మామడ(నిర్మల్): నిర్మల్ జిల్లా మామడ మం డలం దిమ్మదుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 114 మంది పాఠశాలకు హాజర య్యారు. వీరికి మధ్యాహ్న భోజనం అందించిన అనంతరం 32 మందికి వాంతుల య్యాయి. ఉపాధ్యాయులు వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, వారు పాఠశాలకు చేరుకుని ప్రాథమిక చికిత్స అం దించారు.
12 మంది అస్వస్థతకు గురవ్వడం తో వారిని అంబులెన్స్‌లో మండల కేంద్రం లోని పీహెచ్‌సీకి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డీఈవో రవీందర్‌రెడ్డి, సర్పంచ్ గీత అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. భోజనంలో అందించిన కోడిగుడ్డు, సాంబార్ అస్వస్థతకు కారణమని అధికారులు భావిస్తున్నారు.
హెచ్‌ఎం సస్పెన్షన్..
ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్ చేయాలని, ఎండీఎం ఏజెన్సీ ని విధుల నుంచి తొలగించాలని డీఈవో రవీందర్‌రెడ్డిని కలెక్టర్ పారూఖీ ఆదేశించారు. హెచ్‌ఎం వినోద్‌కుమార్‌ను సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు.
(చదవండి: TRS MPTC: గొర్రెల కాపరిగా టీఆర్‌ఎస్ ఎంపీటీసీ.. రోజూ కూలీ రూ.500)
Comments
Please login to add a commentAdd a comment