
అరగంటలోనే స్థిరాస్తిరిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి
సంతృప్తి వ్యక్తం చేస్తున్న దస్తావేజుదారులు
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్ విధానం అమలుతో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు ప్రక్రియ చకచకా కొనసాగుతోంది. స్థిరాస్తి దస్తావేజుల నమోదు కోసం క్రయ, విక్రయదారులు గంటల తరబడి వేచి చూడకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయి, మరో 15 నుంచి 20 నిమిషాల్లో చేతికి దస్తావేజులు అందుతున్నాయి. రిజి్రస్టేషన్ శాఖ సంస్కరణల్లో భాగంగా ప్రయోగాత్మకంగా మరో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలు సోమవారం ప్రారంభమైంది. హైదరాబాద్, హైదరాబాద్ సౌత్, రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ ఆఫీస్‌లతోపాటు ఫరూక్ నగర్, షాద్‌నగర్, మహేశ్వరం, వనస్ధలిపురం, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఘట్‌కేసర్, నారపల్లి, మల్కాజ్‌గిరి సబ్ రిజి్రస్టార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం ద్వారా సత్వరమే స్థిరాస్తి దస్తావేజుల రిజిస్ట్రేషన్లకు వెసులు బాటు కలిగినట్లయిది. ఇప్పటికే గత నెల రోజులుగా ఆజంపురా, చిక్కడపల్లి, మేడ్చల్ ఆర్వో, కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్ తదితర సబ్‌రిజి్రస్టార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలవుతోంది.
రోజువారీగా 48 నుంచి 144 స్లాట్లు..
గ్రేటర్ పరిధిలో ఎంపిక చేసిన సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో రోజువారీగా 48 చొప్పున స్లాట్లను అమలు చేస్తున్నారు. దస్తావేజుల తాకిడి అధికంగా ఉండే ఆఫీసుల్లో మాత్రం 144 స్లాట్స్ వరకు అవకాశం కల్పిస్తున్నారు. దస్తావేజుదారులకు కేటాయించి స్లాట్ల సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రయత్నంస్తున్నారు. స్లాట్ బుక్ చేసుకోని అత్యవసర దస్తావేజుదారుల కోసం సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కేవలం ఐదు ‘వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను’ అనుమతిస్తున్నారు. నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో దస్తావేజులు స్వీకరించి నమోదు ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. సబ్ రిజి్రస్టేషన్ ఆఫీసుల్లో స్థిరాస్తి రిజి్రస్టేషన్ల కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం అర్ధగంటలోపు దస్తావేజుల ప్రక్రియ పూర్తి కావడం పట్ల స్థిరాస్తి క్రయవిక్రయదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి
కొత్తగా కొనుగోలు చేసిన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కోసం రెండురోజుల ముందు ఉప్పల్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్లాట్ బుకింగ్ చేసుకున్నా. కేవలం పది నిమిషాల్లోనే రిజి్రస్టేషన్ ప్రక్రియ పూర్తయింది. అరగంట వ్యవధిలోనే డాక్యుమెంటు తీసుకుని ఇంటికి వచ్చేశాం. నిజంగా ఈ విధానం చాలా బాగుంది. దీని వల్ల ఎక్కడా ఇబ్బంది పడలేదు సరికదా సమయం చాలా ఆదా అయింది. సో హ్యాపీ.
– సంతోష్ కుమార్ రెడ్డి, ఉప్పల్
చాలా ఈజీ అయింది
కాప్రా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్నాం. గతంలో రిజి్రస్టేషన్‌కు ఒక రోజంతా పట్టేది. తరువాత 2,3 రోజుల తర్వాత రిజి్రస్టేష¯న్ డాక్యుమెంట్లు చేతికి అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. రిజి్రస్టేష¯Œన్ 15 నిముషాల్లో పూర్తయింది. మరో 15 నిమిషాల్లో డాక్యుమెంట్లు సిద్ధం చేసి చేతికి అందించారు. రద్దీ లేకుండా ప్రశాంత వాతావరణంలో పని చాలా ఈజీగా పూర్తయింది.
– ఎ.శ్రీలత, కాప్రా