ఎంసెట్-3 ఫలితాల విడుదల
తెలంగాణ మెడికల్ ఎంసెట్-3 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన పాపిరెడ్డి గురువారం మధ్యాహ్నం ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. విద్యార్థులు తమ ర్యాంకులను tseamcet.in, sakshieducation.com వెబ్సైట్లలో పొందవచ్చు. కాగా ప్రాథమిక కీపై బుధవారం సాయంత్రం వరకు అభ్యంతరాలు స్వీకరించిన ఎంసెట్ కమిటీ వాటిని పరిశీలించి రాత్రి ఫైనల్ కీ విడుదల చేయాలని భావించినా సాధ్యం కాలేదు. అభ్యంతరాలు ఎక్కువ మొత్తంలో రావడంతో ఫైనల్ కీని విడుదల చేయలేదు. ఈ నెల 15న ఎంసెట్ ర్యాంకులతో పాటు ఫైనల్ కీని విడుదల చేయాలని నిర్ణయించింది.
ఉన్నత విద్యామండలి కన్వీనర పాపిరెడ్డి మాట్లాడుతూ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి ఎనిమిది మార్కులు కలుపుతామన్నారు. ఎనిమిది ప్రశ్నలకు సంబంధించి ఏడింటికి సమాధానం లేదని, ఓ ప్రశ్న సిలబస్‌లో లేదన్నారు.
ర్యాంకులు సాధించిన విద్యార్థుల వివరాలు
మొదటి ర్యాంకు : రేగళ్ల మానస 152 మార్కులు (కృష్ణాజిల్లా)
రెండో ర్యాంకు: హారిక 151 (సికింద్రాబాద్)
మూడో ర్యాంకు : తేజశ్విని 151 (అనంతపురం)
నాలుగో ర్యాంకు : జీషన్ అహ్మద్ 151 (హైదరాబాద్)
ఐదో ర్యాంకు: ఇమ్రాన్ ఖాన్ 151 (హైదరాబాద్)
ఆరో ర్యాంకు : శ్రీకాంతేశ్వర్ రెడ్డి 151 (సికింద్రాబాద్)
ఏడో ర్యాంకు : మిట్టపల్లి అలేఖ్య 150 (ఖమ్మం)
ఎనిమిదో ర్యాంకు: నుజత్ ఫాతిమా 150 (ఆదిలాబాద్)
తొమ్మిదో ర్యాంకు: కావ్య బులుసు (150) (హైదరాబాద్)
పదో ర్యాంకు: వెంపటి రూపేష్ (150) (నల్లగొండ)