సిడ్నీ: ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెట్‌పై చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. శనివారం మూడో రోజు ఆటలో టీమిండియా బౌలర్లు బుమ్రా, సిరాజ్‌లపై స్టేడియంలోని ప్రేక్షకులు జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆసీస్ అభిమానులు ప్రత్యేకంగా సిరాజ్‌ను ఉద్దేశించి మంకీ అని సంబోధించారు. దీనిపై మ్యాచ్ అంపైర్లకు కెప్టెన్ రహానేతో పాటు సిరాజ్‌లు ఫిర్యాదు. ఈ క్రమంలోనే నిన్న మూడో రోజు ఆటకు అంతరాయం ఏర్పడింది. (టీమిండియాకు భారీ టార్గెట్)
ఎవరైతే జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారో వారిని పోలీసులు బయటకు పంపారు. ఈ ఘటనకు కారణమైన ఆరుగుర్ని మ్యాచ్ చూసే అనుమతి క్యాన్సిల్ చేస్తూ బయటకు పంపించేశారు. వారంతా మద్యం సేవించే భారత క్రికెటర్లపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీనిపై టీమిండియాకు క్రికెట్ ఆలియా(సీఏ) క్షమాపణలు తెలిపింది. మరొకవైపు దీనికి సంబంధించి మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్‌కు బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇదొక జంటిల్ మ్యాన్ గేమ్ అని, ఇక్కడ జాతి వివక్ష వ్యాఖ్యలకు చోటు లేదని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. దీనిపై సీఏ సీరియస్‌గా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. మరో రెండు వారాల్లో దీనిపై సీఏ విచారణ చేపట్టనుంది. ఇది పూర్తిగా ఆతిథ్యం దేశం బాధ్యత కాబట్టి సీఏనే విచారణ జరుపనుంది.
ఇదిలా ఉంచితే, టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 407 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నాల్గో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్ 312/6 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 400లకు పైగా టార్గెట్‌ను టీమిండియా ముందుంచింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్(73), స్టీవ్ స్మిత్(81), కామెరూన్ గ్రీన్(84)లు రాణించడంతో పాటు కెప్టెన్ టిమ్ పైన్(39 నాటౌట్) ఆకట్టుకోవడంతో ఆసీస్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Comments
Please login to add a commentAdd a comment