నేడు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక శిబిరాలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: జిల్లా వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ సర్వీసు శిబిరాలు నిర్వహించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం షేక్ ముజీబ్ పాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 2025 నెలను కస్టమర్ సర్వీస్ నెలగా పాటించడం కోసం కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాల వద్ద బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కస్టమర్ సర్వీస్ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నా రు. ఈ శిబిరంలో మొబైల్ సిమ్ సేవలు, ఫైబ ర్ ఇంటర్నెట్, ఇతర బీఎస్‌ఎన్‌ఎల్ సేవలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. వినియోగదారులు తమ సేవల సమస్యల పరిష్కారానికి .. కొత్త సేవలు కోసం తప్పకుండా ఈ శిబిరాన్ని సందర్శించాలని సూచించారు.
జిల్లా వాసులకు
నాటకరంగ పురస్కారాలు
కడప కల్చరల్: రంగస్థలంలో చిరకాలంగా విశేష సేవలందిస్తున్న కళాకారులకు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారకంగా ఇచ్చే తెలుగు నాటకరంగ దినోత్సవం పురస్కారాలకు జిల్లాకు చెందిన ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు. వీరిలో వైఎస్‌ఆర్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు డాక్టర్ మూల మల్లికార్జునరెడ్డి, ప్రొద్దుటూరు కళాభారతి నాటకసంస్థ సభ్యులు ఆర్. సుబ్రమణ్యం, కె.సుభాష్‌చంద్రబోష్ ఉన్నారు. కాగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం జరగనున్న పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో వీరు అతిథుల చేతుల మీదుగా పురస్కారాలను అందుకోనున్నారు.
నేడు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక శిబిరాలు
నేడు బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక శిబిరాలు


