సాక్షి,హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో మంగళవారం(అక్టోబర్1) చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి వైద్యపరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు.
ఇదీ చదవండి: కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్
Comments
Please login to add a commentAdd a comment