సాక్షి, న్యూఢిల్లీః 2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్‌ఆర్‌డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్–2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్‌మెంట్ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్ నల్సార్ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్ నైపర్ ఐదో స్థానంలో నిలిచింది. (అత్యధిక కేసులున్నా అదుపులోనే వైరస్!)
కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్(టీఎల్‌ఆర్), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్(ఆర్‌పీ), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్(జీవో), ఔట్‌రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్(పీఆర్) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్ ర్యాంకులు, ఇంజినీరింగ్ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్‌మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్)
టాప్–10 ఇండియా ర్యాంకులు (ఓవరాల్ కేటగిరీ)
ఇనిస్టిట్యూట్ పేరు | ర్యాంకు |
ఐఐటీ–మద్రాస్ | 1 |
ఐఐఎస్‌సీ–బెంగళూరు | 2 |
ఐఐటీ–ఢిల్లీ | 3 |
ఐఐటీ–బాంబే | 4 |
ఐఐటీ–ఖరగ్‌పూర్ | 5 |
ఐఐటీ–కాన్పూర్ | 6 |
ఐఐటీ–గౌహతి | 7 |
జేఎన్‌యూ–ఢిల్లీ | 8 |
ఐఐటీ–రూర్కీ | 9 |
బనారస్ హిందూ వర్శిటీ | 10 |
యూనివర్శిటీ కేటగిరీలో టాప్–10 ర్యాంకులు
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు | 1 |
జేఎన్‌యూ, న్యూఢిల్లీ | 2 |
బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి | 3 |
అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు | 4 |
జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా | 5 |
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ | 6 |
కలకత్తా యూనివర్శిటీ, కోల్‌కతా | 7 |
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ | 8 |
సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ, పూణే | 9 |
జామియామిలియాఇస్లామియా, న్యూఢిల్లీ | 10 |
ఇంజినీరింగ్ కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
ఐఐటీ–మద్రాస్ | 1 |
ఐఐటీ–ఢిల్లీ | 2 |
ఐఐటీ–బాంబే | 3 |
ఐఐటీ–కాన్పూర్ | 4 |
ఐఐటీ–ఖరగ్‌పూర్ | 5 |
ఐఐటీ–రూర్కీ | 6 |
ఐఐటీ–గౌహతి | 7 |
ఐఐటీ–హైదరాబాద్ | 8 |
ఐఐటీ–తిరుచిరాపల్లి | 9 |
ఐఐటీ–ఇండోర్ | 10 |
మేనేజ్‌మెంట్ కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
ఐఐఎం–అహ్మదాబాద్ | 1 |
ఐఐఎం–బెంగళూరు | 2 |
ఐఐఎం–కలకత్తా | 3 |
ఐఐఎం–లక్నో | 4 |
ఐఐటీ–ఖరగ్‌పూర్ | 5 |
ఐఐఎం–కోజికోడ్ | 6 |
ఐఐఎం–ఇండోర్ | 7 |
ఐఐటీ–ఢిల్లీ | 8 |
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ | 9 |
మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్(గురుగ్రామ్) | 10 |
కళాశాలల కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
మిరండా హౌజ్ | 1 |
లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ | 2 |
హిందూ కాలేజ్, ఢిల్లీ | 3 |
సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ | 4 |
ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై | 5 |
లయోలా కాలేజ్, చెన్నై | 6 |
సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా | 7 |
రామకృష్ణ మిషన్ విద్యామందిర, హౌరా | 8 |
హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ | 9 |
పీఎస్‌జీఆర్ కృష్ణమ్మల్ ఫర్ విమెన్, కోయంబత్తూర్ | 10 |
ఫార్మసీ కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
జామియా హమ్‌దర్ద్, న్యూఢిల్లీ | 1 |
పంజాబ్ యూనివర్శిటీ, చంఢీగఢ్ | 2 |
నైపర్, మోహలీ | 3 |
ఐసీటీ, ముంబై | 4 |
నైపర్, హైదరాబాద్ | 5 |
బిట్స్, పిలానీ | 6 |
మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మా సైన్సైస్, ఉడిపి | 7 |
నైపర్, అహ్మదాబాద్ | 8 |
జేఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ | 9 |
జేఎస్‌ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ | 10 |
మెడికల్ కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
ఎయిమ్స్, న్యూఢిల్లీ | 1 |
పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్ | 2 |
క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్ | 3 |
ఆర్కిటెక్చర్ కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
ఐఐటీ, ఖరగ్‌పూర్ | 1 |
ఐఐటీ, రూర్కీ | 2 |
ఎన్‌ఐటీ, కాలికట్ | 3 |
న్యాయ విద్య కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
నేషనల్ లా స్కూల్, బెంగళూరు | 1 |
నేషనల్ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ | 2 |
నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ | 3 |
దంత విద్య కేటగిరీ
ఇనిస్టిట్యూట్ | ర్యాంకు |
మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ | 1 |
మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి | 2 |
డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠం, పూణే | 3 |
Comments
Please login to add a commentAdd a comment