
జననేతకు పాలాభిషేకం
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సును కాంక్షించేవాడే నిజమైన నాయకుడవుతాడు..అధర్మాన్ని.. అన్యాయాన్ని ఎదిరించినవాడు.. సత్యం వైపు నిలబడేవాడే జననాయకుడిగా మిగిలిపోతారు.. వైఎస్సార్ సీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ అదే చేస్తున్నా రు. అధికార గర్వంతో... తామేంచేసినా చెల్లుతుంది..చట్టమవుతుందన్న అహంకారంతో కూటమి నేతలందరూ కూడబలుక్కుని తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి అండగా నిలిచారు. దీంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ చిత్రపటానికి సింహాద్రిపురం ముస్లింలు పాలా భిషేకం చేశారు. ముస్లింలపట్ల కూటమి నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నా రని ధ్వజమెత్తారు.
– సింహాద్రిపురం
సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్పయాగం నిర్వహిస్తున్న వేదపండితులు