సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రకటించిన ఆటగాళ్ల తాజా కాంట్రాక్ట్ జాబితాలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఆసీస్ టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజాను కాంట్రాక్ట్ జాబితా నుంచి సీఏ తొలగించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆస్ట్రేలియా టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఖవాజాకు కాంట్రాక్ట్ జాబితాలో చోటివ్వలేదు. గత జాబితాలో ఉన్న ఖవాజను కొత్త జాబితా నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. ఖవాజాతో పాటు పీటర్ హ్యాండ్‌స్కోంబ్, మార్కస్ హారిస్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్‌లను తప్పించింది.( అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)
వీరిలో ఖవాజా, షాన్ మార్ష్ కాంట్రాక్ట్‌లను కొనసాగించకపోవడం చర్చనీయాంశమైంది. ఇక వారి స్థానాల్లో మార్కస్ లబూషేన్, ఆస్టన్ ఆగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్‌సన్, మాథ్యూ వేడ్‌లకు అవకాశం ఇచ్చింది. గతంలో ఆయా ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 12 అప్‌గ్రేడ్ పాయింట్లను(మూడు ఫార్మాట్లకు కలిపి) కేటాయించిన సీఏ.. తాజాగా దానిని 8 అప్‌గ్రేడ్ పాయింట్లకే పరిమితం చేసింది. ఒక్కో టెస్టు మ్యాచ్‌కు 5 పాయింట్లు, వన్డేకు రెండు పాయింట్లు, టీ20కి ఒక్కో పాయింట్ చొప్పున కేటాయించి ఆటగాళ్ల కాంట్రాక్ట్ జాబితాను రూపొందించింది. ఈ మేరకు 20 మందితో కూడిన కొత్త జాబితాను ప్రకటించింది. (హిట్‌మ్యాన్‌కు స్పెషల్ డే..!)
క్రికెట్ ఆస్ట్రేలియా కాంట్రాక్ట్ జాబితా ఇదే..
ఆస్టన్ ఆగర్, జో బర్న్స్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, అరోన్ ఫించ్, జోష్ హజల్‌వుడ్, ట్రావిస్ హెడ్, లబూషేన్, నాథన్ లయాన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, టిమ్ పైన్, జేమ్స్ పాటిన్‌సన్, జహీ రిచర్డ్‌సన్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
Comments
Please login to add a commentAdd a comment