జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL) ఆడిట్‌లో లోపాలు జరిగినట్లు నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) గుర్తించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్‌లో లోపాలకు కారణమైన డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్‌పీకి రూ.2 కోట్ల జరిమానా విధించింది. ఈ ఆడిట్‌లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు చార్టర్డ్ అకౌంటెంట్లపై చర్యలు తీసుకుంది.
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ఆడిట్ పనులను డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్‌పీకి అప్పగించింది. సుమారు రూ.200 కోట్ల ఆడిట్(audit)లో అవకతవకలు జరిగినట్లు ఎన్ఎఫ్ఆర్ఏ గుర్తించింది. దాంతో డెలాయిట్ హాస్కిన్స్‌కు రూ.2 కోట్ల జరిమానా విధించింది. కంపెనీ అనధికార లావాదేవీలను గుర్తించడం, వాటిని నివేదించడంలో ఆడిట్ సంస్థ విఫలమైందని ఎన్ఎఫ్ఆర్ఏ తెలిపింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సీఏలు ఏబీ జానీను రూ.10 లక్షలు జరిమానా(fine)తోసహా ఐదేళ్ల పాటు ఆడిట్ పనుల నుంచి నిషేధించగా, రాకేశ్ శర్మకు రూ.5 లక్షల జరిమానాతోపాటు మూడేళ్లు నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చదవండి: కిరాణా దుకాణాలకు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్
డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ ఎల్ఎల్‌పీ అనేది ఎకనామిక్ వ్యవహారాలు నిర్వహిస్తున్న ప్రొఫెషనల్ సేవల సంస్థ. ఇది ఆడిట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, రిస్క్ అడ్వైజరీ, టాక్స్ సేవలతో సహా విస్తృత శ్రేణి సేవలను అందిస్తోంది. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ సర్వీసులు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment