
గుంతకల్లు ఎమ్మెల్యేకు తీవ్ర అనారోగ్యం
హైదరాబాద్: అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, కుటుంబ సభ్యులు జితేంద్రను హుటాహుటిన కర్నూలు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు జితేంద్రకు వైద్య పరీక్షలు నిర్వహించారు. జితేంద్రకు డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వైద్య పరీక్షలలో నిర్థారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు.