’ అనుకుంటారు కొందరు. సవాలును స్వీకరించడం అనేది తమను తాము నిరూపించుకునే అపూర్వ అవకాశం అనుకుంటారు మరికొందరు. అపర్ణ అయ్యర్ రెండో కోవకు చెందిన వ్యక్తి. ‘సీఏ పరీక్ష పాస్ కావడం అంటే మాటలు కాదు’ లాంటి ప్రతికూల మాటలు అదేపనిగా వినిపించినా ‘సీఏ’ పై ఆసక్తిని ఎప్పుడూ కోల్పోలేదు. ఆ ఆసక్తే ఆమెను సీఏ బంగారు పతక విజేతను చేసింది. సవాలును చిరునవ్వుతో స్వీకరించే ఆమె ధైర్యం ‘విప్రో’ లాంటి పెద్ద సంస్థలో సీఎఫ్‌వో (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించేలా చేసింది.... లీడర్ అంటే ఎవరు? దారి తెలిసిన వారు, ఆ దారిలో ఆటంకాలు లేకుండా ప్రయాణించే వారు, అవసరమైతే కొత్త దారి చూపించేవారు. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఎన్నో అపర్ణ అయ్యర్‌లో దండిగా ఉన్నాయి కాబట్టే ఆమె మల్టీనేషనల్ ఐటీ కార్పోరేషన్ విప్రోలో ఎన్నో ఉన్నతస్థానాల్లో పనిచేసింది. విప్రోతో ఆమెది రెండు దశాబ్దాల అనుబంధం. సీనియర్ ఇంటర్నల్ ఆడిటర్‌గా విప్రోలోకి అడుగు పెట్టిన అపర్ణ అక్కడి ఫైనాన్స్ టీమ్‌తో పని చేస్తూ ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ సీఎఫ్‌వో స్థాయికి చేరింది. ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్మెంట్, క్యాపిటల్ అలోకేషన్, ఫండ్ రైజింగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ గ్రోత్... మొదలైన సబ్జెక్లలో అపర్ణ నిపుణురాలు. సబ్జెక్ట్‌లో నైపుణ్యం ఉండగానే సరిపోదు. వివిధ సందర్భాలలో ఆ నైపుణ్యాన్ని సృజనాత్మకంగా అన్వయించి మంచి ఫలితాలు సాధించగలగాలి. ఈ విషయంలో ఎప్పుడూ వెనకబడిపోలేదు అపర్ణ అయ్యర్. ఇంటర్నల్ ఆడిట్, బిజినెస్ ఫైనాన్స్, ఫైనాల్సియల్ ప్లానింగ్ అండ్ ఎనాలటిక్స్, కార్పోరేట్ ట్రెజరీ....ఇలా కంపెనీకి సంబంధించి ఎన్నో విభాగాలో కీలకపాత్ర పోషించింది. ముంబై నర్సీ మోంజీ కాలేజి నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసిన అపర్ణ 2002 సీఏ (చార్టెట్ ఎకౌంటెంట్) గోల్డ్ మెడలిస్ట్. ‘అపర్ణ అయ్యర్‌లో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తన ముందుచూపు, సాహసోపేతమైన నిర్ణయాలతో సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది’ అంటున్నాడు విప్రో సీయివో డెలాపోర్ట్. ‘కీలకమైన సమయంలో సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. మరిన్ని విజయాలు సాధించే లక్ష్యంతో మా ప్రయాణం కొనసాగుతుంది’ అంటుంది అపర్ణ అయ్యర్. -
19 ఏళ్లకే సీఏ..గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది
విజయం గురించి కలలు కనేవారికి...విజేతల నోటి నుంచి వచ్చిన మాటలు ఆణిముత్యాలు అవుతాయి. ఆచరణకు కొత్త మెరుగులు దిద్దుకునే పాఠాలు అవుతాయి. వరల్డ్స్ యంగెస్ట్ ఫిమేల్ చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన నందిని అగర్వాల్ జోష్ టాక్ (ఇన్స్పిరేషనల్ టాక్స్)తో వ్యక్తిత్వ వికాస కోణంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెబుతోంది... నందిని అగర్వాల్‌కు ఎప్పుడూ తొందరే. పరీక్షలు ఇంకో వారంరోజుల్లో ఉంటే ‘రేపే అయితే బాగుండేది’ అనుకునేది. ఈ తొందర ఆమెను రెండు క్లాసులు జంప్ చేసేలా చేసింది. అలా అన్నకు క్లాస్మేట్గా మారింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాకు చెందిన నందిని అగర్వాల్ పందొమ్మిది సంవత్సరాల వయసులో సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలలో (2021)లో ఆలిండియా టాపర్‌గా నిలిచింది. అన్న సచిన్ అగర్వాల్‌కు 18 ర్యాంకు వచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో ఈ అన్నాచెల్లెళ్లను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒకరోజు నందిని చదువుతున్న స్కూల్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ వచ్చారు. ఆ వ్యక్తి అపురూపంగా కనిపించారు. తాను కూడా గిన్నిస్‌బుక్‌లో పేరు సం΄ాదించాలని ఆ సమయంలోనే కల కన్నది నందిని. అప్పుడే ఆమె దృష్టి సీఏపై పడింది. అయితే సీఏ ఎంట్రెన్స్ కోచింగ్ సమయంలో తనను ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం, చిన్నచూపు తనలో మరింత పట్టుదల పెంచింది. అనుకున్న లక్ష్యాన్ని అవలీలగా సాధించి ‘ఔరా’ అనిపించింది. ‘నా విజయంలో మా అన్నయ్యది ప్రధాన పాత్ర. మాక్ టెస్ట్‌లో నాకు అత్తరసు మార్కులు వచ్చాయి. చాలా నిరాశగా అనిపించింది. మాక్ టెస్ట్‌లోనే ఇలా ఉంటే రియల్ టెస్ట్‌లో ఎలా ఉంటుంది అని భయపడ్డాను. ఆ సమయంలో అన్నయ్య ఎంతో ధీమా ఇచ్చాడు. నువ్వు కచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోగలవు అన్నాడు. ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించాయి’ అంటుంది నందిని.‘నందినిలోని నాకు బాగా నచ్చిన విషయం... బాగా కష్టపడి చదువుతుంది. ఒకవిధంగా చెప్పాలంటే చెల్లి నాకు స్ఫూర్తి. నందినిని చూసిన తరువాత నేను కూడా చదువుపై బాగా దృష్టి పెట్టాను’ అంటాడు సచిన్ అగర్వాల్. ఇక నందిని అగర్వాల్ ‘జోష్ టాక్’లో ఆకట్టుకునే కొన్ని మాటలు... ►కొత్త వ్యక్తులు, కొత్తప్రదేశాలతో నిరంతర పరిచయం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది. ► జీవితం సులభంగా సాగిపోవాలంటే కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు వ్యక్తిగత స్వార్థంతో చేసే సహాయానికి విలువ ఉండదు. ► ‘నువ్వు ఇలాగే ఉంటావు. ఇది మాత్రమే సాధించగలవు’ అనే మాటలు అవతలి వ్యక్తుల నుంచి రాకుండా చూసుకోవాలి. మనం ఎలా ఉండాలి అనేది మనం నిర్ణయించుకోవాలి, మనం ఏది సాధించగలమో మనకు తెలిసి ఉండాలి. ► ‘నీవల్ల ఏమవుతుంది!’ అనేది ఎంతోమంది విజేతలకు సుపరిచితమైన మాట. ఆ మాటను తేలిగ్గా తీసుకొని ‘కచ్చితంగా నా వల్లే అవుతుంది’ అని వారు అనుకోవడం వల్లే విజేతలయ్యారు. ►జీవిత సత్యాలను ఎక్కడినుంచైనా నేర్చుకోవచ్చు. చివరికి ఐస్‌క్రీమ్ నుంచి కూడా! ‘ఎంజాయ్ ది లైఫ్ బిఫోర్ ఇట్ మెల్ట్స్’ ► సక్సెస్ఫుల్ లీడర్లు వర్క్‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న దానిపై బాగా వర్క్ చేస్తారు. ► నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఇతరులను ఎప్పుడూ కంట్రోల్ చేయలేవు. కలల సాధనకు కష్టాన్ని జోడించకపోతే కల కనే అర్హత కోల్పోతాం ► మన జీవితానికి హ్యాపీ వెర్షన్ ఏమిటంటే బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లడం ∙పనిలో తప్పులో చేసినా ఫరవాలేదుగానీ ఏమీ చేయకపోవడమంత తప్పు మరొకటి లేదు. ► మనం ఎక్కువగా భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటాం. గతంలో జరిగిన పొరపాట్ల గురించి అదేపనిగా పశ్చాత్తాపపడుతుంటాం. నిజానికి మనం చేయాల్సింది... వర్తమాన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం. ► మీ టైమ్‌ను సేవ్ చేసుకోకపోవడం తెలియకపోతే, టైమ్ మిమ్మల్ని సేవ్ చేయదు. కలలు అనేవి మనకు ఉన్న అతి పెద్ద ఆస్తులు. ఇతరుల అసూయ, ద్వేషాలతో అవి కరిగిపోకుండా చూసుకోవాలి. From watching inspirational talks to giving one on Josh Talks! pic.twitter.com/ywULGdq3On — Nandini Agrawal (@canandini19) March 4, 2023 -
ఎవరెస్ట్ ఎక్కించిన తెలుగుపాఠం..
నిర్మల్: ఆయనో చార్టెడ్ అకౌంటెంట్. పక్షంరోజులు పనులన్నీ పక్కనపెట్టి, ఏకంగా ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి వెళ్లారు. తొలిసారే అవకాశం లేదనడంతో వెనక్కి తగ్గేది లేదంటూ.. ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకూ వెళ్లారు. ఆయన హిమాలయాలకు వెళ్లడానికి, అంత ఎత్తు ఎక్కడానికి కారణం తొమ్మిదో తరగతిలో ఆయన విన్న తెలుగుపాఠం కారణం. ఎవరా సీఏ, ఏమా తెలుగుపాఠం.. వివరాలివిగో! నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ముక్క సాయిప్రసాద్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన కరీంనగర్‌లోని పారామిత హైసూ్కల్లో చదువుకున్నారు. తెలుగుసార్ సన్యాసిరావు తొమ్మిదో తరగతి పాఠంలో భాగంగా ‘అటజని కాంచె భూమిసురుడు..’ అనే పద్యాన్ని చెబుతూ హిమాలయాలను అందంగా వర్ణించారు. అది సాయిప్రసాద్ మనసులో బలంగా నాటుకుపోయింది. ఎప్పటికైనా హిమాలయాలకు వెళ్లాలని, ఆ అందాలను చూడాలని అప్పుడే ఫిక్స్ అయ్యారు. తరువాత ఉన్నత చదువులు, కెరీర్లో పడిపోయినా.. ఇరవైఏళ్ల కిందట విన్న పాఠం, హిమాలయాలకు వెళ్లాలన్న ఆలోచన ఆయన మదిలో మెదులుతూనే ఉంది. మొదటిసారి కావడంతో.. అయితే.. గతనెల 28న నేపాల్ రాజధాని ఖాట్మాండు వెళ్లిన ఆయన అక్కడి నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. మొత్తం ఎవరెస్ట్ శిఖరం ఎత్తు 8,849 మీటర్లు కాగా, బేస్ క్యాంప్ 5,364 మీటర్లు ఉంటుంది. తొలిసారి ఎవరెస్ట్ ఎక్కాలనుకునేవారిని ఈ బేస్ వరకే అనుమతిస్తారు. సాయిప్రసాద్‌ను సైతం బేస్ వరకే అనుమతించారు. ఏడురోజుల పాటు ఎక్కుతూ ఈనెల 6న ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. తన కుటుంబం, మిత్రుల సహకారంతో ఇక్కడి వరకూ వచ్చానని సాయిప్రసాద్ చెప్పారు. తనతో పాటు ఆయన మిత్రుడు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన నార్లాపురం గిరిధర్‌ను కూడా ఒప్పించి వెంట తీసుకెళ్లారు. హిమాలయాలు అద్భుతం.. హిమాలయాల గురించి వింటుంటాం. కనులారా చూస్తేనే వాటి అందం తెలుస్తుంది. నాకు ట్రెక్కింగ్ అనుభవం లేదు. కానీ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇస్తాను. అదే నేను ఎవరెస్ట్ బేస్‌క్యాంప్ వరకు చేరడానికి ఉపయోగపడింది. అక్కడికి వెళ్లి హిమాలయాలను చూడటం మర్చిపోలేని ఫీలింగ్. మరోసారి ఎవరెస్ట్ మొత్తం ఎక్కడానికి ప్రయత్నిస్తా. – ముక్క సాయిప్రసాద్, సీఏ, నిర్మల్ -
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు.. హైదరాబాద్ ఆడిటర్ గోరంట్ల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్‌కు చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబుని సీబీఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం గోరంట్లను ఢిల్లీకి పిలిపించిన సీబీఐ అధికారులు మంగళవారం సాయంత్రం ఆయనని అదుపులోనికి తీసుకున్నారు. బుచి్చబాబు విచారణకు సహకరించడంలేదని, అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తూ ఉండడంతో అరెస్ట్ చేసినట్టుగా బుధవారం సీబీఐ అధికారులు తెలిపారు. ఢిల్లీ కొత్త మద్యం విధానం 2021–22 రూపకల్పనలో గోరంట్ల బుచి్చబాబు పాత్ర ఉందని హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా ఆయన వ్యవహరించారని సీబీఐ ఆరోపిస్తోంది. ప్రత్యేక కోర్టులో ఆయనని హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 11 వరకు కస్టడీకి అప్పగించింది. బుచి్చబాబుని సీబీఐ గతేడాది ఆగస్టు, అక్టోబర్ మధ్య కాలంలో 15 సార్లు విచారించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు కూడా విచారణ జరిపింది. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లైకి చార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు గోరంట్ల బుచ్చిబాబు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ పాలసీలో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారణ కాగా.. గతంలోనూ సీబీఐ కూడా అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది. అంతేకాదు పలుమార్లు ఢిల్లీకి పిలిచి విచారించింది కూడా. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో, తద్వారా హైదరాబాద్‌కు చెందిన హోల్‌సేల్, రిటైల్ లైసెన్సీలకు లాభం చేకూర్చడంలో పాత్ర పోషించినందుకు గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేసింది సీబీఐ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాదుకు చెందిన పలు సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి చేతులు మారడంలో బుచ్చిబాబు కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం.. అరెస్ట్ చేసిన గోరంట్ల బుచ్చిబాబును రౌస్ఎవిన్యూ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టనుంది సీబీఐ. ఆపై విచారణ కోసం కస్టడీకి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. గోరంట్ల బుచ్చిబాబు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీఏగా పనిచేసినట్లు ఆ మధ్య కొన్నికథనాలు తెరపైకి వచ్చాయి. కిందటి ఏడాది సెప్టెంబర్‌లో.. లిక్కర్ స్కాం లింకులతో దేశవ్యాప్తంగా నలభై చోట్ల ఈడీలు సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో దోమలగూడ(హైదరాబాద్) అరవింద్‌నగర్‌లోని శ్రీసాయికృష్ణ రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో ఉన్న బుచ్చిబాబు కార్యాలయంలో ఈడీ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది కూడా. కవిత స్థాపించిన తెలంగాణ జాగృతి రిజస్టర్ట్ అడ్రస్‌కు సమీపంలోనే ఉన్న గోరంట్ల అసోసియేట్స్ ఆఫీసులో ఈ దాడులు జరగడం సరికొత్త అనుమానాలకు దారితీసింది అప్పట్లో. అంతేకాదు కవితతో కలిసి దిగిన ఫొటోలు సైతం బాగా వైరల్ అయ్యాయి. -
బిజినెస్‌కు ఈజీ మ్యాప్
చాలా మంది మహిళలు తమ సొంత కాళ్లమీద నిలబడటానికి ఉద్యోగమో, వ్యాపారమో చేయాలనుకుంటారు. ఉద్యోగానికైతే కొన్ని అర్హతలు ఉండాలివ్యాపారం చేయాలంటే.. పెట్టుబడి ఉంటే చాలనుకుంటారు. కానీ, కుటుంబం నుంచి అందుకు తగిన మద్దతు రాకపోతే .. నైపుణ్యాలు లేవని వెనకడుగువేస్తేపెట్టుబడి లేదని చతికిలపడితే.. హైదరాబాద్ నానక్‌రాంగూడలో ఉన్న కుంబజాడల సంహితను కలవచ్చు. చార్టర్డ్‌అకౌంటెంట్ అయిన సంహిత దిగువ, మధ్యతరగతి మహిళలు వ్యాపారంలో రాణించడానికి కావల్సిన అవగాహన తరగతులను ఉచితంగా ఇస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులచేత వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నారు. అనుకున్న బిజినెస్‌కు ఈజీ మ్యాప్ డిజైన్ చేసిస్తున్నారు.. ‘మహిళలు ఎవ్వరైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు’ అని చెప్పే సంహితను తనకు కలిగిన ఈ ఆసక్తి గురించి అడిగినప్పుడు ఎన్నో విషయాలు పంచుకున్నారు. ‘‘సాధారణంగా చాలామంది చార్టర్డ్ అకౌంటెంట్ అంటే కంపెనీ అకౌంటింగ్, ఆడిటింగ్ పనులు చూస్తారు, అంతవరకే వారి డ్యూటీ అనుకుంటారు. కానీ, ‘మీ బిజినెస్‌ను ఇలా ముందుకు తీసుకువెళ్లచ్చు’ అని గైడెన్స్ ఇవ్వాలనుకోరు. నేను ఉద్యోగరీత్యా ముంబై, ఢిల్లీ, చెన్నై, యు.ఎస్ లలో వర్క్ చేశాను. అన్ని చోట్లా మహిళల పని సామర్థ్యాల పట్ల అవగాహన ఉంది. వివిధ రంగాల్లో నైపుణ్యం గల స్నేహితులున్నారు. వీరితో కలిసి ‘మహిళలు వ్యాపార రంగంలో రాణించడం’ అనే అంశాల మీద చర్చిస్తున్నప్పుడే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి సరైన గైడెన్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన చేశాను. నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ప్రోస్క్వాడ్ కన్సల్టింగ్ను ఏర్పాటు చేసి, నా వర్క్‌కు సంబంధించిన పనులు చూస్తున్నాను. అవగాహనే ప్రధానంగా.. రెండేళ్ల క్రితం ఆంధ్రాలో ఒకమ్మాయి తొక్కుడు లడ్డు 2/– రూపాయలకు ఒకటి అమ్మడం చూశాను. వాళ్లమ్మగారు ఆసుపత్రిలో ఉన్నారు. ఆమె మరొక అమ్మాయితో కలిసి ఈ చిన్న బిజినెస్ చేస్తోంది. ఆ రోజు వాళ్లిద్దరూ 150 లడ్డూలు అమ్మారు. అంత మంచి స్వీట్, తక్కువ ధరకు అమ్ముతున్నారు. వారికి ఆ స్వీట్స్‌ను ఎలా మార్కెటింగ్ చేయాలో చెప్పాలనుకున్నాను. దాంతోపాటు బ్యాంకుల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం, ప్యాకేజీ సిస్టమ్, మార్కెటింగ్ ఐడియాలు ఇవ్వడంతో ఇప్పుడు వారి వ్యాపారం లక్షల్లో నడుస్తోంది. ఆ అమ్మాయిలిద్దరూ చదువుకున్నవారు కాదు. ఒకరు టైలరింగ్ చేసేవారు, ఇంకొక అమ్మాయి ఇంట్లోనే ఉండేది. ఇప్పుడు వారిని చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. అదిలాబాద్‌కు చెందిన ఒకరి బిజినెస్ దాదాపు మూతపడిపోయే దశలో ఉన్నప్పుడు మమ్మల్ని కలిశారు. ఇప్పుడు వారి వ్యాపారంలో ఏ చిన్న సందేహం వచ్చినా ఫోన్ చేసి సలహా అడుగుతుంటారు. ప్రతి ఒక్కరికీ సొంతంగా ఎదగాలనే ఆలోచన ఉంటుంది. కానీ, సరైన అవగాహన లేక వెనకబడిపోతుంటారు. లేదంటే ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. ఇలాంటప్పుడు సరైన గైడెన్స్ ఇచ్చేవారుంటే తిరిగి నిలదొక్కుకుంటారు. ఈ ఉద్దేశ్యంతోనే రెండేళ్ల నుంచి చిన్న, మధ్య తరగతి మహిళా వ్యాపారులకు అవగాహనా తరగతులను నిర్వహిస్తున్నాం. అందుకు విధి విధానాలను రూపొందించాను. మొదలుపెట్టిన యేడాదిలోనే వందకు పైగా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. ఆ తర్వాత యేడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యింది. రిస్క్ అని వద్దనుకుంటారు.. ఏదైనా సొంతంగా వర్క్ స్టార్ట్ చేద్దామని వచ్చినవారిని ‘ముందు మీ ఇంట్రస్ట్ ఏంటి?’ అనే ప్రశ్నతో మొదలుపెడతాం. ఆ తర్వాత వారితో 2–3 సెషన్స్ నడుస్తాయి. ఎందుకంటే, ఏ చిన్న బిజినెస్ మొదలుపెట్టాలన్నా రెండు, మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇలాంటప్పుడు వారిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. కుటుంబం అంత పెట్టుబడి పెట్టలేకపోవచ్చు. పైగా ‘మార్కెట్ గురించి ఏమీ తెలియకుండా పెట్టుబడి పెడితే, ఫెయిల్యూర్ వస్తే తట్టుకోలేం’ అనేది ఉంటుంది. ఇవన్నీ వారితో చర్చిస్తాం. వారిలో ఉన్న స్కిల్స్‌ని పరిగణనలోకి తీసుకొని, ఆ తర్వాత బిజినెస్‌లో ప్రోత్సహిస్తాం. ఇందుకు కన్సల్టేషన్ ఫీజు ఉండదు. బిజినెస్ చేయాలనుకునేవారి ఆలోచనకు మా గైడెన్స్ ఒక సులువైన రోడ్ మ్యాప్‌లా ఉంటుంది. నెమ్మదిగా ప్రయాణం.. ఇప్పటి వరకు మా దగ్గరకు వచ్చే వారి నుంచి ఇంకొంత మందికి తెలిసి, వారి ద్వారా మరికొంతమంది చేరుతున్నవారే ఉన్నారు. అలా ఇప్పటి వరకు 350 మంది క్లయింట్స్ ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్లో ప్రాసెస్. ‘మీరెందుకు ఫ్రీ సర్వీస్ ఇస్తారు..’ అనేవారూ ఉన్నారు. ఈ సందేహం నిజమే.. మార్కెట్లో మా గైడెన్స్‌తో నిలదొక్కుకున్నాక వాళ్లు ఇంకా పై స్థాయికి చేరుకోవాలనుకున్నప్పుడు ఛార్జ్ ఉంటుంది. ఈ మొత్తం మరికొందరికి గైడెన్స్ ఇవ్వడానికి సహాయపడుతుంది. మార్కెట్లో ఏ ప్రొడక్ట్‌కైనా ఎమ్ఆర్పీ ఉంటుంది. కానీ, మా వర్క్‌కి అలా ఉండదు. ఈ వర్క్‌కి ఎంత చార్జ్ చేయచ్చు అనేది కూడా తెలియదు. కొందరికి వారి బిజినెస్‌ను బట్టి ఛార్జ్ ఉంటుంది. స్వతంత్రంగా ఎదగడం, ఆర్థికంగా నిలబడాలనే విషయంలో మహిళల ఆలోచన పెరుగుతోంది. చాలా మంది మహిళలు నా కోసం నేను ఏ కొంచెమైనా డబ్బు సంపాదించుకోగలనా అని ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మహిళల్లో మల్టీటాస్కింగ్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి, వారికి కొంత ప్రోత్సాహమిస్తే చాలు అనుకున్న స్థాయికి చేరుకోగలరు. ఆ ప్రోత్సాహమే నేను ఇవ్వాలనుకున్నది’’ అని వివరించారు ఈ చార్టర్డ్ అకౌంటెంట్. – నిర్మలారెడ్డి -
ఢిల్లీ లిక్కర్ స్కాం: సీబీఐ విచారణకు సీఏ బుచ్చిబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు దూకుడు పెంచాయి. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు పంపించాయి. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సోమవారం విచారించింది ఈడీ. ఇదే కేసులో హైదరాబాద్ వాసి అరుణ్ రామచంద్ర పిళ్లైని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా.. ఈరోజు(మంగళవారం) సీబీఐ ముందు హాజరుకానున్నారు సీఏ బుచ్చిబాబు. రాబిన్ డిస్టిలరీస్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేశారు బుచ్చిబాబు. ఇప్పటికే ఢిల్లీలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్‌ను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇదీ చదవండి: Delhi Liquor Scam: అభిషేక్ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్! -
AP Special: సానుభూతి వద్దు... సమాజంలో గౌరవం కావాలి
సమాజంలో మాకు తగిన గౌరవం కావాలి.. ఉద్యోగసానుభూతి వద్దు.. సమాజంలో ఉద్యోగ, వ్యాపార రంగంలో ప్రోత్సహకాలు ఇవ్వాలి.. లాక్డౌన్ కాలంలో ప్రభుత్వ పథకాలతో పూట గడుపుకుంటున్న శారీరక, మానసిక వైకల్యం ఉన్నవారూ సమాజంలో భాగస్వాములే. అందుకనే వీరిని ఇప్పుడు ‘వికలాంగులు’ అని కాకుండా ‘దివ్యాంగులు’ అని అంటున్నాం. ‘శారీరకంగా సవాలును ఎదుర్కొంటున్న వ్యక్తులు’ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ‘మరోక విధంగా సామర్థ్యం ఉన్న వ్యక్తులు’ అని వీరికి పేర్లు. ఎవరైనా ఒక వ్యక్తి నలభై శాతానికి తక్కువ కాకుండా ఏదైన వైకల్యం కలిగి ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించినట్లయితే.. అలాంటి వ్యక్తిని అంగవైకల్యం ఉన్న వ్యక్తిగా నిర్ధారిస్తారు. అంధత్వం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఎందరో దివ్యాంగులు వివిధ రంగాల్లో రాణిస్తూ మరి కొందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. చిత్తూరు: తిరుపతి నగరానికి చెందిన సి.ఆర్.వి. ప్రభాకర్ విద్యారంగంలో సాధించిన తాను సాధించిన విజయానలకు అంగవైకల్యం ఏ మాత్రం ఆటంకం కాదని నిరూపించాడు. ఈయన తండ్రి సి. వెంకటేశ్వర శర్మ, తల్లి విద్యావతి. తండ్రి సి.వెంకటేశ్వర శర్మ.. టీటీడీలో సూపరింటెండెంట్‌గా పనిచేసి ప్రస్తుతం రిటైర్డు అయ్యారు. ఈ దంపతులకు ప్రభాకర్ రెండవ సంతానం. ప్రభాకర్.. గత 22 సంవత్సరాలుగా కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు. పుట్టుకతో వచ్చిన సమస్యను ఎప్పుడూ లోపంగా పరిగణించలేదు. కేవలం వీల్‌చైర్‌కే ఇతని జీవితం పరిమితమైనప్పటికీ ఎంతో కృషితో ఉన్నత చదువులు చదివారు. ఇటివల సీఏ(చార్టెర్డ్ అకౌంటెంట్) కోర్సును పూర్తిచేశారు. ప్రభుత్వం తనకు సహకారం అందిస్తే ఆత్మగౌరవంతో మరికొందరికి స్ఫూర్తి అవుతానని అభిప్రాయ పడ్డారు. అదే విధంగా.. వ్యాపార రంగంలో ప్రోత్సాహలు ఇవ్వాలని అన్నారు. మనదేశంలో అంగవైకల్య సమస్యకు సరైన మందులు, సర్జరీ సౌకర్యాలు లేవని అన్నారు. అమెరికా వంటి దేశంలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉందని అన్నారు. అయితే, రూ.15 కోట్ల ఖర్చు చేసిన అది తాత్కలిక వైద్యమే అన్నారు. తాను ఎంతో కష్టపడి సీఏ పూర్తి చేశానని అన్నారు. ఓ వ్యాపార సంస్థ ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నది తన జీవిత లక్ష్యమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు మరిన్నిసబ్సిడీతో కూడిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు,బ్యాంకు రుణాలు ఇవ్వాలని ప్రభాకర్ కోరాడు. తిరుత్తణి దేవ పెయింటర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పూట గడుపుతున్నాం.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తినడానికి తిండి లేక ప్రాథమిక వైద్యం అందక అనేక ఇబ్బందులకు గురౌతున్నామని తిరుత్తణి దేవ అనే పెయింట్ కార్మికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తాను గత 17 సంవత్సరాలుగా పెయింట్ చేస్తూ బతుకున్నానని తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలైన అమ్మఒడి, వికలాంగ పింఛను,వైఎస్సార్ ఆసరా, భరోసా వంటి పథకాల ద్వారా వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్లు తెలిపారు. ఏపీ సీఎం జగన్ ఆశయం గొప్పదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అనేక చిరు వ్యాపారాలు ప్రారంభించాలని , అనేకమార్లు ప్రయత్నించి విఫలమయ్యాయని వాపోయాడు. బ్యాంకు అధికారుల నుంచి ఎలాంటి సహకారం అందటం లేదని తెలిపారు. తనలాంటి దివ్యాంగులకు ఎలాంటి సిఫారసు లేకుండా బ్యాంకులు రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని పెయింటర్ తిరుత్తణి దేవ కోరుతున్నాడు. -
చార్టెడ్ అకౌంటెంట్ సింధు మృతి పై పలు అనుమానం
-
చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ.. ఏది బెటర్
జాబ్ మార్కెట్ వేగంగా మారిపోతోంది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్య కోర్సులను ఎంచుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)ల్లో.. ఏది బెటర్ అనే విషయంలో విద్యార్థులు త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ కోర్సులకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని.. కొందరు చార్టర్డ్ అకౌంటెన్సీలో చేరుతుండగా.. మరికొందరు ఎంబీఏను ఎంచుకుంటున్నారు. సీఏ, ఎంబీఏల ప్రత్యేకతపై అవగాహన పెంచుకోవడం ద్వారా విద్యార్థులు తమకు నప్పే కోర్సులో చేరొచ్చు!! ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రొఫెషనల్ కోర్సులకు జాబ్ మార్కెట్లో అధిక ప్రాధాన్యం ఉన్న సంగతి తెలిసిందే. సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు పూర్తిచేసుకుంటే.. అవకాశాలకు కొదవలేదు. మేనేజ్మెంట్, అనాలసిస్, బిజినెస్ స్ట్రాటజీ పరిజ్ఞానంతో ఎంబీఏలు కార్పొరేట్ రంగంలో ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు. మరోవైపు సీఏ కోర్సుతో అకౌంటింగ్, ఫైనాన్స్ రంగాల్లో దూసుకుపోవచ్చు. సీఏ చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ కోర్సు. సీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. ఫైనాన్షియల్ అండ్ అకౌంటింగ్ విభాగాలకు అవసరమైన నిపుణులను అందించడం. మన దేశంలో ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) నిర్వహిస్తోంది. సీఏ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రొషెషనల్ సీఏగా గుర్తింపు లభిస్తుంది. ఈ కోర్సులో చేరేందుకు కనీస అర్హత 10+2/ఇంటర్మీడియట్. ఇంటర్ తర్వాత.. ‘కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్’(సీపీటీ)కు హాజరు కావాలి. బ్యాచిలర్ డిగ్రీ తర్వాత ‘ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు’ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.. సంక్షిప్తంగా ఎంబీఏ. ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. ఐఐఎంలు వంటి ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ చేసినవారికి అవకాశాలు విస్తృతం. సైన్స్/హ్యూమానిటీస్/కామర్స్/ఇంజనీరింగ్.. ఇలా ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏలో చేరొచ్చు. డిగ్రీ తర్వాత క్యాట్/మ్యాట్/ఎక్స్‌ఏటీ వంటి జాతీయ స్థాయి ఎంట్రన్స్ టెస్ట్‌లు; ఐసెట్ వంటి రాష్ట్ర స్థాయి పరీక్షల్లో ర్యాంక్ సాధించాల్సి ఉంటుంది. ఎంబీఏ కోర్సు ప్రధాన లక్ష్యం.. కంపెనీలు, వ్యాపారాల నిర్వహణకు అవసరమైన మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మొదలైన విభిన్న నైపుణ్యాలు అందించడం. కోర్సుల వ్యవధి సీఏ కోర్సులో..ఇంటర్మీడియట్ అర్హతతో చేరి.. నాలుగేళ్లలో పూర్తిచేసుకోవచ్చు. ఇందులో సీపీటీ, ఐపీసీసీ, సీఏ ఫైనల్ ఉంటాయి. ఎంబీఏ కోర్సు వ్యవధి రెండేళ్లు. నాలుగు సెమిస్టర్లుగా ఉంటుంది. సీఏతో కెరీర్ సీఏ ఉత్తీర్ణులైన వారికి ఆడిటర్, ఫైనాన్స్ మేనేజర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. సీఏ కోర్సు పూర్తి చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీల్లో అవకాశాలు అందుకోవచ్చు. సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం సైతం ఉంటుంది. ఆడిటింగ్ ఫర్మ్స్, ట్యాక్సేషన్, మేనేజింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కార్పొరేట్ లా కంపెనీల్లో కొలువుతోపాటు సీఏగా సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించొచ్చు. ఎంబీఏతో ఉద్యోగాలు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో మేనేజర్స్, టీమ్ లీడర్స్, హెచ్ఆర్ హెడ్ వంటి కొలువులు లభిస్తాయి. పేరున్న బీస్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన వారికి దేశ విదేశాల్లో కార్పొరేట్ రంగంలో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మార్కెటింగ్ మేనేజర్/కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్, హెచ్ఆర్ మేనేజర్, ఐటీ/ఆపరేషన్స్ మేనేజర్, అనలిస్ట్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌తోపాటు మరెన్నో విభాగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. నైపుణ్యాలు ► చార్టర్డ్ అకౌంటెంట్‌గా రాణించాలంటే.. అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్‌పై పట్టు అవసరం. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. ► ఎంబీఏలకు నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టైమ్ మేనేజ్మెంట్, బిజినెస్ స్కిల్స్ తప్పనిసరి. దేనికదే ప్రత్యేకం ► వాస్తవానికి సీఎ, ఎంబీఏ దేనికదే ప్రత్యేకమైనవి. కాని ఎక్కువ మంది ఈ రెండు కోర్సులను పోలుస్తుంటారు. ఏ కోర్సుతో మంచి అవకాశాలు లాభిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. సీఏ.. అకౌంటెన్సీకి సంబంధించిన కోర్సు. కాగా, ఎంబీఏ వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన ప్రోగ్రామ్. ఎంబీఏలో.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వంటి పలు స్పెషలైజేషన్స్ ఎంచుకోవచ్చు. డ్యూయల్ స్పెషలైజేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. ► ఎంబీఏతో పోలిస్తే సీఏ కోర్సు పూర్తిచేసుకునేందుకు అయ్యే ఖర్చు తక్కువ. కాని సీఏ కోర్సు కొంత కఠినమైందనే అభిప్రాయం ఉంది. ఒకసారి ఎంబీఏలో చేరితే.. రెండేళ్లు పూర్తయ్యేసరికి పట్టా చేతికొస్తుంది. కాని సీఏ కోర్సులో చేరే విద్యార్థుల్లో మూడు నుంచి ఐదు శాతం మంది మాత్రమే నిర్దిష్ట సమయంలోపు కోర్సు ఉత్తీర్ణులవుతున్నారు. ► ఎంబీఏను.. ఐఐఎంలు, ఐఎస్బీ తదితర టాప్ బీ స్కూల్స్‌లో పూర్తిచేయాలంటే.. చాలా వ్యయం అవుతుంది. రూ.లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కోర్సులో చేరినవారిలో దాదాపు 80 శాతం మంది మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తున్నారు. టాప్ బీ స్కూల్స్‌లో ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఆకర్షణీయ వేతనాలతో కొలువులు ఖాయం అవుతున్నాయి. -
టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెట్‌పై చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజ్‌ను ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. దీనిపై మ్యాచ్ అంపైర్లకు కెప్టెన్ రహానేతో పాటు సిరాజ్‌లు ఫిర్యాదు. ఈ క్రమంలోనే నిన్న మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. (టీమిండియాకు భారీ టార్గెట్) ఎవరైతే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారో వారిని పోలీసులు బయటకు పంపారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగుర్ని మ్యాచ్ చూసే అనుమతి క్యాన్సిల్ చేస్తూ బయటకు పంపించేశారు. వారంతా మద్యం సేవించే భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీనిపై టీమిండియాకు క్రికెట్ ఆలియా(సీఏ) క్షమాపణలు తెలిపింది. మరొకవైపు దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇదొక జంటిల్ మ్యాన్ గేమ్ అని, ఇక్కడ జాతి వివక్ష వ్యాఖ్యలకు చోటు లేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దీనిపై సీఏ సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మరో రెండు వారాల్లో దీనిపై సీఏ విచారణ చేపట్టనుంది. ఇది పూర్తిగా ఆతిథ్యం దేశం బాధ్యత కాబట్టి సీఏనే విచారణ జరుపనుంది. ఇదిలా ఉంచితే, టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 407 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 312/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 400లకు పైగా టార్గెట్‌ను టీమిండియా ముందుంచింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్(73), స్టీవ్ స్మిత్(81), కామెరూన్ గ్రీన్(84)లు రాణించడంతో పాటు కెప్టెన్ టిమ్ పైన్(39 నాటౌట్) ఆకట్టుకోవడంతో ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. -
‘బీసీసీఐ మైండ్ గేమ్ ఆడుతోంది’
సిడ్నీ: సమయం దొరికినప్పుడల్లా భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ)పై విరుచుకుపడే ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్.. మరొకసారి ధ్వజమెత్తాడు. గతంలో ఐపీఎల్ కంటే టీ20 వరల్డ్‌కప్‌కే తన తొలి ప్రాధాన్యత అని బీసీసీఐ వైఖరిని తప్పుబట్టిన బోర్డర్.. ఈసారి టీమిండియా మైండ్‌గేమ్ ఆడుతోందని విమర్శించాడు. ఎప్పట్నుంచో తమ సాంప్రదాయంగా నిర్వహిస్తున్న న్యూఇయర్ టెస్టు మ్యాచ్ విషయంలో మార్పులు చేయాలని బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరడంపై మండిపడ్డాడు. ఇది సరైన వైఖరి కాదంటూ బీసీసీఐ తీరును తప్పుబట్టాడు. ఇక్కడ బీసీసీఐ మైండ్ గేమ్‌కు తెరలేపిందన్నాడు.ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత భారత జట్టు.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఈ మార్చి నెలలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను కోవిడ్-19 కారణంగా రద్దు చేసుకున్న టీమిండియాకు ఆ తర్వాత ఇదే అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్. (చదవండి: అతను చాలా డేంజరస్ ప్లేయర్: సచిన్) ఈ నెలలో టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కావాల్సిన ఉన్నప్పటికీ కరోనా వైరస్ కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆ ప్లేస్‌లో ఐపీఎల్‌ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఇప్పుడు ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఆసీస్‌తో జనవరి 3వ తేదీ నుంచి ఆరంభం కావాల్సి ఉన్న న్యూఇయర్ టెస్టు మరింత వెనక్కి జరపాలని బీసీసీఐ కోరింది. జనవరి 7వ తేదీ నుంచి ఆ టెస్టును నిర్వహించాలని బీసీసీఐ తన విజ్ఞప్తిలో పేర్కొంది అయితే దీనిపై బోర్డర్ విరుచుకుపడ్డాడు. ఒక పర్యటనకు ముందు బీసీసీఐ ఇలా కోరడం మైండ్ గేమ్ కాకపోతే ఏంటని ప్రశ్నించాడు. బాక్సింగ్ డే టెస్టు, న్యూ ఇయర్ టెస్టు అనేది తమకు ఎప్పట్నుంచో వస్తున్న సాంప్రదాయమని గుర్తు చేశాడు. మరి న్యూఇయర్ టెస్టును రీ షెడ్యూల్ చేయాలని కోరడం వెనక కారణం ఏమిటని నిలదీశాడు. తమ దేశానికి పర్యటనకు వచ్చే ముందు ఇలా మైండ్ గేమ్ ఆడతారా అంటూ బీసీసీఐని విమర్శించాడు. వరల్డ్ క్రికెట్లో తాము శక్తివంతులమని బీసీసీఐ భావిస్తోందని, ఆర్థికంగా బలంగా ఉన్నా విషయాల్లో కచ్చితత్వం అనేది అవసరమని బోర్డర్ పేర్కొన్నాడు. నవంబర్ చివరి వారంలో ఆస్ట్రేలియా పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. డిసెంబర్-3వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.(చదవండి: డైలమాలో సన్‌రైజర్స్!) -
‘టి20 ప్రపంచకప్’ ఆసీస్ చేతిలోనే ఉంది: సచిన్
న్యూఢిల్లీ: షెడ్యూల్ ప్రకారం అక్టోబర్‌లో టి20 ప్రపంచకప్ నిర్వహించాలా? వద్దా? అనేది క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)నే నిర్ణయిస్తుందని భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు. ఐసీసీ కూడా ఇంకా ఈ అంశంపై స్పందించాల్సి ఉందని పేర్కొన్నాడు. ‘టి20 ప్రపంచకప్ నిర్వహణ అనేది క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవహారాలతో పాటు పలు అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈ వ్యవస్థలన్నీ ఏకమై టోర్నీ నిర్వహణకు దోహదపడతాయేమో చూడాలి. ఇది కఠిన నిర్ణయమే కానీ క్రికెట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య కాబోదు’ అని టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. -
రిస్క్ చేద్దామా.. వద్దా?
ముంబై: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై ఆతిథ్య దేశం ఆస్ట్రేలియా డైలమాలో పడింది. నిర్ణీత షెడ్యూల్లో వరల్డ్‌కప్ జరపడం కష్టమనే భావనకు సీఏ వచ్చేసింది. గురువారం ద్వైపాక్షిక సిరీస్‌లకు షెడ్యూల్ ప్రకటించిన సీఏ.. కనీసం టీ20 వరల్డ్‌కప్ ప్రస్తావనను ఎక్కడా తీసుకురాలేదు. ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి వరకూ జరుగనున్న 2020–21 హోమ్ సీజన్ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించింది. వరల్డ్‌కప్ గురించి అసలు పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో వరల్డ్‌కప్ నిర్వహించడం సవాల్ కూడకున్న పని అని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ కెవిన్ రాబర్ట్స్ పేర్కొన్నాడు. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో వరల్డ్‌కప్ నిర్వహణ అనేది అతి పెద్ద రిస్క్ మనసులో మాటను బయటపెట్టాడు.(ప్రపంచకప్ ప్రస్తావన లేకుండానే...) ‘అక్టోబర్-నవంబర్ నాటికి పరిస్థితులు అదుపులోకి వస్తాయని ఆశిద్దాం. కానీ పరిస్థితులు ఎంత అదుపులోకి వచ్చినా ఒక మెగా ఈవెంట్‌ను నిర్వహించడం కత్తిమీద సామే. ఒకవేళ ముందస్తు షెడ్యూల్ ప్రకారం వరల్డ్‌కప్ జరగకపోతే ఫిబ్రవరి-మార్చి విండోలో అది జరపడానికి కసరత్తులు చేయాల్సి ఉంటుంది’ అని రాబర్ట్స్ అన్నారు. ఇది ఐసీసీ తీసుకునే తుది నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నారు. ఇక గురువారం ఐసీసీ నిర్వహించిన సమావేశంలో కూడా వరల్డ్‌కప్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్‌కప్ నిర్వహణపై నిర్ణయాన్ని జూన్ 10వ తేదీన జరిగే తదుపరి సమావేశానికి వాయిదా వేసింది. జరిగితే ఆశ్చర్చ పడాల్సిందే.. షెడ్యూల్ ప్రకారం టి20 ప్రపంచ కప్ జరగడం సందేహమేనని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయ పడ్డాడు. కోవిడ్–19 నేపథ్యంలో 16 జట్లతో మెగా టోర్నీ నిర్వహించడం అసాధ్యమని అతను అన్నాడు. ‘నిజంగా షెడ్యూల్ ప్రకారం జరిగితే మనమంతా ఆశ్చర్యపడాల్సిందే. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా సమస్య తక్కువగా, నియంత్రణలోనే ఉందనేది వాస్తవం. అయితే ఒక చిన్న పొరపాటు కూడా ఎంతో ప్రమాదకరంగా మారిపోవచ్చు’ అని పేర్కొన్నాడు. మరి వరల్డ్‌కప్‌పై రిస్క్ చేసి షెడ్యూల్ ప్రకారం ముందుకెళతారా.. లేదా అనే మరి కొన్ని రోజులు తేలిపోనుంది. (‘భారత్ ఓడిపోతుందని అనలేదు’) -
ఆసీస్ క్రికెటర్లు.. ఇవి పాటించాల్సిందే!
సిడ్నీ: కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్ట్రేలియా పలు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని భావిస్తోంది. ఆస్ట్రేలియాలో క్రికెట్ అత్యంత ఆదరణ క్రీడ కావడంతో పలు చర్యలకు శ్రీకారం చుట్టింది. క్రికెట్ కార్యకలాపాలు పునరుద్ధించబడ్డాక లాలాజలం(సలైవా), స్వీట్ పదార్థాలను బంతిపై మెరుపు కోసం ఉపయోగించుకుండా ఉండాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బంతిని షైన్ చేయడానికి సలైవాను నిషేధించాలనే కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. అదే సమయంలో అంపైర్ల సమక్షంలో ‘ట్యాంపరింగ్’కు అవకాశం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుగా తమ ప్రణాళికలను సిద్ధం చేసింది. సలైవాపై ఐసీసీ నిషేధం విధించినా, విధించకపోయినా తమ క్రికెట్ జట్టు మాత్రం అందుకు దూరంగా ఉండాలనే మార్గదర్శకాలను సిద్ధం చేసింది. (మార్చాల్సిన అవసరం ఏమిటి?: వార్నర్) ఈ మేరకు ఆస్ట్రేలియా సమాఖ్య ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం ముగిసి క్రికెట్ ఆరంభమైన తర్వాత ఇవి కచ్చితంగా పాటించాలనే నిబంధనను ప్రవేశపెట్టింది. ఆస్ట్రేలియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఏఐఎస్).. వైద్యరంగ నిపుణులతో పాటు క్రీడా సంఘాలు, ప్రభుత్వంతో చర్చించి కొన్ని నిబంధనలు సూచించింది. ఇందులో ఏ,బీ,సీలుగా మూడు కేటగిరీలను పొందు పరిచింది. లెవల్-ఎలో వ్యక్తిగత ప్రాక్టీస్‌ను మినహాయించి అన్ని రకాల ప్రాక్టీస్‌లకు దూరంగా ఉండాలని పేర్కొంది. లెవల్-బిలో నెట్ ప్రాక్టీస్‌లో బ్యాటర్స్ బౌలర్లను ఎదుర్కోనే క్రమంలో బౌలర్లు పరిమితంగా ఉండాలని తెలిపింది. వ్యక్తికి వ్యక్తికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో వార్మప్ డ్రిల్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది. (‘బాల్ టాంపరింగ్ చేసుకోవచ్చు’) ఇక లెవల్-సిలో భాగంగా పూర్తి స్థాయి ట్రైనింగ్, కాంపిటేషన్‌కు సిద్ధమయ్యే క్రమంలో బంతిని సలైవాతో రుద్దకూడదనే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని తెలిపింది.ఎవరైనా ఆటలోకి పునరాగమనం చేయాలంటే 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఆపై ఏ ఆటగాడైనా అనారోగ్యానికి గురైతే పునరావాస శిబిరంలోకి తరలించాలని తెలిపింది. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఐసోలేషన్లోకి వెళ్లాలని పేర్కొంది. ట్రైనింగ్ సెషన్స్‌లో కూడా ఆటగాళ్లు అన్ని నిబంధలను అమలు చేయాలని తెలిపింది. కరోనా సోకి కోలుకున్న సదరు అథ్లెట్‌కు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది. -
లబ్‌షేన్‌కు సీఏ కాంట్రాక్టు
మెల్బోర్న్: ఆసీస్ జట్టులో ఇటీవల నిలకడగా రాణిస్తున్న లబ్‌షేన్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్ కాంట్రాక్టు కట్టబెట్టింది. అయితే స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ గైర్హాజరీలో కంగారూ జట్టును ఆదుకున్న ఉస్మాన్ ఖాజాకు సీఏ షాకిచ్చింది. 2020–21 సీజన్‌కుగానూ గురువారం ప్రకటించిన కాంట్రాక్టు జాబితా నుంచి అతన్ని తప్పించింది. గతేడాది యాషెస్ సిరీస్ నుంచి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని ఖాజాతో పాటు మార్కస్ హారిస్, నాథన్ కూల్టర్‌నీల్, పీటర్ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్‡్ష, మార్కస్ స్టొయినిస్ తమ కాంట్రాక్టులు కోల్పోయారు. వీరి స్థానంలో బర్న్స్, లబ్‌షేన్, మాథ్యూ వేడ్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, పేసర్ కేన్ రిచర్డ్సన్, స్పిన్నర్ ఆస్టన్ అగర్ సెంట్రల్ కాంట్రాక్టులు పొందారు. సీఏ ప్రకటించిన జాబితాలో మొత్తం 20 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్‌లో చివరి టి20 ఆడిన మ్యాక్స్‌వెల్‌ను జాబితాలో కొనసాగించారు. -
టాప్ ఆర్డర్ ఆటగాడికి నో చాన్స్
సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజాను కాంట్రాక్ట్ జాబితా నుంచి సీఏ తొలగించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు కాంట్రాక్ట్ జాబితాలో చోటివ్వలేదు. గత జాబితాలో ఉన్న ఖవాజను కొత్త జాబితా నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఖవాజాతో పాటు పీటర్ హ్యాండ్స్కోంబ్, మార్కస్ హారిస్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్‌లను తప్పించింది.( అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు) వీరిలో ఖవాజా, షాన్ మార్ష్ కాంట్రాక్ట్‌లను కొనసాగించకపోవడం చర్చనీయాంశమైంది. ఇక వారి స్థానాల్లో మార్కస్ లబూషేన్, ఆస్టన్ ఆగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్సన్, మాథ్యూ వేడ్లకు అవకాశం ఇచ్చింది. గతంలో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 12 అప్‌గ్రేడ్ పాయింట్లను(మూడు ఫార్మాట్లకు కలిపి) కేటాయించిన సీఏ.. తాజాగా దానిని 8 అప్‌గ్రేడ్ పాయింట్లకే పరిమితం చేసింది. ఒక్కో టెస్టు మ్యాచ్‌కు 5 పాయింట్లు, వన్డేకు రెండు పాయింట్లు, టీ20కి ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించి ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. ఈ మేరకు 20 మందితో కూడిన కొత్త జాబితాను ప్రకటించింది. (హిట్‌మ్యాన్‌కు స్పెషల్ డే..!) క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ జాబితా ఇదే.. ఆస్టన్ ఆగర్, జో బర్న్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, అరోన్ ఫించ్, జోష్ హజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, లబూషేన్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ పైన్, జేమ్స్ పాటిన్సన్, జహీ రిచర్డ్సన్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా -
ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ధోని..
మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అది కూడా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ధోనికి సముచిత స్థానాన్ని కట్టబెట్టింది. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారికి ఇచ్చే గౌరవంలో భాగంగా ఈ దశాబ్దపు ఆసీస్ వన్డే జట్టు కెప్టెన్‌గా ధోనిని ఎంపిక చేసింది. ఇక ధోనితో పాటు మరో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు సైతం చోటు సీఏ తమ దశాబ్దపు వన్డే జట్టులో చోటు కల్పించింది. కాగా, ఈ వన్డే జట్టులో ఒకే ఒక్క ఆసీస్ క్రికెటర్‌ను సీఏ తీసుకుంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్‌కు మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా చోటు ఇచ్చింది. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లున్న సీఏ వన్డే జట్టులో దక్షిణాఫ్రికా క్రికెటర్లు హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్‌లు ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్ ఉండగా, ఇంగ్లండ్ నుంచి జోస్ బట్లర్‌కు చోటు కల్పించింది. న్యూజిలాండ్ నుంచి ట్రెంట్ బౌల్ట్, అఫ్గానిస్తాన్ నుంచి రషీద్ ఖాన్లు న్నారు. శ్రీలంక నుంచి లసిత్ మలింగా చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంచితే. సీఏ ప్రకటించిన తమ దశాబ్దపు టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఎంపిక చేసింది. ఈ టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లికి మాత్రమే చోటు దక్కింది. దశాబ్దపు సీఏ వన్డే జట్టు ఇదే.. ఎంఎస్ ధోని(కెప్టెన్-వికెట్ కీపర్), రోహిత్ శర్మ, హషీమ్ ఆమ్లా, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, షకీబుల్ హసన్, జోస్ బట్లర్, రషీద్ ఖాన్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగా దశాబ్దపు సీఏ టెస్టు జట్టు ఇదే.. విరాట్ కోహ్లి(కెప్టెన్), అలెస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్) బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లయన్, జేమ్స్ అండర్సన్ -
షేన్ వాట్సన్‌కు కీలక పదవి
మెల్బోర్న్: ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) హెడ్‌గా వాట్సన్ నియమించారు. ఈ మేరకు వాట్సన్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ సోమవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో నిర్ణయం తీసుకున్నారు. ఆసీస్ తరఫున ఆడిన సమయంలో తనదైన మార్కుతో ఎన్నో విజయాల్లో ముఖ్య భూమిక పోషించిన వాట్సన్‌పై నమ్మకం ఉంచి ఏజీఎం సభ్యులు.. సరికొత్త బాధ్యతను కట్టబెట్టారు. దాంతో షేన్ వాట్సన్ కొత్త ఇన్నింగ్స్ ఆరంభం కానుంది. దీనిపై వాట్సన్ మాట్లాడుతూ..‘ ఇది నిజంగా నాకు దక్కిన గొప్ప గౌరవం. దాంతో పాటు ఇదొక పెద్ద బాధ్యత కూడా. ఆసీస్ క్రికెటర్ల నమ్మకాన్ని మరోసారి చూరగొంటా. నాకు ఆస్ట్రేలియా క్రికెట్ ఏమైతే ఇచ్చిందో దాన్ని తిరిగి ఈ రూపంలో తీర్చుకోవడానికి మంచి అవకాశం’ అని వాట్సన్ పేర్కొన్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్లో 59 టెస్టులు ఆడిన వాట్సన్, 190 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు విశేషమైన సేవలందించాడు. తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ల అసోసియేషన్ బోర్డులోని సభ్యులను 10 మందికి పెంచుతూ ఏజీఎం నిర్ణయం తీసుకుంది. ఇందులో మూడు కొత్త ముఖాలకు తొలిసారి అవకాశం కల్పించారు. -
‘బౌండరీ రూల్’ను సీఏ మార్చేసింది..
సిడ్నీ: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ ఓవర్లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో ఇంగ్లండ్ విజేతగా నిర్ణయించారు. ఒక వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ బౌండరీ కౌంట్ రూల్ ఆధారంగా విజేతను నిర్ణయించడమనేది ఇదే తొలిసారి కూడా. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అవలంభిస్తున్న ఈ రూల్‌పై వచ్చే ఏడాది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ‘బౌండరీ రూల్’ స్థానంలో మరిన్ని ఓవర్ల మ్యాచ్ జరపాలనే యోచనలో ఐసీసీ ఉంది. కాగా, క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ముందుగానే బౌండరీ రూల్‌ను మార్చేసింది. దీనిని ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) తాజా సీజన్ నుంచి అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. 2019-20 సీజన్లో జరుగనున్న బీబీఎల్‌లో బౌండరీ కౌంట్ రూల్ విధానానికి స్వస్తి పలికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఒక వేళ ఫైనల్ మ్యాచ్‌లో విజేతను తేల్చేక్రమంలో ఆ మ్యాచ్ టైగా ముగిస్తే ముందుగా సూపర్ ఓవర్‌ను వేయిస్తుంది. అది కూడా టైగా ముగిసిన నేపథ్యంలో మరికొన్ని సూపర్ ఓవర్ల ద్వారానే విజేతను నిర్ణయిస్తారు. ఇక్కడ పూర్తి స్పష్టత వచ్చే వరకూ సూపర్ ఓవర్లను కొనసాగించాలనే ప్రయోగానికి సిద్ధమైంది. దీన్ని పురుషుల బీబీఎల్‌తో పాటు మహిళల బీబీఎల్‌లో కూడా కొనసాగించనున్నట్లు ఆ లీగ్ చీఫ్ అలిస్టర్ డాబ్సన్ తెలిపారు. ‘ ఐసీసీ వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత బౌండరీ కౌంట్ రూల్‌పై పెద్ద దుమారమే నడిచింది. దాంతో పలు సూపర్ ఓవర్ల విధానాన్ని తీసుకు రావాలని భావిస్తున్నాం. ఇది సక్సెస్ అవుతుందనే ఆశిస్తున్నాం’ అని డాబ్సన్ పేర్కొన్నారు. -
విద్యాసంస్థలు లాభ రహిత విద్యనందించాలి
సాక్షి, విజయవాడ: ప్రైవేటు,కార్పొరేట్ సంస్థలు లాభ రహితంగా విద్యనందించాలన్నదే ప్రభుత్వ విధానమని రాష్ట్ర్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఏపీ ఛార్టెట్ అకౌంటెంట్ల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఛార్టెట్ అకౌంటెన్సీ అద్భుతమైన వృత్తి అని.. సీఏ చేస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సీఏ కోర్సును ఎక్కువ మంది విద్యార్థులు అభ్యసించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సీఏకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యాసంస్థల్లో కామర్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఏ కోర్సు ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహణకు సహకారం అందిస్తామని చెప్పారు. -
పసలేని ఎన్నికల పండుగ
అచ్చంపేట: ఎన్నికలంటే ఓ పండగ లెక్క! దాదాపు ఇరవై రోజులపాటు నిత్యం నాయకుల మాటల పోరు.. ర్యాలీలూ.. సమావేశాల హోరుతో రంజుగా సాగుతుంది. మొన్నటి శాసనసభా ఎన్నికల్లోనూ ఇదే ధూంధాం కనిపించింది. అంతెందుకు నిన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదేజోరు సాగింది. కానీ, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ వాతావరణం ఎక్కడా కనిపించడం లేదు. ప్రచార హోరు కనిపించకపోగా.. మైకులు కూడా అక్కడక్కడే మోగుతున్నాయి. ఇక ర్యాలీల జాడే లేదు. పట్టణాల్లో అంతో ఇంతో ఈ హుషారు కనిపిస్తున్నా.. ఊళ్లో మాత్ర పార్లమెంట్ ఎన్నికల ప్రచారం చప్పుడే లేకుండాపోయింది. కొన్నిచోట్ల మాత్రం అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు ప్రధాన అనుచరులు మరీ రాలేదనకుండా గ్రాయిల్లో ప్రచారం చేసి వస్తున్నారు. కనిపించని ఉత్సాహం గ్రామాల్లోనే కాదు.. స్థానిక నేతల్లో కూడా పెద్దగా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. ప్రధానంగా పోటీ పడుతున్న టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లోనూ ఇదే స్తబ్ధత నెలకొంది. ఏ ఎన్నికలు వచ్చినా.. అభ్యర్థులు లేదా ప్రజాప్రతినిధులు మండలాలు, గ్రామాల వారీగా తమ నాయక గణానికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రచార బాధ్యతలు వారే చూసుకోవాల్సి ఉంటుంది. వారిపై మరికొందరు సమన్వయం చేస్తుంటారు. కానీ ఎంపీ ఎన్నికలకు సంబంధించి గ్రామాల్లో ప్రచార బాధ్యతలను ఇప్పటికీ నాయకులకు అప్పగించలేదు. అభ్యర్థులకు వెన్నుదన్నుగా ఉండే అనుచరులతోపాటు ఆయా పార్టీల సర్పంచ్‌లు కూడా గ్రామాల్లో సందడి చేయడం లేదు. బయటకు వెళ్తే ఎక్కడ ఖర్చుల భారం మీద పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ వెళ్లినా మైకుల హోరు.. ర్యాలీలు నిర్వహించడం లేదు. సాదాసీదాగా వెళ్లి గ్రామస్తులతో సమావేశం మాత్రమే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ప్రచారం ‘మమ’ అనిపిస్తున్నారన్నమాట. అప్పుడే మస్తుగుండే.. ‘ఎంపీ ఎన్నికలంటున్నరు.. మరీ మందూ లేదు.. విందూ లేదా..’ అని చాలామంది నాయకులకు మందుబాబుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పల్లెల్లో నాయకులు ప్రచారం చేసేందుకు ముందుకు రాకపోవడంతో ఇది కూడా కారణంగా మారుతోంది. శాసనసభ, పంచాయతీ ఎన్నికల్లో మద్యం జోరుగా సరఫరా కావడంతో.. మందుబాబులందరికీ ప్రచారం జరిగినన్ని రోజుల పండగలా సాగింది. స్థానికంగా బాధ్యతలు తీసుకున్న నాయకులు ఇంటికొచ్చి మరీ.. మద్యం సీసాలను మందుబాబులకు అప్పగించి వెళ్లారని సమాచారం.! ఇప్పడేమె అంతా స్తబ్ధుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నాయకులు ఊళ్లలో ప్రచారం చేయాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ ప్రచారం చేసేందుకు వెళ్లకున్నా.. పైనుంచి డబ్బులు వచ్చినా ఖర్చు పెడతలేడు.. అన్న అపవాదూ వస్తోందని వాపోతున్నారు. ఐదు రోజులే మిగిలింది.. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఐదురోజులే మిగిలింది. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ప్రచారాన్ని ఈ నెల 9 వరకు మాత్రమే చేయాల్సి ఉంది. ఇప్పటి దాకా పల్లెల్లోకి అభ్యర్థులే ప్రచారానికి రాలేదు. కేవలం పట్టణాలు, నియోజకవర్గ కేంద్రాలు, మేజర్ మండల కేంద్రాల వరకే తమ ప్రచారాన్ని పరిమితం చేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మేజర్ ఓట్లు ఉన్న గ్రామాల్లో కార్యకర్తలు, గ్రామస్తులు నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నా.. అందాల్సినవి అందకపోవడం వల్లే ప్రచారం మాగబోయిందనే చర్చ గ్రామాల్లో వినిపిస్తోంది. సంఘాల వారీగా.. అభ్యర్థులు శాసనసభా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే లోక్‌సభ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీల నాయకులు గ్రామాల్లో కుల సంఘాల వారీగా కలుస్తున్నారు. కులం ఓట్లు గంపగుత్తగా తమకే వేసేలా వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కుల సంఘాల నాయకులకు వారు కోరిన కోర్కెలకు హామీలు ఇస్తున్నారు. తాము గెలవగానే మీ హామీలను పూర్తి చేస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్ స్థానం పరిధి పెద్దగా ఉండటంతో అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు. ఇక అభ్యర్థులు, పార్టీలు ఆర్థికంగా తోడ్పాటునందిస్తేనే స్థానిక నాయకులు ప్రచారానికి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది.