Wardannapet
-
బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. 31 మంది విద్యార్థినులకు అస్వస్థత
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్న పేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సాయంత్రం ఫుడ్‌పాయిజన్ కావడంతో 31 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యా రు. పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 5 నుంచి పదో తరగతి వరకు 180 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. సోమవా రం రాత్రి భోజనంలో ఓ విద్యార్థినికి చనిపోయిన బల్లి కనిపించింది. వెంటనే కుక్ అన్నంలోని బల్లిని తీసివేశాడు. ఇంతలో ఆ అన్నం తిన్న ఇతర విద్యార్థినులు కొందరు వాంతులు, విరేచనాలు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది వెంటనే వారిని వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రాథమిక చికిత్స అందించి కొందరిని తిరిగి హాస్టల్‌కు పంపించారు. 31 మందిని మాత్రం ఆస్పత్రిలోనే ఉంచారు. అందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం వరగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా 19 మంది విద్యార్థినులను వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: డెంగీపై సర్కారు యుద్ధం.. డోర్ టు డోర్ జ్వర సర్వే -
వర్ధన్నపేటను జిల్లా కేంద్రం చేయాలి
వర్ధన్నపేట టౌన్ : వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ గాడిపెల్లి రాజేశ్వర్‌రావు, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల యాకయ్య, వర్ధన్నపేట పీఏసీఎస్ చైర్మన్ ముత్తిరెడ్డి కేశవరెడ్డి అన్నారు. వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి ఆరోరోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలను పునర్విభజనలో ఎవరూ కోరని హన్మకొండ జిల్లా ప్రకటించి, మళ్లీ వెనక్కి తీసుకొని, వరంగల్ అర్బన్, రూరల్ పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లాగా చేయాలనుకుంటే , దాని స్థానంలో వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్ధన్నపేటలో 42 ఎకరాల ప్రభుత్వ భూమి, తాత్కాలిక కార్యాలయాలకు ఆర్అండ్బీ అతిథిగృహం, 16 ఎకరాల విస్తీర్ణంలో ఎంపీడీఓ కార్యాలయం, సువిశాలమైన పోలీస్‌స్టేన్ ఉన్నాయని తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మామునూరు ఎయిర్‌పోర్టు, వెటర్నరీ యూనివర్సిటీ, ఏనుమాముల మార్కెట్ ఉన్నాయని, 20 కిలోమీటర్ల దూరంలో రైల్వేస్టేషన్ఉందని, తాజాగా టెక్స్టైల్ పార్క్ మంజూరైందన్నారు. వరంగల్ – ఖమ్మం ప్రధాన రహదారి జాతీయ రహదారిగా మారి త్వరలో ఫోర్‌లైన్‌గా అభివృద్ధి చెందనుందన్నారు. వీటిని పరిగణలోకి తీసుకుని వర్ధన్నపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. దీక్షలో అఖిలపక్ష నాయకులు మార్త సారంగపాణి, తూళ్ల కుమారస్వామి, రామగిరి అనిల్, కొండేటి సత్యం, నాంపెల్లి యాకయ్య, నరుకుడు వెంకటయ్య, సిలువేరు కుమారస్వామి, నాగెల్లి సురేష్, కొండేటి శ్రీనివాస్, ఐత యాకాంతం కొండేటి మహేందర్, కంజర్ల మహేష్, ఎలికట్టె ముత్తయ్య పాల్గొన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శిగా శ్రీనివాస్
వర్ధన్నపేట : మండలంలోని బండౌతపురం శివారు అంబేద్కర్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆరెల్లి శ్రీనివాసులు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్(బీఎస్అండ్జీ) జిల్లా కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఆ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎ.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. హన్మకొండలోని డీఈఓ కార్యాలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన బీఎస్అండ్జీ ఎన్నికల్లో జిల్లా కార్యదర్శిగా శ్రీనివాసులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్ అభ్యర్ధి ఆత్మాహత్యాయత్నం!
-
వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం!
-
వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నం!
వరంగల్: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్ధి కే. శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన శ్రీధర్ పరిస్థితి విషమంగా మారడంతో ఆయన స్థానిక ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ వర్ధన్నపేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆర్ధికంగా చితికి పోయిన శ్రీధర్ ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయలేకనే ఆత్మాహత్యాయత్నానికి ప్రయత్నించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాక ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి కూడా ముదంజలో ఉన్నాడని.. ఓటమి తప్పదనే కారణంతో ఆత్మహత్యాకారణమై ఉండవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే శ్రీధర్ ఆత్మాహత్యాయత్నానికి ఖచ్చితమైన కారణాలు తెలియరాలేదు.