సాక్షి, వరంగల్: జిల్లాలోని బట్టుపల్లి ఎస్సార్‌ప్రైమ్ క్యాంపస్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో కలకలం రేగింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 10 మందికి క్యాంపస్ లోనే చికిత్స అందించారు కాలేజీ సిబ్బంది. ఆదివారం రాత్రి చికెన్ బిర్యాని తిన్న విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు, విరోచనాలతో అస్వస్థత గురి కావడంతో 30 మందిని ఫాతిమా కొలంబియా మెడికేర్ ఆసుపత్రికి తరలించారు.
15 మంది కి చికిత్స చేసి డిశ్చార్జ్ చేసిన ఆసుపత్రి వర్గాలు, మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. రహస్యంగా ఆసుపత్రికి తరలించి వైద్య అందించడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ నిర్వాహకులకు ఫీజుల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ఆరోగ్యం పైన లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త.. కొత్తగా ‘పల్లె వెలుగు టౌన్ బస్ పాస్’)
పరిశుభ్రతను గాలికి వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఎస్సార్ ప్రైమ్ గుర్తింపు రద్దు చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం నోరు మెదుపకపోగా ఆసుపత్రి వైద్యులు మాత్రం విద్యార్థుల ఆరోగ్య నిలకడ ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
(చదవండి: మానవత్వం చాటుకున్న కేటీఆర్.. రోడ్డు ప్రమాద బాధితులను కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలింపు)
Comments
Please login to add a commentAdd a comment