ill health
-
HYD: ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: అనారోగ్య సమస్యతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంగళవారం(అక్టోబర్1) చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి వైద్యపరీక్షలు పూర్తవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు , తీవ్ర జ్వరంతో కవిత పలుసార్లు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కవితకు గతంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ కేసులో 5 నెలల పాటు జైలులో గడిపిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో కవిత ఇటీవలే జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఒకప్పుడు పులి: ఎంపీ అర్వింద్ -
జేడీఎస్ అధినేత కుమారస్వామికి అస్వస్థత
బెంగళూరు: జేడీఎస్ అధినేత, కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఆదివారం(జులై 28) సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరులో బీజేపీ, జేడీఎస్ నాయకులు ఉమ్మడిగా నిర్వహించిన ప్రెస్మీట్లో మాట్లాడుతుండగా కుమారస్వామి ముక్కు నుంచి ఒక్కసారిగా రక్తం కారింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. -
ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర త్వరలో యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని ఎక్స్ వేదికగా ప్రియాంక వెల్లడించారు. ‘‘యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న అందరికి నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. I was really looking forward to receiving the BJNY in UP today but unfortunately, have ended up admitted to hospital. I will be there as soon as I am better! Meanwhile wishing all the yatris, my colleagues in UP who have worked hard towards making arrangements for the yatra and… — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 16, 2024 ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ -
ఆస్పత్రిలో దావూద్!
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో అతన్ని రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌లోని కరాచీలో హుటాహుటిన ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్నీ ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ చికిత్స అందిస్తున్నట్టు చెబుతున్నారు. ఆస్పత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేగాక 67 ఏళ్ల దావూద్‌కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్నపళాన ఆస్పత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే అతను మరణించినట్టు కూడా వార్తలొచ్చాయి! అయితే దావూద్‌పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లుగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్‌లోనే నివసిస్తున్నట్టు ఇప్పటికే తేలింది. అతను కరాచీలోనే ఉంటున్నట్టు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్‌తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2003లోనే దావూద్‌ను మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా 2.5 కోట్ల డాలర్ల రివార్డు ఉంది! రోజంతా కలకలం దావూద్‌పై విషప్రయోగం, మృతి వార్తలు సోమవారం ఉదయం నుంచే కలకలం రేపాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఓ యూట్యూబర్ వీటిని తొలుత బయట పెట్టాడు. పలు సోషల్ మీడియా వార్తలను ఉటంకిస్తూ ఈ మేరకు కథనం ప్రసారం చేసి దుమారం రేపాడు. ఆది, సోమవారాల్లో పాకిస్థాన్ అంతటా గంటల తరబడి ఇంటర్నెట్ మూగబోవడానికి, దావూద్ మృతికి లింకుందని చెప్పుకొచ్చాడు. ‘‘దేశంలో ఏదో పెద్ద ఉదంతమే జరిగింది. దాన్ని దాచేందుకే నెట్‌పై ఆంక్షలు విధించారు’’ అంటూ ప్రముఖ పాక్ జర్నలిస్టులు ఎక్స్ పోస్టుల్లో అనుమానాలు వెలిబుచ్చడంతో మరింత అలజడి రేగింది. దావూద్ విషమ పరిస్థితుల్లో కరాచీ ఆస్పత్రిలో చేరినట్టు పాక్ జర్నలిస్టు అర్జూ కాజ్మీ ఎక్స్ పోస్టులో నిర్ధారించారు. తొలిసారేమీ కాదు... దావూద్‌పై విషప్రయోగం జరిగిందని, అతను మరణించాడని వార్తలు రావడం ఇది తొలిసారేమీ కాదు. ఏటా కనీసం ఒకట్రెండుసార్లు ఇలాంటి వార్తలు రావడం, అవన్నీ పుకార్లేనని తేలడం పరిపాటిగా మారింది. కరాచీలోనే దావూద్: అల్లుడు పాక్ ఖండిస్తున్నా, దావూద్ కరాచీలో ఉండటం వాస్తవమేనని అతని అల్లుడు అలీ షా పార్కర్ గత జనవరిలో ధ్రువీకరించాడు. కరాచీలోని అబ్దుల్లా గాజీ బాబా దర్గా వెనక రహీం ఫకీ సమీపంలోని డిఫెన్స్ ఏరియాలో దుర్భేద్యమైన ఇంట్లో కొన్నేళ్లుగా దావూద్ నివాసముంటున్నట్టు తెలిపాడు. దావూద్ చెల్లెలు హసీనా పార్కర్ కొడుకైన అలీ షా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఇచి్చన స్టేట్మెంట్లో ఇంకా పలు విషయాలు వెల్లడించాడు. ‘‘దావూద్ ఓ పాక్ పఠాన్ స్త్రీని రెండో పెళ్లి చేసుకున్నాడు. దావూద్‌కు ముగ్గురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లున్నారు. ఒక కూతురును పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ కుమారునికిచ్చి పెళ్లి చేశాడు’’ అని అలీ షా తెలిపాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అనారోగ్యంతో తుర్కియే గుహలో చిక్కుబడిన అమెరికా అన్వేషకుడు
ఇస్తాంబుల్: తుర్కియేలోని ఓ గుహలో వెయ్యి మీటర్ల లోతులో అనారోగ్యంతో చిక్కుకుపోయిన అమెరికాకు చెందిన మార్క్ డికే(40)ను సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అన్వేషణలో భాగంగా తుర్కియేలోని టారస్ పర్వతాల్లో ఉన్న మోర్కా గుహల్లోకి మార్క్ డికే వెళ్లారు. మోర్కా గుహ లోతు 1,276 మీటర్లు కాగా, మార్క్ డికే 1,120 మీటర్ల లోతులోని బేస్‌క్యాంప్‌లో ఉన్నారు. జీర్ణాశయంలో రక్తస్రావం కారణంగా ముందుకు వెళ్ల్లలేని స్థితిలో ఉండిపోయారని యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ ప్రకటించింది. ఆయనకు అనేక అంతర్జాతీయ గుహాన్వేషణల్లో పాలుపంచుకున్న అనుభవం ఎంతో ఉంది. గృహల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో స్వయంగా ఆయన సిద్ధహస్తుడని వివరించింది. సాధారణ పరిస్థితుల్లో అనుభవజు్ఞలైన గృహాన్వేషకులకే అక్కడికి వెళ్లేందుకు 15 గంటలు పడుతుందని టర్కిష్ కేవింగ్ ఫెడరేషన్ వివరించింది. మార్క్ డికే కోసం ఆరు యూనిట్ల రక్తం పంపించామని టర్కీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తెలిపింది. డికేను కాపాడేందుకు తుర్కియే, అమెరాకాతోపాటు హంగరీ, బల్గేరియా, ఇటలీ, క్రొయేíÙయా, పోలాండ్ దేశాలకు చెందిన 150 మంది నిపుణులను రప్పిస్తున్నట్లు యూరోపియన్ కేవ్ రెస్క్యూ అసోసియేషన్ తెలిపింది. ఎంతో క్లిష్టమైన ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొన్ని రోజుల వరకు పట్టవచ్చని చెబుతున్నారు. -
క్యాంటీన్లో బిర్యానీ తిన్న విద్యార్థులు.. 40 మందికి అస్వస్థత, రహస్యంగా తరలించి..
సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. 15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’) పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. (చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలింపు) -
చైనాలో తమిళనాడు వైద్య విద్యార్థి మృతి.. కరోనానే కారణం?
చెన్నై: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ చైనాలో తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ఓ వైద్య విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. గత ఐదేళ్లుగా చైనాలో వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన ఆ కుటుంబం తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది. వైద్య విద్య పూర్తి చేసేందుకు భారత్‌లోని తమిళనాడుకు చెందిన అబ్దుల్ షేక్ అనే యువకుడు ఐదేళ్ల క్రితం చైనాకు వెళ్లాడు. కరోనా వ్యాప్తి కారణంగా భారత్ తిరిగివచ్చిన అతను 20 రోజుల క్రితమే(2022 డిసెంబర్ 11)న తిరిగి చైనాకు వెళ్లాడు. 8 రోజుల ఐసోలేషన్ తర్వాత ఈశాన్య చైనాలోని హెయిలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని కికిహార్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అతడిని ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ప్రాణాలు కాపాడలేకపోయారు వైద్యులు. అనారోగ్యంతో తమ కుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అతడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని విదేశాంగ శాఖకు విజ్ఞప్తి చేసింది ఆ కుటుంబం. అలాగే.. తమకు సాయం చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు -
మధ్యాహ్న భోజనం వికటించి.. 32 మంది విద్యార్థులకు అస్వస్థత
మామడ(నిర్మల్): నిర్మల్ జిల్లా మామడ మం డలం దిమ్మదుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 114 మంది పాఠశాలకు హాజర య్యారు. వీరికి మధ్యాహ్న భోజనం అందించిన అనంతరం 32 మందికి వాంతుల య్యాయి. ఉపాధ్యాయులు వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, వారు పాఠశాలకు చేరుకుని ప్రాథమిక చికిత్స అం దించారు. 12 మంది అస్వస్థతకు గురవ్వడం తో వారిని అంబులెన్స్‌లో మండల కేంద్రం లోని పీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డీఈవో రవీందర్‌రెడ్డి, సర్పంచ్ గీత అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. భోజనంలో అందించిన కోడిగుడ్డు, సాంబార్ అస్వస్థతకు కారణమని అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎం సస్పెన్షన్.. ఈ ఘటనపై పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేయాలని, ఎండీఎం ఏజెన్సీ ని విధుల నుంచి తొలగించాలని డీఈవో రవీందర్‌రెడ్డిని కలెక్టర్ పారూఖీ ఆదేశించారు. హెచ్ఎం వినోద్‌కుమార్‌ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. (చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500) -
విషాదం: రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతుల క్షణికావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన ఢిల్లీ యూనివర్సిటీకి రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులు బలవంతంగా ఊపిరి తీసుకున్నారు. దీంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆగ్నేయ ఢిల్లీలోని గోవింద్‌పురి ప్రాంతంలో బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేర్‌టేకర్ అజిత్ వారి ఇంటి బెల్ మోగించినపుడు వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బాధిత దంపతుల కుమార్తె అంకితకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. (Covid-19: టీకా తీసుకున్నా, రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి) పోలీసులు అందించిన సమాచారం ప్రకారం గోవింద్‌పురిలోని కల్కాజీ ఎక్స్‌టెన్షన్‌లోని తమ నివాసంలో రాకేష్ కుమార్ జైన్ (74), అతని భార్య ఉషా రాకేష్ కుమార్ జైన్ (69) స్టీల్ పైపునకు ఉరివేసుకుని కనిపించారు. అనారోగ్యం కారణంగా ఎక్కువ సమయం మంచానికే పరిమితమై ఉండడంతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసు కున్నట్టు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. దీనికి సంబంధించిన సూసైడ్ నోట్‌నుపోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా గతేడాది యూపీలోని గోండాకు వెళ్తుండగా జైన్ దంపతులు ప్రమాదానికి గురయ్యారు. ఈ సమయంలో రాకేష్ జైన్‌కు వెన్నులో తీవ్ర గాయం కాగా, ఉషాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. దీంతో ఇద్దరూ మంచాన పడ్డారు. అయితే చికిత్స అనంతరం కేర్ టేకర్ సాయంతో కోలుకుని ఇపుడిపుడే కొద్దిగా నడుస్తున్న తరుణంలో ఈ దంపతులు తీసుకున్న నిర్ణయం వారి కుటుంబ సభ్యులకు ఆవేదన మిగిల్చింది. -
ఎంపీ సోయం బాపురావుకు అస్వస్థత!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా తన పీఏతో పాటు ఇద్దరు గన్మెన్లు, ఒక కానిస్టేబుల్, డ్రైవర్, మరో సహాయకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలిపారు. అయితే, సోయం బాపురావు అనారోగ్యానికి గల కారణాలు తెలియరాలేదు. (మా ఆదేశాలు పాటించడం లేదు: హైకోర్టు!) -
దర్శకుడు రజత్ ముఖర్జీ కన్నుమూత
ప్రముఖ హిందీ దర్శకుడు రజత్ ముఖర్జీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘ప్యార్ తునే క్యా కియా, రోడ్, లవ్ ఇన్ నేపాల్’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటిలో ‘రోడ్’ సినిమా రజత్ ముఖర్జీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ‘రజత్ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అన్నారు నటుడు మనోజ్ భాజ్‌పాయ్. డైరెక్టర్ అనుభవ్ సిన్హా, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు రజత్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే రిషీకపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ తదితరులు అనారోగ్యంతో మృతి చెందగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
‘మతి’ పోయింది..ఇపుడు ఓకే!
సావోపోలో : బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో (64) తాత్కాలికంగా జ్ఞాపకశక్తిని కోల్పోయారట. ఈ విషయాన్నిస్వయంగా అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. చికిత్స అనంతరం ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానేవుందని చెప్పొకొచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ హాస్పిటల్లో చికిత్స అనంతరం తన అధికారిక నివాసంలో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాని ఆయన తెలిపారు. బొల్సొనారో అందించిన వివరాల ప్రకారం తన అధికారిక నివాసంలో జారి కిందపడటంతో ఆయన తలకు బలంగా దెబ్బ తగిలింది. అల్వొరాడా ప్యాలెస్‌లో బాత్రూమ్లో జారిపడ్డారు. అయితే పడిపోయిన వెంటనే ఏమీ గుర్తు లేదు..జ్ఞాపకశక్తిని కోల్పోయాననీ అధ్యక్షుడు తెలిపారు. ఉదాహరణకు నిన్న ఏం చేశానో, ఏం జరిగిందో గుర్తు లేదు. ఆ తర్వాతి రోజు నుంచి నెమ్మదిగా, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోగలుగుతున్నా..ఇప్పుడు క్షేమంగానే ఉన్నానని బ్యాండ్ టెలివిజన్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో తన ఆరోగ్య పరిస్థితిని ఆయన వివరించారు. కానీ వయసుతోపాటు, కత్తిపోటు (అధ్యక్ష పదవికి పోటీ సందర్భంగా 2018 సెప్టెంబర్‌లో గుర్తు తెలియని వ్యక్తి కత్తితోదాడి చేశాడు) గాయం వల్ల కొన్ని సమస్యలు ఇంకా వున్నాయన్నారు. కాగాఈ ఏడాది జనవరిలో బొల్సొనారో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తి కడుపులో కత్తితో పొడిచారు. ఈ గాయానికి చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సార్లు సర్జరీ కూడా చేయించుకున్నారు. అలాగే స్కిన్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నానని ఈ నెల ప్రారంభంలో బోల్సొనారో వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఆస్పత్రిలో అమితాబ్..
ముంబై : బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కాలేయ సంబంధ సమస్యలతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులగా ఆయన ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అమితాబ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ తరహాలోని రూమ్‌లో ఆయనను ఉంచారని, కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసింది. కాగా, అమితాబ్ రెగ్యులర్‌గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం అడ్మిట్ అయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని పేర్కొన్నాయి. అమితాబ్ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు. -
కలుషిత ఆహారంతో 20 మందికి అస్వస్థత
సాక్షి, న్యూఢిల్లీ : కలుషిత ఆహారం తీసుకోవడంతో న్యూఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో 20 మంది అస్వస్ధతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందించేందుకు బొకారో స్టేషన్లో రైలును నిలిపివేశారు. నాణ్యత లేని ఆహారం విక్రయించడంపై ప్రయాణీకులు బొకారో రైల్వే స్టేషన్లో ఆందోళనకు దిగారు. సీనియర్ రైల్వే అధికారులు స్టేషన్‌కు చేరుకుని ప్రయాణీకులకు నచ్చచెప్పి వారికి వైద్య చికిత్స ఏర్పాట్లు చేశారు. కాగా, అనారోగ్యానికి గురైన వారిలో చిన్నారులూ ఉన్నారు. న్యూఢిల్లీ నుంచి శనివారం సాయంత్రం బయలుదేరిన రైలులో రాత్రి సమయంలో ప్రయాణీకులకు ఇచ్చిన ఆహారం తిన్న వెంటనే పలువురు అసౌకర్యానికి గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్టు అధికారులకు తెలిపారు. కొందరి ప్రయాణీకుల పరిస్థితి మరింత విషమించడంతో బొకారో రైల్వే స్టేషన్లో రైలును నిలిపివేశారు. గంటపాటు ప్రయాణీకులకు చికిత్స అందించిన అనంతరం రైలు తిరిగి బయలుదేరిందని, ఘటనపై విచారణకు ఆదేశించామని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. -
79 మంది విద్యార్థినులకు అస్వస్థత
సాక్షి, ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు, ఆహారం తిని 36 మంది విద్యార్థినినులు సోమవారం రాత్రి 11 గంటలకు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య మంగళవారం మధ్యాహ్నం వరకు 79కి చేరింది. బాధిత విద్యార్థినులు స్థానిక ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొందుతుండగా, అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే, తాగునీటి కోసం పాఠశాలలో ఏర్పాటు చేసిన బోర్ చెడిపోయి 20 రోజులైందని విద్యార్థులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ స్వర్ణలతకు చెప్పినా పట్టించుకోలేదనీ.. దీంతో 10 ఏళ్లుగా వాడకుండా నిరుపయోగంగా ఉన్న చేతిపంపు నీటిని తాగాల్సి వచ్చిందని వారు వాపోయారు. కాగా, పాఠశాలను డీటీడీవో దిలీప్‌కుమార్ సందర్శించి వంటశాల పరిసరాలను పరిశీలించి సంబంధిత అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందనీ, దీనిపై పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నిర్లక్ష్యమే శాపం.. జిల్లాలో మొత్తం 40 ఆశ్రమ వసతి గృహాల్లో సుమారు 13 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ వసతిగృహాల్లో కనీస వసతులు కల్పించడం అటుంచి.. వాటిలో ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు మేల్కోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వాంకిడి మండలంలోని బాంబార ఆశ్రమ పాఠశాలలో 30 మంది, తిర్యాణి మండలంలోని చెలమెల గురుకుల పాఠశాల 70 మంది, కౌటాల కేజీబీవీ పాఠశాలలో 50 మంది విద్యార్థులు కలుషిత ఆహరం తిని అస్వస్థతకు గురైన సంఘటనలు జరిగాయి. ఇలా ప్రతీ ఏడాది మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.. ఆయా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడం లేదని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వారం నుంచి కడుపునొస్తుంది.. బోర్ పని చేయకపోవడంతో చేతి పంపు నీళ్లనే తాగినం. అవి తాగినప్పుటి నుంచి కడుపు నొప్పి వస్తోంది.మేడంకు చెప్పినా ఏం కాదన్నారు. ఇప్పుడు ఎక్కువయ్యే సరికి దవాఖానకు తీసుకొచ్చిన్రు. – కళ్యాణి, 8వ తరగతి చెప్పినా పట్టించుకోలేదు.. బోర్ నీళ్లు రావడం లేదని వార్డెన్‌కు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోలేదు. మురికి నీటితోనే వంటలు కూడా చేస్తున్నారు. సోలార్ ప్లాంట్లు పని చేయక చల్లనీళ్లే స్నానం చేస్తున్నం. – మౌనిక, 9వ తరగతి బాధ్యులను సస్పెండ్ చేయాలి ఇలా మళ్లీ జరగకుండా ఉండలంటే బాధ్యులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. విద్యార్థుల కోసం వచ్చిన నిధులను వారి కోసం ఖర్చు చేయకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. -యూకే రాము, పాఠశాల చైర్మన్ ఇద్దరి సస్పెన్షన్ విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనలో సిబ్బం ది నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి, ఇందుకు బాధ్యులుగా పాఠశాల ప్రధానోపా ధ్యాయురాలు స్వర్ణమంజుల, వార్డెన్ శాంతను సస్పెండ్ చేస్తున్నట్లు డీటీడీవో దిలిప్‌కుమార్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. విద్యార్థుల వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలే తీసుకోకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. డీటీడీఓ దిలీప్ కుమార్ -
దిలీప్‌కుమార్‌కు తీవ్ర అస్వస్థత
ముంబై : బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ (95) తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. న్యుమోనియా తిరగబెట్టడంతో దిలీప్ కుమార్‌ను ఆదివారం రాత్రి ఆస్పత్రిలో చేర్చారని, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అభిమానులకు, శ్రేయోభిలాషులకు సమాచారం చేరవేస్తామని దిలీప్ కుమార్ కుటుంబ సన్నిహితుడు ఫైసల్ ఫరూఖి ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ ఆరోగ్యం క్షీణించిందని ఇటీవల వార్తలు రాగా, ఫైసల్ ఫరూఖి ఇవి వదంతులేనని తోసిపుచ్చారు. 1944లో జ్వర్ భటా మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన దిలీప్ కుమార్ ఐదు దశాబ్ధాల సుదీర్ఘ కెరీర్లో మరుపురాని చిత్రాల్లో తన అసమాన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోహినూర్, మొఘల్ ఇ ఆజం, దేవ్‌దాస్, నయా దౌర్, రాం ఔర్ శ్యామ్ చిత్రాల్లో దిలీప్ కుమార్ నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు. దిలీప్ కుమార్ చివరిసారిగా 1998లో ఖిలా మూవీలో బిగ్ స్ర్కీన్‌పై కనిపించారు. 1994లో దాదాసాహెబ్ పాల్కే అవార్డు, 2015లో పద్మవిభూషణ్ అవార్డులు ఆయనను వరించాయి. -
‘నా ఆరోగ్యంపై ఊహాగానాలు వద్దు’
ముంబై : అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం అమెరికా వెళుతున్నట్టు బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ తన అభిమానులు, మిత్రులకు సమాచారం అందించారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు. వైద్య చికిత్స నిమిత్తం అమెరికాకు వెళుతూ పనికి కొద్దిరోజులు విరామం ఇస్తున్నానని, తన ఆరోగ్యంపై అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని, ఎలాంటి వదంతులూ ప్రచారం చేయవద్దని కోరారు. అభిమానుల ప్రేమ, ఆశీస్సులతో 45 సంవత్సరాల పాటు తన సినీప్రయాణం సాగిందని, మీ అందరి దీవెనలతో తాను త్వరలోనే తిరిగివస్తానని ట్వీట్లో పేర్కొన్నారు. తమ కుటుంబానికి చెందిన ఆర్కే స్టూడియోస్‌లో ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో రిషీకపూర్ తన కుమారుడు, సోదరులతో కలిసి కనిపించారు. గత ఏడాది ఆర్కే స్టూడియోస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడం కలకలం రేపింది. పునురుద్ధరణ భారీ వ్యయప్రయాసలతో కూడినది కావడంతో సుప్రసిద్ధ ఆర్కే స్టూడియోస్‌ను కపూర్ కుటుంబ సభ్యులు అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. -
కిరోసిన్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మం : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుస్సా వెంకటేశ్వర్లు (35 ) తాపీ మేస్త్రీ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఆ క్రమంలో వెంకటేశ్వర్లు సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్దకు చేరుకుని కొరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అదే సమయంలో వ్యవసాయ పనుల మీద బావి వద్దకు వెళ్లిన కొందరు రైతులు అది గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ వెంకటేశ్వర్లు అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీరు తాగి 30 మంది విద్యార్థినులకు అస్వస్థత
కర్నూలు : కలుషిత మంచి నీరు తాగి సుమారు 30 బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం కర్నూలు జిల్లా హోలగుంద మండలం కేంద్రంలోని కస్తుర్బా బాలికల విద్యాలయంలో చోటు చేసుకుంది. వివరాలు ... మండల కేంద్రంలోని కస్తుర్బా బాలిక విద్యాలయంలో తాగునీటి కొరత ఉంది. దీంతో తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీరు యాజమాన్యం ట్యాంకుల ద్వారా విద్యార్థులకు అందజేస్తున్నారు. అయితే, ఈ నీటిని శుద్ధి చేయకపోవడంతో 30 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. దీంతో విద్యార్థులందరినీ స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలిసిన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. -
సంపూర్ణ ఆరోగ్యానికి 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్
జబ్బు చేసినప్పుడు చికిత్స ఇవ్వడం వైద్యం... జబ్బు రాకుండా నివారించే పద్ధతిలో చికిత్స అందించి, పదేళ్ల వయసు తగ్గిస్తే.. అదే ఏజ్ మేనేజ్మెంట్ మెడిసిన్. అరవైలో కూడా యవ్వనపు ఆరోగ్యాన్ని తీసుకొచ్చే ఈ వైద్య విభాగం మొదటిసారిగా మన దేశంలో అయిదేళ్ల క్రితం రేవా హెల్త్ సెంటర్లో అందుబాటులోకి వచ్చింది. దీనిలో భాగమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్. ఒక జబ్బు, ఒక భాగం అని కాకుండా శరీరం మొత్తాన్ని పరిశీలించి, ఆరోగ్యాన్ని సమీక్షించి చికిత్స అందించడమే ఈ 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం. గతి తప్పే ఆరోగ్యం, జీవనశైలి వ్యాధులకు ఉత్తమ పరిష్కారం 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగామ్ చిన్నవయస్సులో బాధ్యతలు తక్కువ కాబట్టి ఒత్తిడి తక్కువ. 30 ఏళ్ల వయసు వచ్చేసరికి బాధ్యతలు, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆహారం తీసుకోవడం క్రమం తప్పుతుంది. మహిళల్లో కూడా పని ఒత్తిడి పెరగడంతోపాటు, ఉపవాసాలు, ప్రెగ్నెన్సీ, హార్మోన్ల మార్పులు... ఇవన్నీ శరీర ఫిజియాలజీలో మార్పులకు కారణం అవుతాయి. వీటన్నింటికి తోడు కాలుష్యం. సహజసిద్ధమైన ఆహారం లేకపోవడం ఆరోగ్యం గతి తప్పడానికి దోహదం చేస్తుంది. ఈ అంశాలన్నింటినీ సమతుల్యం చేసి, అనుకూల స్థితికి రావడమే 360 డిగ్రీస్ హెల్త్ ప్రోగ్రామ్ ఉద్దేశం. ఈ చికిత్స తరువాత శరీర పనితీరు యవ్వనదశలో లాగ మెరుగుపడుతుంది. ఈ చికిత్సలో భాగంగా వ్యక్తి శరీరతత్వాన్ని, సమస్యల్ని అన్నింటికి సంబంధించిన హిస్టరీ తీసుకుంటారు. అవసరమైన అన్ని పరీక్షలూ చేస్తారు. అప్పుడు తదనుగుణమైన చికిత్స మొదలవుతుంది. డైట్ ద్వారా కొంత, న్యూట్రసుటికల్స్ (న్యూట్రిషన్ సప్లిమెంట్స్) ద్వారా మరికొంత, అవసరాన్ని బట్టి మందులు వాడుతూ ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. ఆరువారాలకు, నాలుగు, ఎనిమిది నెలలకు ఆరోగ్యాన్ని తిరిగి సమీక్షిస్తారు. జెనెటిక్మ్యాపింగ్ ద్వారా జబ్బు రాగల అవకాశాన్ని కూడా ఇప్పుడు ముందే తెలుసుకోవడానికి ఇది వీలు కల్పిస్తోంది. వివరాలకు 800 800 1225 800 800 1235 040 4454 4330 మెయిల్: ksrgopal@revami.com వెబ్సైట్: www.revami.in/ అడ్రస్: రేవా హెల్త్, స్కిన్ అండ్ హెయిర్ జీవీకే వన్ ఎంట్రీ గేట్ ఎదురుగా రోడ్ నెం.4, బంజారాహిల్స్, హైదరాబాద్ -
గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం
హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు జితేంద్రను హుటాహుటిన కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు జితేంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జితేంద్రకు డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షలలో నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. -
సోనియాకు అనారోగ్యం, ముంబై పర్యటన రద్దు!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాల వల్ల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ర్యాలీలో సోనియా పాల్గొనడం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సోనియా అనారోగ్యానికి గురయ్యారని.. అయితే వివరాలు వెల్లడించడానికి పార్టీ నేతలు నిరాకరించారు. ఆదివారం ముంబై, ధూలే, నందర్బార్ ర్యాలీలో పాల్గొనాల్సి ఉంది. సోనియా పర్యటన రద్దు కావడంతో ముంబైలో నిర్వహించే ర్యాలీలో శరద్ పవార్ తో కలిసి రాహుల్ గాంధీ పాల్గొంటారని పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇతర ర్యాలీలలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్ తో కలిసి బాలీవుడ్ నటుడు, కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ పాల్గొంటారని పార్టీ తెలిపింది.