సాక్షి, విశాఖపట్నం: స్వామిజీ కూడా రాజకీయ రంగు పులుముతున్నారని, ఇది చాలా దురదృష్టకరమని పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ జరిగిన శారదపీఠం స్వామిజీ పుట్టిన రోజు వేడుకల్లో బుధవారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనుల్లో స్వామిజీ భక్తిభావం ఎక్కువగా తీసుకువచ్చారని, భక్తి వల్లే సమాజంలో శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటాయన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునేది స్వామిజీలే అన్నారు. అలాంటి వారిని రాజాకీయాల్లోకి లాగొద్దన్నారు. శారదా పీఠం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఎన్నికలు ఎప్పుడు ఎట్టినా విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే అన్నారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గల్లీ రాజకీయాల కోసం రాజ్యాంగ పదవిని తాకట్టు పెట్టోద్దని హితవు మంత్రి పలికారు. ఇసుక అక్రమాల్ని గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ఆర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు.
అదే నిమ్మగడ్డ తాపత్రయ: మంత్రి ఆదిమూలపు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఎన్నికలు నిర్వహించే ముందు ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వాన్ని సంప్రదించాలన్న విషయం తెలియదా అని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు చెప్పినా ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎన్నికల ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ తన పదవి ముగుస్తుంది కాబట్టి ఈ ఎన్నికలు పెట్టాలన్నది నిమ్మగడ్డ తాపత్రయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల రక్షణ పట్టదా అని, సీఎస్ ఇచ్చిన నివేదికను నిమ్మగడ్డ పరిగణలోకి తీసుకోవాలి అన్నారు. ఎవరికో ప్రయోజనం చేయాలనుకునే నిమ్మగడ్డకు కమిషనర్ హోదాలో కొనసాగే నైతిక హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment