
పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజిపతిరాయ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించకుండా కొన్ని విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయని పరిపాలనా వికేంద్రీకరణ నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ హనుమంతు లజిపతిరాయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన గురువారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా రాజధాని విషయంలో న్యాయపరమైన నిర్ణయం మరింత ఆలస్యం కావడంపై విచారం వ్యక్తంచేశారు.
ఏదో ఒకరకమైన సాంకేతిక అంశాలను లేవనెత్తి సుప్రీంకోర్టులో త్వరితగతిన తీర్పు రాకుండా విజ్ఞత లేని రాజకీయ పార్టీలు అడ్డుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలని నిర్ణయించే అధికారం ఆయా ముఖ్యమంత్రులకు లేదని తెలిపే అధికరణ భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన స్పష్టంచేశారు. మారుతున్న అభివృద్ధి.. అవసరాల దృష్ట్యా పరిపాలనా వికేంద్రీకరణను ఇప్పటికే ప్రపంచంలో 14కు పైగా దేశాలు పాటిస్తున్నాయని చెప్పారు. మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో హైకోర్టు ఒకచోట ఉంటే శాసనసభ వ్యవహారాలు మరోచోట ఉన్న విషయాన్ని గుర్తుచేశారు.
ఇవి చదవండి: Fact Check: ‘మీటర్ల’ కొద్దీ అసత్యాలు అల్లేస్తున్నారు!