ఎంసెట్ మెరికలు
ఇంజనీరింగ్‌లో బాలురు.. అగ్రికల్చర్‌లో బాలికలు
- ఇంజీనిరింగ్‌లో వివేకానందకు జిల్లా మొదటి ర్యాంకు
- అగ్రికల్చర్‌లో వందనకు జిల్లా ప్రథమ స్థానం
- రాష్ట్ర స్థాయి ర్యాంకులు దక్కించుకున్న జిల్లా విద్యార్థులు
- ఇంటర్ మార్కుల వెయిటేజీతో ర్యాంకుల ప్రకటన
కర్నూలు(సిటీ): ఎంసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో బాలురు, బాలికలు సమానంగా రాణించారు. గత నెల 24, 25, 26 తేదీల్లో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు.. 28న అగ్రికల్చర్ అండ్ మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ 8,856 మంది విద్యార్థులు, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 4,655 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొట్టమొదటి సారిగా ఆన్‌లైన్ విధానంలో జిల్లాలోని 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇంటర్ మార్కులు 25 శాతం వెయిటేజ్ కింద తీసుకుని ఎంసెట్ ర్యాంకులను ప్రకటించారు. శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. జిల్లాలో ఇంజనీరింగ్ విభాగంలో పాసం డేగల వివేకానంద(ర్యాంకు 358–హాల్ టిక్కెట్ నం.5910851156) జిల్లా మొదటి ర్యాంకును సాధించారు. తొగర్చేటి రమా ప్రత్యూష(ర్యాంకు 361) జిల్లా రెండవ ర్యాంకు, టి.దేవకి భట్(ర్యాంకు 366) తృతీయ ర్యాంకు దక్కించుకున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో ఎస్.వందన (ర్యాంకు 140) జిల్లా మొదటి ర్యాంకు, షేక్ మసీరా తరణ్ణుం(ర్యాంకు 221) జిల్లా రెండవ ర్యాంకు, పి.వినూష (ర్యాంకు 248) తృతీయ ర్యాంకు సాధించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో ఇంజనీరింగ్‌లో బాలురు, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో బాలికలు రాణించారు.
జిల్లాకు చెందిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు
జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. డోన్‌కు చెందిన గోపన్నగారి సాయితరుణ్ రెడ్డి అనే విద్యార్థి కూడా విజయవాడలో చదువుతూ కృష్ణా జిల్లాలో పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో 31వ ర్యాంకు సాధించారు. కర్నూలు నగరానికి చెందిన ఎం.సుమయ్య మొహిషిన్ అనే విద్యార్థి విజయవాడలో చదువుతూ కృష్ణా జిల్లాలో పరీక్షలు రాసి రాష్ట్రస్థాయిలో 64వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.
జిల్లా టాప్–10 ర్యాంకులు ఇంజనీరింగ్‌లో...
పి.డి.వివేకానంద(జిల్లా ఫస్ట్ ర్యాంకు), తొగర్చేటి రమా ప్రత్యూష(జిల్లా రెండో ర్యాంకు), టి.దేవకి భట్ (జిల్లా మూడో ర్యాంకు), కంబాల కిరణ్‌కుమార్(జిల్లా నాలుగో ర్యాంకు), లగిశెట్టి వెంకట వైష్ణవ్(జిల్లా ఐదో ర్యాంకు), సి.సాయి దినేష్(జిల్లా ఆరో ర్యాంకు), సి.ఎం.అభిరామ్ రెడ్డి(జిల్లా ఏడో ర్యాంకు), కొండ ప్రణీత్‌రెడ్డి (జిల్లా ఎనిమిదో ర్యాంకు), ఎస్.రేవంత్ (జిల్లా తొమ్మిదో ర్యాంకు), ఐ.వి.నాగార్జునరెడ్డి (జిల్లా పదో ర్యాంకు).
మెడికల్ అండ్ అగ్రికల్చర్‌లో..
ఎస్.వందన(జిల్లా ఫస్ట్ ర్యాంకు), షేక్ మసీరా తరుణ్ణం(జిల్లా రెండో ర్యాంకు), పి.వినూష(జిల్లా మూడో ర్యాంకు), బి.పూజ(జిల్లా నాలుగో ర్యాంకు), జి.శ్రీనిజ(జిల్లా ఐదో ర్యాంకు), కె.రేవంత్ కుమార్ రెడ్డి(జిల్లా ఆరో ర్యాంకు), జి.భానుశ్రీ(జిల్లా ఏడో ర్యాంకు), బి.శిరీష(జిల్లా ఎనిమిదో ర్యాంకు), బి.వెంకటేష్(జిల్లా తొమ్మిదో ర్యాంకు), జి.భావన(జిల్లా పదో ర్యాంకు).