హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యాసంస్థల్లో ప్రవేశానికి గాను జేఈఈ మెయిన్ ర్యాంకులను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) గురువారం రాత్రి ప్రకటించింది. ఢిల్లీకి చెందిన దీపాన్షు జిందాల్ టాపర్‌గా నిలవగా ప్రత్యూష్ మైని 2, రాజేశ్ బన్సాల్ 3వ ర్యాంకులు సాధించారు. ఇక రాత పరీక్షలో దేశంలోనే అత్యధికంగా 345 మార్కులు సాధించిన తాళ్లూరి సాయితేజకు జేఈఈ మెయిన్‌లో 6వ ర్యాంకు లభించింది. ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆయనకు ఐదో ర్యాంకు రావడం తెలిసిందే. రాత పరీక్షలో 335 మార్కు లు సాధించిన గుంటూరుకు చెందిన ఎం.ప్రశాంత్‌రెడ్డికి 5వ ర్యాంకు వచ్చింది.
మొత్తం 22 ఐఐటీలు, ఒక ఐఎస్‌ఎం, 31 ఎన్‌ఐటీలు, 18 ఐఐఐటీలు, మరో 18 కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థ ల్లో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్న విషయం తెలిసిందే.
జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడి
Published Thu, Jun 23 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:13 AM
Advertisement