
సీఏలు వృత్తి ధర్మాన్ని కాపాడాలి
అవినీతి రహిత సమాజం కోసం నేతలు, వృత్తి ధర్మాన్ని కాపాడేందుకు చార్టెడ్ అకౌంటెంట్లు కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
ఐసీఏఐ సదస్సులో ఎంపీ కవిత
హైదరాబాద్: అవినీతి రహిత సమాజం కోసం నేతలు, వృత్తి ధర్మాన్ని కాపాడేందుకు చార్టెడ్ అకౌం టెంట్లు కృషి చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) గచ్చిబౌలి శాం తిసరోవర్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల సద స్సును ఆమె శనివారం ప్రారంభించారు. కవిత మాట్లాడుతూ... రాజకీయ నాయకుల పేరు చెబితే అవినీతి, ఎన్నికలు, బ్లాక్ మనీ, లిక్కర్ మాఫియాగా ముద్రపడిందని.. నిజానికి వారు ప్రజాసేవకు అంకితమై పనిచేస్తున్నారన్నారు. సీఏలంటే లెక్కలు, ఆదాయం, పన్నులు వంటివి గుర్తుకు వస్తా యన్నారు.
నమ్మకంగా, కష్టపడే తత్వంతో ముందుకు సాగితే ఏ రంగంలోనైనా రాణించవచ్చన్నారు. సీఏలు నిజమైన రాక్ స్టార్లన్నారు. కేంద్రం ఎన్నో సంస్కరణలను అమలు చేయడంతో అంతా... ‘మోదీ.. మోదీ’ అన్నారని, అదే పెద్ద నోట్ల రద్దుతో ‘డిమో... డిమో’ అంటున్నారన్నారు. ప్రస్తుతం 8.5లక్షల మంది సీఏ విద్యార్థులున్నారని, ఇకముం దు మహిళలకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. సీఏలు మామూలుగా 2 ప్లస్ 2 ఎంతంటే ఫోర్ అంటారు.. కానీ మా సీఏ బుచ్చిబాబును అడిగితే మీరెంతనుకుంటున్నారమ్మా అనడుగుతారన్నారు. ఐసీఏఐ చైర్మన్ దేవరాజరెడ్డి మాట్లాడుతూ జీఎస్‌టీ, దాని ప్రభా వం, ఈ కామర్స్, జీఎస్‌టీ ఆడిటింగ్ ప్రమాణాలు, నగదురహిత ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై ఈ సదస్సులో అవగాహన కల్పిస్తామ న్నారు. ఐసీఏఐ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ బాబు అబ్రహం, ఎస్‌ఐసీఏఎస్‌ఏ చైర్మన్ వెంకట్‌రామ్, సదరన్‌రీజియన్ సభ్యుడు వెంకటేశ్వరరావు, హైద రాబాద్ చాప్టర్ చైర్మన్ రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.
క.వి.త... అంటే కలలు వడ్డించే తల్లి...
కవితను ఐసీఏఐ చైర్మన్ దేవరాజరెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కవిత అనగా.. క–కలలు, వ– వడ్డించే, త–తల్లి అని, బ్లెస్సింగ్ ఇచ్చే తల్లి వంటిదని, కలసి వచ్చిన తల్లి కవిత అని.. అది కేవలం సీఎం కేసీఆర్‌కే కాదని, పార్లమెంట్ సభ్యురాలిగా దేశానికంతటికని ఆయన పొగడటం తో విద్యార్థులు కేరింతలు కొడుతూ చప్పట్లు చరిచారు.