ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక | Priyanka Gandhi Vadra Hospitalized Due To Ill Health | Sakshi
Sakshi News home page

ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Published Fri, Feb 16 2024 4:31 PM | Last Updated on Fri, Feb 16 2024 4:52 PM

Priyanka Gandhi Vadra Hospitalized Due To Ill Health - Sakshi

ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్‌ యాత్ర త్వరలో యూపీలో ప్రవేశించనుంది. ఈ యాత్రలో రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ప్రస్తుతానికి బ్రేక్ ఇస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఆరోగ్యం కుదుటపడిన తరవాత మళ్లీ యాత్రలో పాల్గొంటానని ఎక్స్‌ వేదికగా ప్రియాంక వెల్లడించారు.

‘‘యూపీలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. కానీ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. కాస్త ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ యాత్రలో పాల్గొంటాను. ఈలోగా యూపీలోకి యాత్ర కోసం అడుగు పెడుతున్న అందరికి నా అభినందనలు. రాహుల్ గాంధీకి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను’’ అంటూ ప్రియాంక గాంధీ ట్వీట్‌ చేశారు.

ఇదీ చదవండి: కేజ్రీవాల్‌కు గుజరాత్‌ హైకోర్టు షాక్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement