త్వరలో భారత్ లో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించనున్నారు.
ఆక్లాండ్:త్వరలో భారత్ లో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ ట్రోఫీలో పాల్గొనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మంగళవారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా) సెలక్టర్ రాడ్ మార్ష్ స్పష్టం చేశారు. దీంతో పాటు మార్చిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ఆసీస్ జట్టును ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు మూడు వన్డేల సిరీస్ తో పాటు, రెండు టెస్టుల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే.