హిందీ దర్శకుడు రజత్ ముఖర్జీ
ప్రముఖ హిందీ దర్శకుడు రజత్ ముఖర్జీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్‌లోని తన నివాసంలో ఆదివారం తుది శ్వాస విడిచారు. ‘ప్యార్ తునే క్యా కియా, రోడ్, లవ్ ఇన్ నేపాల్’ వంటి సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. వీటిలో ‘రోడ్’ సినిమా రజత్ ముఖర్జీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ‘రజత్ ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి’ అన్నారు నటుడు మనోజ్ భాజ్‌పాయ్. డైరెక్టర్ అనుభవ్ సిన్హా, ప్రముఖ ఫిల్మ్‌మేకర్ హన్సల్ మెహతాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు రజత్ ముఖర్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. కాగా ఈ ఏడాది హిందీ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే రిషీకపూర్, ఇర్ఫాన్ ఖాన్, సరోజ్ ఖాన్, వాజిద్ ఖాన్, జగదీప్ తదితరులు అనారోగ్యంతో మృతి చెందగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment