‘టి20 ప్రపంచకప్‌’ ఆసీస్‌ చేతిలోనే ఉంది: సచిన్‌ | Decision Of T20 World Cup Rests On Cricket Australia, Sachin | Sakshi
Sakshi News home page

‘టి20 ప్రపంచకప్‌’ ఆసీస్‌ చేతిలోనే ఉంది: సచిన్‌

Published Sun, Jun 14 2020 9:58 AM | Last Updated on Sun, Jun 14 2020 10:03 AM

Decision Of T20 World Cup Rests On Cricket Australia, Sachin - Sakshi

న్యూఢిల్లీ: షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌లో టి20 ప్రపంచకప్‌ నిర్వహించాలా? వద్దా? అనేది క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)నే నిర్ణయిస్తుందని భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అన్నాడు. ఐసీసీ కూడా ఇంకా ఈ అంశంపై స్పందించాల్సి ఉందని పేర్కొన్నాడు. ‘టి20 ప్రపంచకప్‌ నిర్వహణ అనేది క్రికెట్‌ ఆస్ట్రేలియా బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఆర్థిక వ్యవహారాలతో పాటు పలు అంశాలు దీనితో ముడిపడి ఉన్నాయి.

ఈ వ్యవస్థలన్నీ ఏకమై టోర్నీ నిర్వహణకు దోహదపడతాయేమో చూడాలి. ఇది కఠిన నిర్ణయమే కానీ క్రికెట్‌ కార్యకలాపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది పెద్ద సమస్య కాబోదు’ అని టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement