ఎంసెట్‌ దరఖాస్తులకు రేపు ఆఖరు | Tomorrow Late date EAMCET admissions | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌ దరఖాస్తులకు రేపు ఆఖరు

Published Fri, Apr 14 2017 1:29 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఎంసెట్‌ దరఖాస్తులకు రేపు ఆఖరు - Sakshi

ఎంసెట్‌ దరఖాస్తులకు రేపు ఆఖరు

ఇప్పటివరకు 2 లక్షలకు చేరిన దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌ దరఖాస్తుల గడువు ఈనెల 15వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. మే 12వ తేదీన నిర్వహించే పరీక్ష రాసేందుకు గురువారం రాత్రి వరకు మొత్తంగా 2,00,482 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్‌ కోసం 1,27,820 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ కోసం 70,102 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 ఇక రెండింటి కోసం 1,280 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్‌ అధికారులు తెలిపారు. ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు విద్యార్థులకు అధికారులు అవకాశం కల్పించారు. అలాగే 16 నుంచి విద్యార్థులు ఆలస్య రుసుము చెల్లించి ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునేలా చర్యలు చేపట్టారు.

ఆలస్య రుసుముతో దరఖాస్తుల షెడ్యూలు
ళీ 21–4–2017: రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. ళీ 27–4–2017: రూ.1,000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. ళీ 3–5–2017: రూ.5 వేల ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు. ళీ 1–5–2017నుంచి 9–5–2017 వరకు: వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌. ళీ 8–5–2017: రూ.10 వేల ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు.ళీ 12–5–2017: రాత పరీక్ష (ఇంజనీరింగ్‌ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్ష మధాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement