
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.
ద్రోహులుగా చిత్రీకరించారు
ఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్‌కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.
అసౌకర్యానికి గురైతే క్షమించండి
ఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.
చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు
Comments
Please login to add a commentAdd a comment