
సాక్షి, విజయవాడ: ప్రైవేటు,కార్పొరేట్ సంస్థలు లాభ రహితంగా విద్యనందించాలన్నదే ప్రభుత్వ విధానమని రాష్ట్ర్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శుక్రవారం ఏపీ ఛార్టెట్ అకౌంటెంట్ల రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఛార్టెట్ అకౌంటెన్సీ అద్భుతమైన వృత్తి అని.. సీఏ చేస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. సీఏ కోర్సును ఎక్కువ మంది విద్యార్థులు అభ్యసించేలా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సీఏకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యాసంస్థల్లో కామర్స్ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఏ కోర్సు ప్రయోజనాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహణకు సహకారం అందిస్తామని చెప్పారు.