- దేశ ఆర్థిక వ్యవస్థలో సీఏల పాత్ర కీలకం
- వార్షికోత్సవ సభలో మాగ్నజీల్ చైర్మన్ రేపాల
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో సీఏలు కీలకపాత్ర పోషిస్తున్నారని మ్యాగ్నజీల్ చైర్మన్ రేపాల రవికుమార్ చెప్పారు. సీఏ లక్ష్యంగా గల యువత లక్ష్య సాధనకు అవసరమైన శిక్షణ, ప్రేరణతో భావి జీవితంలో నెగ్గుకు వచ్చే మార్గదర్శనం చేస్తున్నామని చెప్పారు. బ్రాడీపేట 3వ లైనులోని కార్యాలయంలో మ్యాగ్నజీల్ సీఏ విద్యాసంస్థ ద్వితీయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
రవికుమార్‌తోపాటు సంస్థ డెరైక్టర్ రేపాల భానువిజేత, విద్యార్థులతో కలిసి గాలిలోకి బెలూన్లు వదిలి సందడి చేశారు. అనంతరం కేక్ కట్ చేసిన రవికుమార్ మాట్లాడుతూ దేశానికి ప్రతిభావంతులైన సీఏ విద్యార్థులను అందించే లక్ష్యంతో రెండేళ్ళ క్రితం నెలకొల్పిన మ్యాగ్నజీల్ అదే స్ఫూర్తితో ప్రగతి పధంలో దూసుకెళుతోందన్నారు.
కార్యక్రమంలో అకడమిక్ డీన్ వైఎల్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యానగర్‌లోని సంస్థ హాస్టల్ క్యాంపస్‌లో సాయంత్రం జంబోరీ పేరుతో విద్యార్థినులు డ్యాన్సులతో హోరెత్తించారు. సినీ, పాప్ గీతాలకు నృత్యాలతో హుషారెత్తించారు. పలువురు విద్యార్థినులు గీతాలాపనతో ఆకట్టుకున్నారు.