Food Poisoning In Girls Hostel Warangal Wardhannapet
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్‌పాయిజన్ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్ అన్నంలోని బల్లిని తీసివేశాడు.
ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
చదవండి: డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ జ్వర సర్వే
Comments
Please login to add a commentAdd a comment