సినీ ఇండస్ట్రీలో ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీల జాబితాను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ వెల్లడించింది. గత పదేళ్లుగా వారికి లభించిన క్రేజ్ ఆధారంగా ఈ లిస్ట్‌ను రూపొందించారు. అయితే ఈ లిస్ట్‌లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో షారుక్ ఖాన్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ నిలిచారు. టాప్ టెన్‌లో ఆందరూ బాలీవుడ్ తారలే నిలవడం విశేషం. దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న మొదటి 100 మంది సినీతారల జాబితాను ఐఎండీబీ ప్రకటించింది.
దక్షిణాది తారల విషయానికొస్తే ఈ జాబితాలో సమంత 13వ స్థానం దక్కించుకుంది. సౌత్ నుంచి టాప్ 15లోపు నిలిచిన స్టార్ సమంత కావడం విశేషం. ఆ తర్వాత తమన్నా 16, నయనతార 18 స్థానాల్లో నిలిచారు. టాలీవుడ్ హీరోల విషయానికొస్తే ప్రభాస్ 29, రామ్ చరణ్ 31, అల్లు అర్జున్ 47, జూనియర్ ఎన్టీఆర్ 67 స్థానాల్లో ఉన్నారు. టాప్ 100 మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్ పేరుతో 2014 నుంచి 2024 వరకు ఎక్కువ ప్రజాదరణ పొందిన తారల జాబితాను ఐఎండీబీ ఇవాళ విడుదల చేసింది. టాప్-100 సినీ తారల జాబితాలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఉన్నారు.
Presenting the Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb, globally! 📣✨
Do you spot your favourites?
The Top 100 Most Viewed Indian Stars of the Last Decade on IMDb list is based on the IMDb weekly rankings from January 2014 through April 2024. These… pic.twitter.com/4h8IEEwMAZ— IMDb India (@IMDb_in) May 29, 2024
Comments
Please login to add a commentAdd a comment