సాక్షి, కడప: అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల గ్రామంలో సీఏ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రవీంద్రబాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మల్లెల గ్రామానికి చెందిన బలక రమేష్, సునీత దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. పొలం పనులు చేసుకుని పిల్లలను చదివించేవారు. పెద్ద కుమార్తె స్వాతి (21) గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర ఫౌండేషన్ కళాశాలలో సీఏ చదువుతుండగా, రెండో కుమార్తె బీటెక్, చిన్న కుమారుడు 6వ తరగతి చదువుతున్నాడు.
ఈ నేపథ్యంలో సీఏ చదువు పూర్తి చేసుకున్న పెద్ద కుమార్తె స్వాతి గుంటూరు నుంచి 15 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. ఈ తరుణంలో గురువారం సాయంకాలం నీ చదువు కోసం రూ.లక్షలు ఖర్చు చేశాం, పరీక్షలు బాగా రాశావా తల్లీ, గతంలో లాగా కాకుండా, ఈ సారైనా పాస్ అవుతావా అని కన్నవాళ్లు స్వాతిని ప్రశ్నించారు. లేకుంటే మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తామని సున్నితంగా సూచించారు. సదరు యువతి ఏమనుకుందో ఏమో, పరీక్షల్లో ఫెయిల్ అవుతానేమో, లేదా కన్నవాళ్ల ఆశలు నెరవేర్చలేనేమో అని అనుకుందో గాని క్షణికావేశంలో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: తమ్ముడు రాయితో కొట్టాడని.. అర్ధరాత్రివేళ కిరాతకంగా మారిన అన్న..
Comments
Please login to add a commentAdd a comment