
వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో 2025–26 సంవత్సరంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు పట్టణ, గ్రామీణ ప్రాంతంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించేందుకు ఆసక్తి గల శిక్షకులు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు సీనియర్ క్రీడాకారుల నుంచి ప్రతిపాదలను తీసుకుంటున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జగన్నాథ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ ప్రతిపాదనలను ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో అందచేయాలని సూచించారు.
పీహెచ్‌ఎంఈయూ జోన్ అధ్యక్షుడిగా రామ సుబ్బారెడ్డి
కడప రూరల్: పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాయలసీమ జోన్ అధ్యక్షుడిగా పీజే రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. తన నియామకం సందర్భంగా ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు ఆస్కార్ రావు, ప్రధాన కార్యదర్శి అహరోన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టి డి కే సాగర్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
21న ధర్నా
పులివెందుల టౌన్: మాదిగల వర్గీకరణ సాధన కోసం ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు డప్పు చర్మకారుల రాష్ట్ర అధ్యక్షుడు కె.నాగభూషణం వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో డప్పు చర్మకారుల సంఘ నాయకులతో కలిసి విలేకరుతో మాట్లాడారు. వర్గీకరణ సాధన కోసం మాదిగ సోదరులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కృష్ణమూర్తి, బాల నరసింహులు, బలపనూరు భార్గవ, భీమన్న పాల్గొన్నారు.
పీజీ వైద్య విద్యార్థిని ప్రతిభ
కడప అర్బన్: ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అండ్ ఎండోడాంటిక్స్ (ఐఏసీడీఈ) ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలో కడప ప్రభుత్వ దంతవైద్య కళాశాల ఎండోడాంటిక్స్ విభాగ పీజీ విద్యార్థిని డాక్టర్ స్నేహ జంగటే విశేష ప్రతిభ కనబరిచారు. కాంపిటీటివ్ పేపర్ విభాగంలో (కేస్ రిపోర్ట్) ద్వితీయ బహుమతి సాధించారు. వీరిని ఆ విభాగపు అధ్యాపకులు డాక్టర్ పి. సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుందర్, డాక్టర్ దుర్గాభవాని, డాక్టర్ పవన్‌కుమార్, డాక్టర్ తేజశ్రీ రాథోడ్, డాక్టర్ తిరుపతి నాయుడు సరైన మార్గదర్శకాలు అందించి పోటీకి సిద్ధం చేశారు. పీజీ విద్యార్థిని డాక్టర్ స్నేహను ప్రభుత్వ దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్న అభినందించారు.
వైవీయూ పీజీ సెమిస్టర్
పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ , ఎంపీఈడీ, ఎంసీఏ)నాలుగో సెమిస్టర్, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పరీక్షలు మంగళవారం విశ్వవిద్యాలయ ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను రిజిస్ట్రా ర్ ఆచార్య పి పద్మ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఆచార్య కె. ఎస్ వి కృష్ణారావు తో కలసి తనిఖీ చేశారు. నిర్వహణలో ఇబ్బందుల గురించి ఆరా తీశారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షల సూపరింటెండెంట్ ఆచార్య కాత్యాయని మాట్లాడుతూ పరీక్షా కేంద్రంలో 543 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఒకరు మాత్రమే గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షల నిర్వహణ బాధ్యతల్లో అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మిప్రసాద్, డాక్టర్ ముని కుమారి, సిబ్బంది చంద్రమౌళి పాల్గొన్నారు.

వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

వేసవి శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం