Andhra Pradesh News
-
టాప్ 50 హెడ్‌లైన్స్@07:30 AM 23 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం@10:40AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45AM 16 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30 AM 12 April 2024
-
టాప్ 50 హెడ్‌లైన్స్@12:45PM 09 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@7AM 09 April 2024
-
టాప్ 30 న్యూస్@11:15AM 05 April 2024
-
మార్నింగ్ ప్రైమ్ టైం న్యూస్@11AM 05 April 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@03:15PM 29 March 2024
-
‘సైకిల్’ దొంగ దొరికాడోచ్!
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి, తాయిలాల ఎరవేసి ఓట్లు దక్కించుకునేందుకు టీడీపీ పన్నాగం పన్నింది. విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి తల్లిదండ్రుల మెప్పుపొందేందుకు భారీ సంఖ్యలో సైకిళ్లను కొనుగోలు చేసింది. టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల స్వగ్రామం చింతలపూడిలోని ఓ రైస్‌మిల్లులో నిల్వ చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు వాటిని సీజ్ చేశారు. శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు పొన్నూరు నియోజకవర్గం ఎన్నికల అధికారులకు ఫోన్ చేశారు. మండలంలోని చింతలపూడి గ్రామంలోని ఓ రైస్‌మిల్‌లో టీడీపీ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర ఫొటో, సైకిల్ గుర్తుతో ఉన్న నూతన సైకిళ్లు వందల సంఖ్యలో ఉన్నాయని సమాచారం అందింది. వెంటనే అధికారులు హుటాహుటిన రైస్‌మిల్‌కు చేరుకుని వందల సంఖ్యలో ఉన్న సైకిళ్లను చూసి అవాక్కయ్యారు. అన్ని సైకిళ్లకు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ రంగు, గుర్తులు, అభ్యర్థి ఫొటో ఉండటంతో అన్ని సైకిళ్లను సీజ్ చేశారు. సంఘటనా స్థలానికి ఓ వ్యక్తి చేరుకుని తాను కోర్టు ద్వారా ఆక్షన్‌లో సైకిళ్లను దక్కించుకున్నానని, అధికారులకు తెలిపాడు. అయితే ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సైకిళ్లు ఉన్నాయని, ఒకేచోట పార్టీ సింబల్స్‌తో ఇన్ని సైకిళ్లు ఉండరాదని తేల్చిచెప్పారు. కోడ్ ఉల్లంఘించిన కారణంగా 567 సైకిళ్లను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారి వరదరాజులు, ఏంపీడీవో రత్నజ్యోతి తెలిపారు. ధూళిపాళ్ల నరేంద్ర ఎన్నికల తాయిలాల పంపకంతోనే విజయం సాధించే ప్రక్రియకు ఎన్నికల అధికారులు అడ్డుకట్ట వేశారు. ఇవి చదవండి: ‘ఆమ్ ఆద్మీ’ని అంతం చేసే కుట్ర -
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 26 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@11:30AM 21 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:45 AM 21 March 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@10:15 AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@07:30AM 19 March 2024
-
సాక్షి స్పీడ్ న్యూస్@02:30PM 13 March 2024
-
AP : సమాచార హక్కు కొత్త కమిషనర్ల ప్రమాణం
విజయవాడ, 11 మార్చి: రాష్ట్ర సమాచార కమీషన్‌కు నియమించబడిన ముగ్గురు నూతన కమీషనర్లు చావలి సునీల్, రెహానా బేగం, అల్లారెడ్డి ఉదయ భాస్కర్ రెడ్డిలచే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్. జవహర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ మేరకు విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో నూతన సమాచార కమీషనర్లచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమీషన్ ముఖ్య సమాచార కమీషనర్ మెహబూబ్ భాషా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, సమాచార కమీషనర్లు ఐలాపురం రాజా, శామ్యూల్ జొనాతన్, కాకర్ల చెన్నారెడ్డి, సమాచార కమీషన్ లా సెక్రటరీ జీ. శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు నేమాని భాస్కర్, నూతన సమాచార కమీషనర్ల కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెహానా గురించి.. రెహానా స్వస్థలం కృష్ణా జిల్లా, ఉయ్యూరు. జర్నలిస్టుగా 20 ఏళ్ళ అనుభవం. జర్నలిజంలో పరిశోధనాత్మక కథనాలు, సాహసోపేత ప్రయాణాలతో ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలికలతో అరబ్ షేకుల కాంట్రాక్ట్ వివాహాలు, 2008 ముంబాయి మారణహోమం లైవ్ కవరేజ్, ఉత్తరాఖండ్ వరదల రిపోర్టింగ్, సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి కవరేజ్ వంటివి వీటిలో కొన్ని.. దక్షిణాన తమిళనాడు మొదలు ఉత్తరాన జమ్ము-కాశ్మీర్, పశ్చిమాన గుజరాత్ మొదలు తూర్పున త్రిపుర వరకు 17 రాష్ట్రల నుంచి వివిధ అంశాలపై రిపోర్ట్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిచినప్పుడు నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 10 మంది ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు రెహానా ఖాతాలో ఉన్నాయి. భారత భూభాగంలో భారత-పాక్, భారత-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ప్రయాణం చేసి ప్రత్యేక కథనాలు అందించారు. గత ఏడాది టర్కీలో జరిగిన భూకంప ప్రళయాన్ని సాహసోపేతంగా కవర్ చేశారు రెహాన. రెహానా రాసిన పుస్తకాలు అంతర్జాతీయ సరిహద్దుల్లో చేసిన పాత్రికేయ ప్రయాణ అనుభవాలతో "సరిహద్దుల్లో.." పేరుతో పుస్తకం తెచ్చారు. ఈ పుస్తకం "ఫ్రాంటియర్" పేరుతో ఇంగ్లీషులో అనువాదం అయ్యింది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనాన్ని "పెన్ డ్రైవ్" పేరుతో వెలువరించారు. టర్కీ భూకంప కవరేజ్ అనుభవాలతో టర్కీ @7.8 టైటిల్ తో పుస్తకం తెచ్చారు. అవార్డులు-రివార్డులు.. తెలంగాణ ప్రభుత్వ బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు, తెలంగాణా ప్రెస్ అకాడమీ అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, వివిధ సంస్థల పురస్కారాలు, అవార్డులు ఆమె ఖాతాలో ఉన్నాయి. గత ఏడాది మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ మహిళా జర్నలిస్టు పురస్కారంతో సత్కరించింది. ఏపీ మీడియా అకాడమీ కూడా బెస్ట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా పురస్కారం అందజేసింది. నిర్వర్తించిన ఇతర బాధ్యతలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ కమిటీ సభ్యురాలు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ అసెంబ్లీ మీడియా అడ్వైజరీ సభ్యురాలిగా, ఏపీ మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇవి చదవండి: మనబడి ‘ఐబీ’కి అనుకూలం! -
టాప్ 50 హెడ్‌లైన్స్@08:30AM 05 March 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 05 March 2024
-
సాక్షి టాప్ హెడ్‌లైన్స్@06:45AM 21 February 2024
-
టాప్ హెడ్‌లైన్స్@06:30AM 20 February 2024
-
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని తీవ్ర నిర్ణయం..
బాపట్ల: పరీక్షలు సరిగ్గా రాయలేనేమోననే బెంగతో మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బలరాం కాలనీకి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావు కుమార్తె ప్రవల్లిక (16) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో జరగబోతున్న పరీక్షలు సరిగా రాయలేనేమోనని తరచూ స్నేహితులతో చెప్పే ప్రవల్లిక మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ.. -
టాప్ 50 హెడ్‌లైన్స్@6AM 13 February 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@9PM 07 February 2024
-
టాప్ 30 హెడ్‌లైన్స్@09:45AM 23 January 2024