Institute of Chartered Accountants of India
-
అంతర్జాతీయ దిగ్గజాలుగా దేశీ ఆడిటింగ్ సంస్థలు
న్యూఢిల్లీ: దేశం నుంచి అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థలను తీర్చిదిద్దేందుకు కేంద్ర సర్కారు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ)తో కలసి పనిచేస్తున్నట్టు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి మనోజ్ గోవిల్ వెల్లడించారు. అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థల అగ్రిగేషన్‌కు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. భారత్ నుంచి నాలుగు పెద్ద అకౌంటింగ్, ఆడిటింగ్ సంస్థలను తయారు చేయడమే లక్ష్యమని చెప్పారు. దేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ (కార్పొరేట్ పాలన)ను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బీమా రంగం, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్íÙప్ (ఎల్ఎల్పీలు)లకు అకౌంటింగ్ ప్రమాణాలు తీసుకు వచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే వీటిని తీసుకొస్తామన్నారు. బ్యాంక్‌లకు సంబంధించిన అకౌంటింగ్ ప్రమాణాల విషయంలో ఆర్బీఐతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు ఐసీఏఐ 75 వ్యవస్థాపక దినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ప్రకటించారు. ఎల్ఎల్పీలు, కంపెనీల చట్టం నిబంధనలను సమీక్షిస్తున్నట్టు, కంపెనీల స్వచ్ఛంద మూసివేత సమయాన్ని తగ్గించడమే తమ ధ్యేయమన్నారు. -
సీఏ పరీక్షలు ఇకపై ఏటా మూడుసార్లు
న్యూఢిల్లీ: ఏటా రెండుసార్లు జరిగే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ) పరీక్షలను ఇకపై ఏటా మూడు సార్లు జరపాలని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ఏటా మూడు సార్లు పరీక్షలు జరుగబోతున్నాయి. జనవరి, మే/జూన్, సెపె్టంబర్ నెలల్లో ఇవి జరుగుతాయి. -
భారత్‌లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ సీఏలను ప్రాక్టీస్‌కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్‌లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
టెక్నాలజీతో అకౌంటింగ్ వ్యవస్థల్లో పారదర్శకత
ముంబై: పారదర్శకమైన అకౌంటింగ్ వ్యవస్థల కోసం టెక్నాలజీలను అందిపుచ్చుకోవడం అవసరమని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శుక్రవారం మొదలైన 21వ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ సదస్సును ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. ఈ సదస్సును ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అకౌంటెంట్స్ (ఐఎఫ్‌సీఏ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆర్థిక సుస్థిరతకు, ప్రజలకు స్థిరమైన ఉపాధి, స్థిరమైన తయారీ, సేవలకు సైతం పారదర్శక అకౌంటింగ్ వ్యవస్థ అవసరాన్ని మంత్రి గుర్తు చేశారు. విశ్వాసం, నైతిక పరమైన అకౌంటింగ్ విధానాలు లేకుండా పారదర్శకత సాధ్యపడదన్నారు. వెబ్ 3.0 వంటి వినూన్న టెక్నాలజీలు ఇప్పటికే మన జీవితంలో భాగమయ్యాయంటూ, వ్యాపార నిర్వహణ విధానాన్ని సైతం ఎంతో మార్చేయగలవన్నారు. బ్లాక్‌చైన్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలైటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అన్నవి అకౌంటింగ్ విధానాలను మెరుగుపరచడమే కాకుండా.. టెక్నాలజీ, మెషిన్ ఆధారిత వేగవంతమైన నిర్ణయాలకు వీలు కల్పిస్తాయని చెప్పారు. కార్పొరేట్ గవర్నెన్స్‌లో మరింత పారదర్శకత అవసరాన్ని ప్రస్తావించారు. దీనికి మూలస్తంభం పారదర్శకమైన అకౌంటింగ్ అని గుర్తు చేశారు. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. దీన్ని నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తుంటారు. రెన్యువబుల్ ఎనర్జీపై పెట్టుబడులు పెంచాలి పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక పెట్టుబడుల బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. భారత్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం ఏఐఐబీ ప్రెసిడెంట్ జిన్ లికున్ మంత్రి సీతారామన్‌ను ఢిల్లీలో కలుసుకున్నారు. బ్యాంకుకు సంబంధించి పలు అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. భారత్‌లో ఏఐఐబీ పోర్ట్‌ఫోలియో విస్తరణ (మరిన్ని రుణాల మంజూరు)ను అభినందిస్తూ.. భారత్‌లో పెట్టుబడులు పెంచాలని ఆర్థిక మంత్రి సీతారామన్ కోరినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం వల్ల సంప్రదింపులకు వీలుంటుందని మంత్రి సూచించినట్టు తెలిపింది. ఏఐఐబీలో భారత్ 7.74 శాతం వాటాతో రెండో అతిపెద్ద ఓటింగ్ హక్కుదారుగా ఉంది. చైనాకు 29.9 శాతం వాటా ఉంది. ఏఐఐబీ బీజింగ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. -
దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు. ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. -
పల్లవి శరీరంపై గాయాలున్నాయి
సాక్షి, ముంబై : గత రాత్రి రైలు పట్టాలపై దొరికిన యువతి మృత దేహాన్ని ఎట్టకేలకు దక్షిణ ముంబై పోలీసులు గుర్తించారు. ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు నీలేశ్ వికమ్‌సే కూతురు పల్లవిగా తేల్చారు. 20 ఏళ్ల పల్లవి ఫోర్ట్ లోని ఓ లా సంస్థలో ఇంటర్న్‌షిఫ్ చేస్తోంది. అయితే ఈ నెల 4 నుంచి ఆమె కనిపించకుండా పోయిందంటూ కుటుంబ సభ్యులు ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పరేల్-కర్రీ రోడ్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై యువతి మృతదేహం పడి ఉందని ఓ ఆంగతకుడు పరేల్ స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించాడు. దీంతో ఆయన పోలీసులకు విషయం తెలియజేయగా.. యువతి మృతదేహాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతరం చనిపోయింది పల్లవేనని పోలీసులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఎప్పటిలాగే తన పనికి వెళ్లిన పల్లవి ఈ నెల 4న సాయంత్రం ఆరుగంటలకు సీఎస్ఎంటీ స్టేషన్లో రైలు ఎక్కిందని డీసీపీ సమాధాన్ పవార్ తెలిపారు. ఆ తర్వాతే ఆమె కనిపించకుండా పోయిందని ఆయన తెలిపారు. తొలుత తన చావుకు ఎవరూ కారణం కాదని ఆమె మొబైల్ నుంచి కుటుంబ సభ్యులకు సందేశం పెట్టడంతో ఆత్మహత్య చేసుకుందని భావించారు. అయితే, తలతోపాటు శరీరంపై తీవ్ర గాయాలుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఆమె ఎలా చనిపోయిందన్న అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పవార్ తెలిపారు. మరోవైపు కాల్ చేసి సమాచారం అందించిన అగంతకుడిని ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. -
పన్ను రేటు సహేతుకంగా ఉండాలి: జైట్లీ
పన్ను ఎగవేత మార్గాలను మూసేస్తున్నామని వెల్లడి న్యూఢిల్లీ: ఆదాయ పన్ను రేటును సహేతుక స్థాయిలో ఉంచడమే ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ), ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక శాఖలు సంయుక్తంగా శనివారం నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ మాట్లాడారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచుకునే విషయమై ఆయన మాట్లాడుతూ... రిటర్నులు దాఖలు చేసే వారిని ఆదాయపన్ను శాఖ విశ్వసించడం ప్రారంభించాలని సూచించారు. గత కొన్ని నెలల కాలంలో విధానాలు సులభతరం అయ్యాయని, ఐటీ శాఖ రిటర్నులు దాఖలు చేసే వారి పట్ల ఇంత స్నేహపూరితంగా వ్యవహరించడాన్ని ఎప్పుడూ చూసి ఉండరని అభిప్రాయపడ్డారు. విధానాలను సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు చర్యలను జైట్లీ ప్రస్తావించారు. ఎగవేత దారులపై కఠిన చర్యలు అదే సమయంలో పన్ను ఎగవేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జైట్లీ హెచ్చరించారు. తప్పించుకునే మార్గాలకు చెక్ పెడుతున్నట్టు తెలిపారు. హెచ్ఎస్బీసీలో అక్రమంగా ఖాతాలు కలిగి ఉన్నవారు విచారణ ఎదుర్కొంటున్నారని, పనామా పేపర్లలో ఉన్న వారు సైతం విచారణ ఎదుర్కొనక తప్పదన్నారు. మారిషస్‌తో ఉన్న ఒప్పందాన్ని సవరించామని, భారత్‌లో ఆర్జిస్తూ పన్ను ఎగ్గొట్టే అవకాశం ఇకపై ఉండబోదన్నారు. సైప్రస్‌తో ఉన్న ఒప్పందాన్ని కూడా సమీక్షించామని వచ్చే కొన్ని రోజుల్లో దీన్ని కేబినెట్ ఆమోదించనున్నట్టు వెల్లడించారు. సింగపూర్‌తో ఉన్న ద్వైపాక్షిక పన్ను ఒప్పందాన్ని సవరించే విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. దేశంలో పన్ను రేటు సహేతుక స్థాయిలో ఉండాలని, చెల్లింపుదారుల సంఖ్య భారీగా ఉండాలని, ఐటీ విభాగం పన్ను చెల్లింపు దారులను, రిటర్నులు దాఖలు చేసే వారిని విశ్వసించాలని జైట్లీ అన్నారు. తమ ఆదాయాన్ని దాచి పెట్టి ఉంచిన వారికి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం ఓ మంచి అవకాశంగా పేర్కొన్నారు. -
సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో శ్రీమేధకు ర్యాంకుల పంట
గుంటూరు ఎడ్యుకేషన్ : ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సోమవారం విడుదల చేసిన చార్టర్డ్ అకౌంటెంట్ ఇంటిగ్రేటెడ్ కాంపిటెన్సీ ప్రొఫెషనల్ కోర్స్ (సీఏ-ఐపీసీసీ) ఫలితాల్లో శ్రీమేధ సీఏ విద్యాసంస్థల విద్యార్థులు జాతీయస్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారని సంస్థ డెరైక్టర్ అన్నా నందకిషోర్ తెలిపారు. బ్రాడీపేట 6వ లైనులోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఏ-ఐపీసీసీ ఫలితాల్లో కమతం విజయలక్ష్మి 700 మార్కులకు గాను 463 మార్కులతో జాతీయస్థాయిలో 40వ ర్యాంకు కైవసం చేసుకుందని చెప్పారు. మరో విద్యార్థి ఆర్.రఘునాథ్ 459 మార్కులతో 44వ ర్యాంకు సాధించారని వివరించారు. కొండా చందన 442, గునుపూరు శివసాయి 423, తుమ్మల సాయి భాస్కర్ 416, వల్లంరెడ్డి రమ్యారెడ్డి 410 మార్కులతో అత్యధిక ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఐపీసీసీలో తప్పిన విద్యార్థులకు ఈనెల 4 నుంచి సబ్జెక్టుల వారీగా కోచింగ్‌తో పాటు రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్‌తో తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. 40వ ర్యాంకర్ కమతం విజయలక్ష్మి మాట్లాడుతూ ఐపీసీసీలో ర్యాంకు సాధించిన తన సోదరి వైష్ణవిని స్ఫూర్తిగా తీసుకుని సీఏ కోర్సును ఎంపిక చేసుకున్నానని వివరించారు. -
ఐసిఎఐ వైఎస్ ప్రెసిడెంట్ దేవరాజారెడ్డికి సన్మానం!
-
2016 నుంచి సీఏ కొత్త సిలబస్
ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు * అంతర్జాతీయ ప్రమాణాలతో కరికులమ్ * మహిళా సీఏల కోసం ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్.. * ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి టాస్క్‌ఫోర్స్.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మారుతున్న అకౌంటింగ్ నిబంధనలు, పన్ను చట్టాలకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్స్ సిలబస్‌ను రూపొందిస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ప్రకటించింది. 2016 కల్లా కొత్త కరికులమ్‌ను ప్రవేశపెడుతున్నామని, దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ కె.రఘు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త సిలబస్ ఉంటుందన్నారు. శనివారం ఐసీఏఐ ‘కంపెనీల చట్టం, ప్రత్యక్ష పన్నులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరైన రఘు విలేకరులతో మాట్లాడారు.అంతర్జాతీయంగా చార్టర్డ్ అకౌంటెంట్స్‌కి అధిక డిమాండ్ ఉందని, ఇక్కడ కోర్సు పూర్తి చేసిన వాళ్లకి విదేశాల్లో అధిక జీతాలకు ఉద్యోగాలు లభిస్తున్నయన్నారు. గతేడాది పరీక్ష రాసిన వాళ్లలో కేవలం ఏడు శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారంటే ఈ కోర్సు ఎంత కఠినమైనదో అర్థం చేసుకోవచ్చని, అందుకే ఇక్కడ ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రారంభ వేతనంగా ఏడు లక్షల నుంచి గరిష్టంగా రూ. 21 లక్షల వరకు పొందుతున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 20 కేంద్రాల్లో క్యాంపస్ నియామకాలు జరిపామని, బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఐటీ, ఈకామర్స్ రంగాల నుంచి డిమాండ్ బాగుందన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలను అందించే విధంగా క్లౌడ్ క్యాంపస్, 120 రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్ ప్రాక్టీసులో ఉన్న మహిళా సభ్యులు కుటుంబ బాధ్యతల వల్ల వృత్తికి దూరమవుతున్నారని, వీరు ఇంటి దగ్గర నుంచే సేవలను అందించే విధంగా ‘ఫ్లెక్సీ వర్కింగ్ పోర్టల్’ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 40,000 మంది మహిళా సీఏలు ఉండగా ఈ పోర్టల్ ఇప్పటి వరకు రెండు వేల మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే వీరి సేవలను ఉపయోగించుకోవడానికి 150 కంపెనీలు ముందుకొచ్చినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో కంపెనీల చట్టంలో సవరణలు కొత్త కంపెనీల చట్టంలో సీఏలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని నిబంధనలను మార్చడానికి కేంద్రం అంగీకరించిందని, దీనికి సంబంధించి వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో సవరణలు జరగొచ్చన్నారు. ముఖ్యంగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ 20కి మించి కంపెనీల్లో పనిచేయకూడదన్న నిబంధనలో ప్రైవేటు కంపెనీలకు మినహాయించడానికి ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే ఆడిట్ రొటేషన్, ఫ్రాడ్ రిపోర్టింగ్ నిబంధనలను కూడా సవరించడానికి అంగీకరించినట్లు తెలిపారు. వచ్చే బడ్జెట్లో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రీ బడ్జెట్ మెమొరాండం తుది దశలో ఉందని, ఈ నెలాఖరుకి కేంద్ర ఆర్థికమంత్రిని కలిసి ఇవ్వనున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీ కోసం టాస్క్ ఫోర్స్ కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి సూచనలు సలహాలను ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రఘు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, జనధన యోజన పథకాలకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. -
గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ
చండీగఢ్: చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీల ప్రారంభానికి భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు దేశ మొట్టమొదటి మహిళా బ్యాంక్ గురువారం తెలిపింది. తద్వారా 2015 మార్చి నాటికి బ్యాంక్ బ్రాంచీల సంఖ్యను 80కి చేర్చాలన్నది బీఎంబీ లక్ష్యంగా ఉంది. ‘‘మహిళా బ్యాంక్ తన బ్రాండ్‌ను స్థిరపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక బ్రాంచ్ని తక్షణం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. తద్వారా దేశ వ్యాప్త విస్తరణను కోరుకుంటున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీలను ప్రారంభిస్తున్నాం. మార్చి 2015కల్లా కనీసం 80 బ్రాంచీల ఏర్పాటు మా లక్ష్యం’’ అని సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఇక్కడ బ్యాంక్ 10వ బ్రాంచ్ని ప్రారంభించారు. భారతీయ మహిళా బ్యాంక్‌ను రూ.1,000 కోట్ల తొలి మూలధనంతో ఏర్పాటు చేశారు. 2020 నాటికి రూ.60,000 కోట్ల వ్యాపార పరిమాణం దీని లక్ష్యం. మంచి ఆలోచనలతో వస్తే...: మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే మహిళలకు రాయితీపై రుణాలను అందించడానికి బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు సీఎండీ వివరించారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రుణ పథకాలను బ్యాంక్ రూపొందించినట్లు కూడా ఆమె తెలిపారు. హామీ రహిత రుణాలను మహిళలకు ఇవ్వడానికి కూడా తమ బ్యాంక్ సిద్ధంగా ఉంటుందని పేర్కొంటూ... అయితే వారు ఇందుకు మంచి వ్యాపార ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంటుందని వివరించారు. మహిళాభివృద్ధే ధ్యేయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వంటి వృత్తివిద్యా సంస్థలతో సైతం అవగాహన కుదుర్చుకుని మహిళాభివృద్ధికి బ్యాంక్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాల్లో విద్యా రుణాలను ఇవ్వడం, ప్రాక్టీస్ ప్రారంభానికి తోడ్పాటుగా ఒకశాతం వడ్డీ రాయితీతో రుణాలను అందించడం లక్ష్యంగా ఈ దిశలో ముందుకు కదులుతున్నట్లు తెలిపారు. మహిళలకు సొంత కారు’ లక్ష్యంగా... మహిళల అభ్యున్నతి దిశలో మోటార్ కంపెనీలతోనూ ఒప్పందాలను కుదుర్చుకోడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు ఉషా అనంతసుబ్రమణ్యన్ వెల్లడించారు. మహిళలకు సొంత కారు లక్ష్యంగా షోరూమ్ ధరలో 90 శాతం రుణం వారు పొందేలా చర్యలు తీసుకోవడం ఈ అవగాహన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలిపారు.