ప్రపంచంలోనే సుష్మాస్వరాజ్ ది ప్రథమ స్థానం!
ట్విట్టర్ ఫాలోయర్స్ అధికంగా ఉన్న ప్రపంచంలోని టాప్ టెన్ నాయకుల జాబితాలో ఇద్దరు భారతీయులు నిలువగా... అందులో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ మొదటి స్థానంలో ఉన్నారు. ట్విట్టర్ ఫాలోయర్స్ అధికంగా ఉన్న ఏకైక మహిళా నాయకురాలుగా సుష్మా మొదటి ర్యాంకును సంపాదించగా... ప్రధాని మోదీ మూడో స్థానంలో ఉన్నారు.
సోషల్ నెట్వర్క్ సైట్ ట్విట్టర్ లో దాదాపు 20 మిలియన్ లమంది ఫాలోయర్స్ ఉన్న మహిళా నాయకురాలుగా సుష్మాస్వరాజ్ గుర్తింపు పొందారు. ఎక్కువ మంది ఫాలోయర్స్ కలిగిన ట్విట్టర్ టాప్ టెన్ మహిళా నాయకుల జాబితాలో సుష్మా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత 5 మిలియన్లమంది ఫాలోయర్స్ కలిగిన పురుష నాయకుడుగా ప్రధాని నరేంద్ర మోదీ మూడో స్థానాన్ని పొందినట్లు ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది.
ఇకపోతే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా 75 మిలియన్ లమంది ఫాలోయర్స్ తో ప్రథమ స్థానంలో నిలువగా, 29 మిలియన్ల ట్విట్టర్ అనుచరులున్న పోప్ ఫ్రాన్సిస్ రెండో స్థానాన్ని సంపాదించారు. అలాగే భారతీయ నాయకుల్లో రెండో స్థానాన్ని పొందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ స్థాయిలో అత్యధిక ట్విట్లర్ అనుచరులు ఉన్న నాయకుడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. పీఎంఓ ఇండియా ఖాతాతో నరేంద్రమోదీ మొత్తం 11మిలియన్ల మంది అనుచరులను కలిగి ఉన్నారు. అలాగే జోర్దాన్ క్వీన్ రైనా.. 4.7 మిలియన్లమంది ఫాలోయర్స్ తో ప్రపంచంలో రెండో మహిళా నాయకురాలుగా నిలిచారు.