
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో మన దేశం నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా.. బెంగళూరు 20, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ‘ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్’ స్థానిక మార్కెట్లో రియల్టీ ధరల ఆధారంగా ర్యాంక్‌లను కేటాయిస్తుంది. 2019 రెండో త్రైమాసికం నివేదిక ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో మొదటి స్థానంలో రష్యా రాజధాని మాస్కో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ గృహాల ధరలు 11.1 శాతం వృద్ధి చెందాయి. ‘‘మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్డబుల్, మధ్య స్థాయి గృహాల అభివృద్ధికే పరిమితమయ్యాయి. దీంతో లగ్జరీ ప్రాపర్టీలు సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి’’ అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment