సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో శ్రీమేధకు ర్యాంకుల పంట
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సోమవారం విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ ప్రొఫెషనల్ కోర్స్ (సీఏ-ఐపీసీసీ) ఫలితాల్లో శ్రీమేధ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారని సంస్థ డెరైక్టర్ అన్నా నందకిషోర్ తెలిపారు. బ్రాడీపేట 6వ లైనులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో కమతం విజయలక్ష్మి 700 మార్కులకు గాను 463 మార్కులతో జాతీయస్థాయిలో 40వ ర్యాంకు కైవసం చేసుకుందని చెప్పారు.
మరో విద్యార్థి ఆర్.రఘునాథ్ 459 మార్కులతో 44వ ర్యాంకు సాధించారని వివరించారు. కొండా చందన 442, గునుపూరు శివసాయి 423, తుమ్మల సాయి భాస్కర్ 416, వల్లంరెడ్డి రమ్యారెడ్డి 410 మార్కులతో అత్యధిక ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఐపీసీసీలో తప్పిన విద్యార్థులకు ఈనెల 4 నుంచి సబ్జెక్టుల వారీగా కోచింగ్‌తో పాటు రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌తో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. 40వ ర్యాంకర్ కమతం విజయలక్ష్మి మాట్లాడుతూ ఐపీసీసీలో ర్యాంకు సాధించిన తన సోదరి వైష్ణవిని స్ఫూర్తిగా తీసుకుని సీఏ కోర్సును ఎంపిక చేసుకున్నానని వివరించారు.