ఆస్పత్రిలో అమితాబ్‌.. | Amitabh Bachchan Undergoes Treatment For Liver Problems | Sakshi
Sakshi News home page

కాలేయ సమస్యలతో ముంబై ఆస్పత్రిలో అమితాబ్‌..

Published Fri, Oct 18 2019 9:44 AM | Last Updated on Fri, Oct 18 2019 9:52 AM

Amitabh Bachchan Undergoes Treatment For Liver Problems - Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కాలేయ సంబంధ సమస్యలతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. గత మూడు రోజులగా ఆయన ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అమితాబ్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఐసీయూ తరహాలోని రూమ్‌లో ఆయనను ఉంచారని, కుటుంబ సభ్యులు తరచూ ఆస్పత్రికి వస్తున్నారని తెలిసింది. కాగా, అమితాబ్‌ రెగ్యులర్‌గా చేయించుకునే ఆరోగ్య పరీక్షల నిమిత్తం అడ్మిట్‌ అయ్యారని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించారని పేర్కొన్నాయి. అమితాబ్‌ ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement