యువమైత్రికి ఆహ్వానం!
అదో మల్టీనేషనల్ కంపెనీ. కంపెనీ డెరైక్టర్, జనరల్ మేనేజర్ వంటి పెద్దవాళ్లు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వారి ఎదురుగా ఉన్న రాజేశ్ ఎందుకో ఇంటర్వ్యూ చేస్తున్న వారి వైపు సూటిగా చూడలేకపోతున్నాడు. చాలా నెర్వస్‌గా ఉన్నాడు. ఎట్టకేలకు ఇంటర్వ్యూ పూర్తయిందనిపించి బయటకొచ్చాడు. ఎందుకిలా అయిందనే ప్రశ్న మెదడును తొలిచేస్తోంది. ఇంతవరకు ఒక్కచోట కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఇంటికి వస్తూనే మనిషి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. ఇంట్లో వారు ఏది అడిగే ప్రయత్నం చేసినా చిరాకు పడుతున్నాడు. తనకు ఉద్యోగం రాలేదనే బాధతో కుమిలిపోతున్నాడు. అతడి తల్లి సుధకు ఏమీ అర్థం కాలేదు. ఒక్కొక్కటిగా రాజేశ్ చిన్నప్పటి సంఘటనలు కళ్ల ముందు తిరగసాగాయి.
రాజేశ్ ఎల్‌కేజీ నుంచి బిటెక్ వరకు క్లాసు టాపరే. స్కూల్లో, కాలేజీలో టీచర్లు అతడిని ఇష్టపడేవారు. ఇలాంటి పిల్లాడికి ఉద్యోగం రాకపోవడమేంటని ఆలోచిస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియని అయోమయం.
ఇది ఒక్క రాజేశ్ ఇంట్లోనే కాదు. రాష్ట్రంలో అనేక కుటుంబాల్లో ఇదే పరిస్థితి. నేటి ప్రపంచంలో ఎంత చక్కగా చదివి మంచి మార్కులతో పాసయినా... ఆ విషయాన్ని తమకు తామే ప్రజెంట్ చేసుకోవాలి. ఉద్యోగం కోసం జరిగే ఇంటర్వ్యూలో అభ్యర్థులు... ఎదుటివారు ఇంప్రెస్ అయ్యేలా తమను తాము చక్కగా ఆవిష్కరించుకోవాలి. రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుంచి వచ్చిన యువత చాలా మంది మంచి మార్కులతో ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. కానీ తమను తాము ప్రెజెంట్ చేసుకోవడం తెలియక మంచి మంచి ఉద్యోగాలను అందిపుచ్చుకోలేక పోతూ, తీవ్రనిరాశకు లోనవుతున్న ఇలా ఎందరినో చూసిన తర్వాత వీరందరికీ ఏదో చేయాలని ఆలోచించింది సాక్షి. యువత కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నంలో కొంత గ్యాప్ ఏర్పడుతుంది. ఆ ఖాళీని పూర్తి చేసి యువత భవిష్యత్తు కోసం చక్కటి బాట వేయడానికి పూనుకుంది. ఆ ప్రయత్నమే యువమైత్రి కార్యక్రమం.
సాక్షి మీడియా సంస్థ మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారికి వినోదం, విజ్ఞానంతోపాటు నిపుణుల చేత వారికి అవసరమైన సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. ఇప్పుడు ఈ చైతన్యవంతమైన కార్యక్రమాలను యువత కోసం విస్తరిస్తోంది.
యువమైత్రి ఏం చేస్తోందంటే..!
చదువుకుని పట్టా పుచ్చుకుని, ఉద్యోగాలను ఎలా అందిపుచ్చుకోవాలో తెలియక ఆందోళనలో ఉన్న యువతకు మేలు చేయాలన్నదే ఈ ప్రయత్నం.
ఇంటర్వ్యూలో... నేను ఇలా చదువుకున్నాను... ఇవన్నీ నేర్చుకున్నాను... నేను మీకు కావల్సిన ఫలానా పనులన్నీ చక్కగా చేయగలను... అని ధైర్యంగా చెప్పలేకపోతున్న వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాం. ఇందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో సూచనలు ఇప్పిస్తాం.
ఇంటర్వ్యూకి ఎలాంటి దుస్తులు వేసుకుని వెళ్లాలో మీకు చెప్పేవాళ్లు లేకపోతే ఆ బాధ్యత మేము తీసుకుంటాం. ఇలాంటి ఎన్నో విషయాలను మీకు నేర్పించడానికి ముందుకొచ్చింది మీ సాక్షి.
8 -25 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. రెండు గంటలపాటు జరిగే ఈ వర్క్‌షాప్‌లో పాల్గొని మిమ్మల్ని మీరు చక్కగా ఆవిష్కరించుకోవడం ఎలాగో నేర్చుకోండి. మీకు నచ్చిన మంచి ఉద్యోగాన్ని సాధించి భవిష్యత్తుకు బాటలు వేసుకోండి.
- సాక్షి యాజమాన్యం
యువమైత్రి సదస్సు
ఎప్పుడు : 20-5-2014
ఎక్కడ : సెమినార్ హాల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి
ఎన్ని గంటల నుంచి:
మధ్యాహ్నం 2 గం॥నుంచి (90 ని॥
సాక్షి యువమైత్రికి సలహాలిచ్చే నిపుణులు
డాక్టర్ జి. ఎల్. కె. దుర్గ
(ప్రిన్సిపాల్, ఆంధ్రమహిళాసభ కాలేజ్)
ఇలా రిజిస్టర్ చేసుకోవాలి :
96666-78130 నంబరుకు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి.
గమనిక : అదే రోజు ఉదయం... సాక్షి నిర్వహిస్తున్న మైత్రి మహిళ కార్యక్రమంలో భాగంగా మహిళలకు న్యాయసలహాలు, ఆరోగ్య సమస్యలపై అవగాహన కోసం సంబంధిత రంగాలకు చెందిన నిపుణులు కౌన్సెలింగ్ ఇస్తారు.
మైత్రి మహిళ కార్యక్రమంలో సూచనలిచ్చే నిపుణులు డాక్టర్ ప్రీతీరెడ్డి (గైనకాలజిస్టు), డాక్టర్ దమయంతి (పోషకాహార నిపుణులు), డాక్టర్ కిన్నెరామూర్తి (న్యాయసలహాలు)