హైదరాబాద్ జట్ల జయకేతనం | victory for hyderabad teams | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ జట్ల జయకేతనం

Published Mon, Jan 19 2015 1:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ జట్ల జయకేతనం - Sakshi

హైదరాబాద్ జట్ల జయకేతనం

సీనియర్స్, జూనియర్స్ ట్రోఫీలు వశం
 
సాక్షి, హైదరాబాద్: చెన్నైలో జరిగిన ఇంటర్‌స్టేట్ ఎమర్జింగ్ టి-20 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ సీనియర్, జూనియర్ ఈసీడీజీ జట్లు విజేతలుగా నిలిచాయి. సీనియర్ విభాగంలో జరిగిన ఫైనల్లో ఎమర్జింగ్ క్రికెట్ డెవలప్‌మెంట్ గ్రూప్ (ఈసీడీజీ) హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో అశోక్ ఆనంద్ సీఏపై గెలిచింది. మొదట అశోక్ ఆనంద్ సీఏ 19.1 ఓవర్లలో 80 పరుగులకే ఆలౌటైంది. సంజిత్ 16 పరుగులు చేయగా, వంశీ, షాదతుల్లా చెరో 3 వికెట్లు తీశారు.

తర్వాత ఈసీడీజీ హైదరాబాద్ జట్టు 12.2 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసి విజయం సాధించింది. అభినవ్ (47) రాణించాడు. జూనియర్స్ ఫైనల్లో ఈసీడీజీ 44 పరుగుల తేడాతో కేదార్ సీఏపై నెగ్గింది. తొలుత ఈసీడీజీ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. ప్రణవ్ 32, షాయిజన్ 31, గౌస్ 22 పరుగులు చేశారు. తర్వాత కేదార్ సీఏ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 92 పరుగులే చేయగల్గింది. ప్రసన్న 15 పరుగులు చేయగా, రిషి రెడ్డి 3 వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement