‘నీట్‌’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్‌! | NEET UG 2024: Number of toppers down in revised results | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ టాపర్లలోంచి మనోళ్లు ఔట్‌!

Published Sat, Jul 27 2024 5:05 AM | Last Updated on Sat, Jul 27 2024 5:05 AM

NEET UG 2024: Number of toppers down in revised results

రెండోసారి సవరించిన ఫలితాలతో తారుమారైన రాష్ట్ర విద్యార్థుల ర్యాంకులు 

రాష్ట్రం నుంచి తొలుత  47,371 మందికి అర్హత.. తాజాగా 47,356 మందికి.. 

జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కులు 164 నుంచి 162కు తగ్గుదల

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అర్హత, ప్రవేశపరీక్ష (నీట్‌–యూజీ 2024)కు సంబంధించి తాజాగా విడుదలైన రెండోసారి సవరించిన (రీరివైజ్డ్‌) ఫలితాలు తెలంగాణ విద్యార్థులకు కాస్త నిరాశ మిగిల్చాయి. తొలిసారి ఫలితాల్లో జాతీయ స్థాయిలో టాప్‌–100 ర్యాంకుల్లో నిలిచిన మన విద్యార్థులు.. తాజా ఫలితాల్లో మాత్రం ఆ జాబితాలోనే లేరు. గత ఫలితాల్లో జాతీయ స్థాయిలో 77వ ర్యాంకుతో రాష్ట్ర టాపర్‌గా నిలిచిన అనురాన్‌ ఘోష్‌ తాజా ఫలితాల్లో ఏకంగా 137వ ర్యాంకుకు పరిమితమయ్యాడు.

అలాగే ఎస్టీ కేటగిరీలో ఆలిండియా టాప్‌ ర్యాంకర్‌ తెలంగాణకు చెందిన గుగులోత్‌ వెంకట  నృపేష్‌ సవరించిన ఫలితాల్లోనూ టాపర్‌గానే ఉన్నారు. కానీ అతని జాతీయ ర్యాంకు అప్పుడు 167 ఉండగా తాజా ఫలితాల్లో 219కు పడిపోయింది. అలాగే ఎస్టీ జాతీయ రెండో ర్యాంకర్‌గా నిలిచిన లావుడ్య శ్రీరామ్‌ నాయక్‌ ఇప్పుడు నాలుగో ర్యాంకుకు పరిమితమయ్యాడు. నీట్‌–యూజీ ఎంట్రన్స్‌లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశంతో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుమారు 1,500 మందికి మళ్లీ ‘నీట్‌’నిర్వహించి సవరించిన ఫలితాలను కూడా ప్రకటించింది.

కానీ ఫిజిక్స్‌ విభాగంలో అడిగిన ఓ ప్రశ్నకు గతంలో రెండు ఆప్షన్లను సరైన సమాధానంగా పరిగణించిన ఎన్‌టీఏ ఆ మేరకు రెండు రకాల సమాధానాలు ఇచ్చిన విద్యార్థులందరికీ ఐదు మార్కులు ఇచి్చంది. అయితే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు నియమిత నిపుణుల బృందం ఆ రెండింటిలో ఒక దాన్నే సరైన సమాధానంగా గుర్తించడంతో ఆ ప్రశ్నకు రెండో సమాధానాన్ని ఎంచుకున్న విద్యార్థులకు 5 మార్కుల కోత పెట్టింది. దీంతో విద్యార్థుల ర్యాంకుల్లో తేడా వచి్చంది. తెలంగాణ నుంచి మొదటిసారి విడుదల చేసిన ఫలితాల్లో 47,371 మంది అర్హత సాధించగా తాజాగా సవరించిన ఫలితాల్లో 47,356 మంది అర్హత సాధించారు. 

త్వరలో రాష్ట్రస్థాయి ర్యాంకులు... 
ఆలిండియా ర్యాంకులు ప్రకటించిన ఎన్‌టీఏ... త్వరలో రాష్ట్రాలవారీగా అభ్యర్థుల జాబితాను రూపొందించనుంది. ముందుగా ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం ఆలిండియా ర్యాంక్‌ ఆధారంగా మెరిట్‌ జాబితాను తయారు   చేయనుంది.  

తగ్గిన కటాఫ్‌ మార్కు...  
సవరించిన ఫలితాల్లో కటాఫ్‌ మార్కు తగ్గింది. జనరల్‌ కేటగిరీ/ఈడబ్ల్యూఎస్‌ కింద తొలిసారి ఫలితాల్లో కటాఫ్‌ 164గా ఉండగా ఇప్పుడు 162కు తగ్గింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్‌ పీహెచ్, ఎస్సీ అండ్‌ పీహెచ్‌ల అర్హత మార్కులు కూడా 129 నుంచి 127కు తగ్గాయి. అన్‌ రిజర్వ్‌డ్‌/ఈడబ్ల్యూఎస్‌ అండ్‌ పీహెచ్‌ల అర్హత మార్కు సైతం 146 నుంచి 144కు తగ్గింది. ఎస్టీ అండ్‌ పీహెచ్‌లోనూ 129 నుంచి 127కు తగ్గింది. గతేడాది రాష్ట్రంలో 459 మార్కులు వచ్చిన వారికి జనరల్‌ కేటగిరీలో కనీ్వనర్‌ కోటాలో సీటు రాగా ఈసారి 500 మార్కులు దాటిన వారికి కూడా కనీ్వనర్‌ కోటాలో సీటు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement