Ministry of Human Resource Development (HRD)
-
స్కూళ్లు ఎప్పటినుంచి ప్రారంభిద్దాం?
సాక్షి, హైదరాబాద్ : పాఠశాలలను ఎప్పటినుంచి ప్రారంభించాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారో రాష్ట్రాల వారీగా అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) అన్ని రాష్ట్రాల విద్యాశాఖ లను కోరింది. ఈ మేరకు ఎంహెచ్ఆర్డీ అండర్ సెక్రటరీ రాజేశ్ సాంప్లే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. స్కూళ్లను ఆగస్టు/సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో ఏ నెలలో ప్రారంభిస్తే బాగుంటుందో తెలియజేయాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారో కూడా తెలపాలని, ఇతరత్రా అంశాలు ఏమైనా ఉంటే కూడా ఈనెల 20లోగా చెప్పాలని సూచించారు. ఆ వివరాలను తమ మెయిల్ ఐడీకి (coordinationeel @gmail.com లేదా rsamplay. edu@nic.in) పంపించాలని వెల్లడించారు. అయితే ఈనెల 15న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో స్కూల్ సేఫ్టీ ప్లాన్‌పై ఎంహెచ్ఆర్డీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. అందులో పాఠశాలల ప్రారంభంపై కూడా అభిప్రాయాలను తీసుకుంది. అయితే ఆ తరువాత మూడు రోజులకే మళ్లీ అభిప్రాయాలను తెలియజేయాలంటూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యాశాఖ కార్యదర్శులకు ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈనెల 15న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల ప్రారంభ తేదీలను ఇంకా నిర్ణయించలేదని 17 రాష్ట్రాలు వెల్లడించాయి. అందులో అండమాన్ నికోబార్, ఛత్తీస్‌గఢ్, డయ్యూ డామన్, గోవా, గుజరాత్, లక్షద్వీప్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, ఒడిషా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఉన్నా యి. ఐదు రాష్ట్రాలు మాత్రం కేంద్రం జారీ చేసే ఆదేశాల మేరకు ప్రారంభిస్తామని వెల్లడించాయి. అందులో హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, త్రిపుర రాష్ట్రాలు ఉన్నా యి. ఇక మరో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తేదీలను, నెలలను నిర్ణయించినట్లు వెల్లడించాయి. అందులో సెప్టెంబర్ 5న స్కూళ్ల ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్, ఆగస్టు తరువాత ప్రారంభిస్తామని అరుణాచల్ ప్రదేశ్ వెల్లడించాయి. అస్సాం (జూలై 31న), బిహార్ (ఆగ స్టు 15న), చండీగఢ్ (ఆగస్టు 15 తరువాత), ఢిల్లీ (ఆగస్టులో), హరియాణా (ఆగస్టు 15), కర్ణాటక (సెప్టెంబర్ 1 తరువాత), కేరళ, లఢక్ (ఆగస్టు 31 తరువాత), మణిపూర్ (సెప్టెంబర్ 1న), నాగాలాండ్ (సెప్టెంబర్ మొదటివారం), పాండి చ్చేరి (జూలై 31 తరువాత), రాజస్తాన్ సెప్టెంబ ర్లో స్కూళ్లను ప్రారంభిస్తామని వెల్లడించాయి. -
విద్యలో ఉన్నతశ్రేణికి ఎలా?
మన ఉన్నత విద్యాసంస్థల బోధనా ప్రమాణాలెలా వున్నాయో, విద్యార్థులు తమ జ్ఞాన తృష్ణను తీర్చుకోవడానికి, తమ ప్రతిభాపాటవాలను మెరుగుపరచుకునేందుకు అవి ఎలా దోహదపడుతున్నాయో, పరిశోధనలకు ఆ విద్యాసంస్థలిచ్చే ప్రాధాన్యతలేమిటో తెలుసుకోవడానికి ఏటా ఆ సంస్థలు పొందే ర్యాంకులే ప్రమాణం. వాటి ఆధారంగానే విద్యార్థులు తమ తదుపరి గమ్యస్థానమేదో నిర్ణయించుకుంటారు. ఆ ఉన్నత విద్యాసంస్థలు సైతం తమను తాము సమీక్షించుకోవడానికి, లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి, మెరుగుపడటానికి ఈ జాబితా దోహదపడుతుంది. గురువారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ర్యాంకుల జాబితాను ప్రకటించడంలో వున్న పరమార్థం ఇదే. ఎప్పటిలాగే ఐఐటీలు ముందు వరసలో వున్నాయి. తొలి పది ర్యాంకుల్లో ఏడు ఆ సంస్థలవే. అత్యున్నత శ్రేణి విద్యాసంస్థగా మద్రాసు ఐఐటీ నిలిచింది. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) ద్వితీయ స్థానంలో వుంది. గత అయిదారేళ్లుగా ఆందోళనలతో హోరెత్తుతూ, మొన్న జనవరిలో చానెళ్ల సాక్షిగా గూండాల దాడులతో తల్లడిల్లిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) సైతం గతంలోవలే చదువుల్లో మెరిసింది. అది ఓవరాల్ కేటగిరిలో 8వ స్థానంలో, యూనివర్సిటీల కేటగిరీలో రెండో స్థానంలో వుంది. దేశవ్యాప్తంగా రగిలిన ఎన్నార్సీ, సీఏఏ వ్యతిరేక ఉద్యమాల తర్వాత ప్రముఖంగా వార్తల్లో నిలిచిన ఢిల్లీలోని జమియా మిలియా గత మూడేళ్లుగా వస్తున్న 12వ ర్యాంకు నుంచి ముందుకు కదిలి 10వ ర్యాంకులో నిలిచి ఔరా అనిపించుకుంది. వాస్తవానికి ఆ సంస్థ 2016నాటికి 83వ ర్యాంకులో వుండేదని గుర్తుంచుకుంటే... అక్కడి అధ్యాపకశ్రేణి దీక్షాదక్షతలు అర్ధమవుతాయి. విశ్వవిద్యాలయాల కేటగిరీలో హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరో ర్యాంకులోవుంటే, ఇంజనీరింగ్ కేటగిరిలో హైదరాబాద్ ఐఐటీ ఎనిమిదో స్థానంలో వుంది. న్యాయ విశ్వవిద్యాలయాల్లో హైదరాబాద్ నల్సార్ది మూడో ర్యాంకు. ఒకప్పుడు మన పురాతన విద్యాకేంద్రాలు నలంద, తక్షశిల ప్రపంచానికి విజ్ఞాన కాంతులు వెదజల్లాయి. ఆ విశ్వవిద్యాలయాల్లో విద్వత్తును గడించడానికి పొరుగునున్న చైనా మొదలుకొని దూరతీరాల్లోని గ్రీస్ వరకూ ఎన్నో దేశాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. అయితే అలాంటి ఘనత క్రమేపీ కొడిగట్టడం మొదలైంది. ఏటా అంతర్జాతీయ స్థాయిలో వివిధ సంస్థలు ప్రకటించే ర్యాంకుల్లో మన ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు ఎక్కడో వుంటున్నాయి. జాతీయ స్థాయిలో మెరిసే విద్యాసంస్థలు కూడా అంతర్జాతీయ పోటీలో చివరాఖరికి పోతున్నాయి. మూడు రోజుల క్రితం ప్రకటించిన క్యూఎస్ 2021 ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకుల్లో మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల తీరు ఆశాజనకం అనిపించదు. తొలి వంద విశ్వవిద్యాలయాల్లో మన దేశానికి చెందిన సంస్థ పేరు ఒక్కటీ లేదు. తొలి 200 ర్యాంకుల్లో మాత్రం బొంబాయి, ఢిల్లీ ఐఐటీలు, బెంగళూరు ఐఐఎస్సీ వున్నాయి. బొంబాయి ఐఐటీ 172(నిరుడు 152), ఢిల్లీ ఐఐటీ 193(నిరుడు 182), ఐఐఎస్సీ 185(నిరుడు 184) స్థానాల్లో వున్నాయి. ఈసారి మన దేశంలోని ఐఐటీల్లో మొదటి స్థానం పొందిన మద్రాసు ఐఐటీ క్యూఎస్‌లో 275వ స్థానంలో వుంది. మన విద్యాసంస్థలన్నీ గత జాబితాతో పోలిస్తే బాగా వెనకబడివున్నాయి. నిరుడు ప్రకటించిన జాబితాలోని 1,000 విద్యాసంస్థల్లో భారత సంస్థలు 25 వుండగా, ఈసారి అవి 21కే పరిమితమయ్యాయి. క్యూఎస్ ర్యాంకుల్ని విశ్వసించవద్దన్న ఢిల్లీ ఐఐటీ డైరెక్టర్ రాంగోపాల్‌రావు ప్రకటన సరైందే కావొచ్చు. ర్యాంకుల నిర్ణయానికి అంతర్జాతీయ సంస్థలు తీసుకునే కొలమానాలు సరైనవి కాకపోవచ్చు. కానీ మెరుగైన స్థాయి ర్యాంకులు రాకపోవడం, ఉన్న స్థితినుంచి మరింత కిందికి దిగజారడం అందరిలో అసంతృప్తి కలిగిస్తుందన్నది వాస్తవం. రాంగోపాల్‌రావు చెబుతున్నదాన్నిబట్టి ఈ ర్యాంకుల కోసం అధ్యాపకశ్రేణిలో, విద్యార్థుల్లో విదేశీయులెంత అనే అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. బోధన, పరిశోధన తదితర అంశాల్లో కూడా తమ ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే ఆమేరకు పాయింట్లు తగ్గిస్తారు. క్యూఎస్ తరహాలోనే టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్(టీహెచ్ఈ), షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ తదితరాలు ప్రపంచశ్రేణి విద్యాసంస్థల జాబితాలను ప్రకటిస్తుంటాయి. దాదాపు అన్నిటా మనం తీసికట్టే. మన విద్యాసంస్థలకు ప్రపంచశ్రేణి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా రెండేళ్లక్రితం మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి నేతృత్వంలో 13మందితో సాధికార నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ పబ్లిక్ రంగంలో పది, ప్రైవేటు రంగంలో పది ఉన్నత విద్యాసంస్థలను ఎంపిక చేస్తుందని, ఆ జాబితాలో చోటు లభించిన సంస్థలకు ఏటా రూ. 1,000 కోట్ల చొప్పున సమకూరుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాబితాలో నిరుడు మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, ఢిల్లీ యూనివర్సిటీ, బెనారస్ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వున్నాయి. ఆ కార్యక్రమం అనుకున్నట్టే సాగుతున్నదో లేదో తెలియదుగానీ, అంతర్జాతీయ ర్యాంకుల్లో మన స్థితి మెరుగుపడటం మాట అటుంచి, మరింత కిందకు పోతోంది. ఘనతర విద్యాసంస్థలుగా మనం ప్రకటించుకున్నందుకైనా అవి అంతర్జాతీయంగా మెరుగైన తీరును ప్రదర్శిస్తే దేశంలోని ఇతర సంస్థలకు స్ఫూర్తిదాయకమవుతాయి. మార్గదర్శకంగా నిలుస్తాయి. అంతర్జాతీయ ర్యాంకులు, వాటి విశ్వసనీయత సంగతలావుంచి మన విద్యాసంస్థలు బోధనలో, పరిశోధనలో మరింత పదునెక్కాల్సిన అవసరం వుంది. ఆ సంస్థలకు తగిన వనరులను కల్పించని ప్రభుత్వాల వైఖరి మారితేనే ఇవి మెరుగుపడతాయన్నది కూడా అందరికీ తెలుసు. ర్యాంకులు వెల్లడైనప్పుడల్లా ఆయా విద్యాసంస్థలు మాత్రమే కాదు...పాలకులు సైతం తమ విధానాలు సమీక్షించుకోవాలి. సవరించుకోవాలి. అప్పుడు మాత్రమే విద్యారంగంలో గత వైభవం సాధ్యమవుతుంది. -
తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు ర్యాంకులు ఇలా..
సాక్షి, న్యూఢిల్లీః కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఉన్నత విద్యా సంస్థల ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు విద్యా సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఓవరాల్ కేటగిరీ ర్యాంకుల్లో(100లోపు) ఏడు విద్యా సంస్థలు, యూనివర్శిటీ కేటగిరీలో ఓవరాల్ కేటగిరీ ర్యాంకుల్లో వందలోపు ర్యాంకుల్లో 9 సంస్థలు నిలిచాయి. ఇంజినీరింగ్ కేటగిరీలో 200 ర్యాంకులు ప్రకటించగా.. 25 విద్యా సంస్థలు తెలుగు రాష్ట్రాలవే కావడం విశేషం. మేనేజ్మెంట్ కేటగిరీలో నాలుగు, ఫార్మసీ విద్యాసంస్థల కేటగిరీలో ఏడు చోటు సంపాదించుకోగా.. కళాశాలల కేటగిరీలో వందలోపు కేవలం రెండు కళాశాలలే చోటు దక్కించుకున్నాయి. వైద్య కళాశాలల కేటగిరీలో, న్యాయవిద్య, ఆర్కిటెక్చర్, దంత వైద్య విద్య కేటగిరీల్లో ఒక్కో కళాశాల చొప్పున ర్యాంకు దక్కించుకున్నాయి. ఓవరాల్ కేటగిరీ ర్యాంకులు ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 59.92 15 ఐఐటీ–హైదరాబాద్ 59.59 17 ఆంధ్రా యూనివర్శిటీ 51.24 36 ఎన్ఐటీ వరంగల్ 49.82 46 ఉస్మానియా యూనివర్శిటీ 48.54 53 ఎస్వీయూ 46.14 68 కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ 45.89 70 యూనివర్శిటీ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 61.70 6 ఆంధ్రా యూనివర్శిటీ 53.82 19 ఉస్మానియా యూనివర్శిటీ 51.15 29 ఎస్వీయూ 48.84 38 కోనేరు లక్ష్మయ్య యూనివర్శిటీ 48.73 41 గాంధీ ఇని. ఆఫ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ 42.79 71 శ్రీసత్యసాయి ఇని. ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42.08 75 ఐఐఐటీ, హైదరాబాద్ 41.69 78 విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్, రీసెర్చ్ 39.71 100 ఇంజినీరింగ్ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఐఐటీ–హైదరాబాద్ 66.44 8 ఎన్ఐటీ–వరంగల్ 57.76 19 ఐఐఐటీ–హైదరాబాద్ 49.45 43 జేఎన్టీయూ–హైదరాబాద్ 44.97 57 కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 44.70 58 కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(ఏ), విశాఖపట్నం 41.36 69 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ 38.43 88 యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజి, కాకినాడ 37.77 97 విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్, రీసెర్చ్ 36.28 118 సీబీఐటీ, హైదరాబాద్ 35.32 124 వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి 34.99 127 సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 33.87 141 వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ 33.75 143 ఎస్వీయూ 33.29 153 వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ 33.13 156 ఎస్ఆర్ ఇంజినీరింగ్, వరంగల్లు 32.95 160 ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ 32.26 170 గోకరాజు రంగరాజు, హైదరాబాద్ 32.24 172 అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ 31.74 180 శ్రీవిద్యానికేతన్ ఇంజినీరింగ్ 31.54 184 జేఎన్టీయూఏ, అనంతపురం 31.52 185 వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్ 31.46 187 గాయత్రీ విద్యాపరిషత్, విశాఖ 31.38 188 జి.పుల్లారెడ్డి, కర్నూలు 31.35 190 బీవీఆర్ఐటీ 31.10 199 మేనేజ్మెంట్ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఇక్ఫాయ్ ఫౌండేషన్, హైదరాబాద్ 5 5.21 25 ఇనిస్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్, శ్రీసిటీ 46.16 53 ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ 44.38 61 కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ 43.30 70 ఫార్మసీ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు నైపర్, హైదరాబాద్ 73.81 5 ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మా, విశాఖ 48.64 34 శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 44.52 42 చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మా, గుంటూరు 41.31 54 రాఘవేంద్ర ఇని. ఆఫ్ ఫార్మా, అనంతపురం 41.14 55 ఆచార్య నాగార్జున వర్శిటీ కాలేజ్ 38.73 64 ఎస్వీ కాలే జ్ ఆఫ్ ఫార్మసీ, చిత్తూరు 37.72 69 కళాశాలల కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఆంధ్ర లయోలా కాలేజ్, విజయవాడ 57.64 36 సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ విమెన్, హైదరాబాద్ 52.28 73 వైద్య కళాశాలల కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు శ్రీవెంకటేశ్వర ఇని. ఆఫ్ మెడికల్ సైన్సైస్, తిరుపతి 45.93 38 న్యాయ విద్య కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా 73.12 3 ఆర్కిటెక్చర్ కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కి, విజయవాడ 59.63 9 దంత వైద్య విద్య కేటగిరీలో ఇనిస్టిట్యూట్ స్కోర్ ర్యాంకు ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్‌సైన్సెస్, సికింద్రాబాద్ 55.13 23 చదవండి : ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1 -
ఐఐటీ–మద్రాస్ నెంబర్ 1
సాక్షి, న్యూఢిల్లీః 2020 సంవత్సరానికి గాను ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంహెచ్ఆర్డీ) ర్యాంకులను ప్రకటించింది. ఇండియా ర్యాంకింగ్స్–2020ను ఆ శాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ నిశాంక్ గురువారం ఇక్కడ విడుదల చేశారు. మొత్తం పది కేటగిరీల్లో ఈ ర్యాంకులను ప్రకటించారు. దేశంలో ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు ప్రకటించడం ఇది వరుసగా ఐదోసారి. కొత్తగా ఈసారి ర్యాంకుల కేటగిరీల్లో దంత వైద్య విభాగం కూడా చేర్చారు. ఓవరాల్‌గా, అలాగే ఇంజినీరింగ్ విభాగంలో ఐఐటీ–మద్రాస్ తొలి స్థానంలో నిలిచింది. ఈ కేటగిరీలో ఐఐటీ–హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం దక్కింది. యూనివర్శిటీల విభాగంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు తొలిస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. మేనేజ్మెంట్ కేటగిరీలో ఐఐఎం–అహ్మదాబద్, వైద్య విభాగంలో ఎయిమ్స్ తొలిస్థానంలో నిలిచాయి. కళాశాలల విభాగంలో మిరండా కాలే జ్ వరసగా మూడో ఏడాది తొలిస్థానంలో నిలిచింది. లా విభాగంలో హైదరాబాద్ నల్సార్ మూడో ర్యాంకు సాధించగా, ఫార్మసీ కేటగిరీలో హైదరాబాద్ నైపర్ ఐదో స్థానంలో నిలిచింది. (అత్యధిక కేసులున్నా అదుపులోనే వైరస్!) కార్యక్రమంలో కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ మాట్లాడుతూ ర్యాంకులు ప్రకటించడం వల్ల విద్యార్థులకు విద్యా సంస్థల ఎంపిక సులువవుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే ఉన్నత విద్యా సంస్థల మధ్య పోటీతత్వం పెరుగుతుందని వివరించారు. టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్(టీఎల్ఆర్), రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్(ఆర్పీ), గ్రాడ్యుయేషన్ ఔట్‌కమ్స్(జీవో), ఔట్రీచ్ అండ్ ఇంక్లూజివిటీ(ఓఐ), పర్సెప్షన్(పీఆర్) వంటి పారామీటర్ల ఆధారంగా మార్కులు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. మొత్తం 3771 విద్యా సంస్థలు ఓవరాల్ ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. అలాగే కేటగిరీ వారీగా కూడా ప్రతిపాదనలు పంపాయి. 294 విశ్వవిద్యాలయాలు, 1071 ఇంజినీరింగ్ ఇనిస్టిట్యూషన్స్, 630 మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషన్స్, 334 ఫార్మసీ ఇనిస్టిట్యూషన్స్, 97 న్యాయ విద్యా సంస్తలు, 118 వైద్య విద్య సంస్థలు, 48 ఆర్కిటెక్చర్ సంస్థలు, 1,659 డిగ్రీ కళాశాలలు ర్యాంకుల కోసం ప్రతిపాదనలు పంపాయి. 100 ఓవరాల్ ర్యాంకులు, ఇంజినీరింగ్ విభాగంలో 200 ర్యాంకులు, యూనివర్శిటీలు, కళాశాలల విభాగంలో 100 చొప్పున, మేనేజ్మెంట్, ఫార్మసీ విభాగాల్లో 75 చొప్పున, వైద్య విద్యలో 40 ర్యాంకులు, ఆర్కిటెక్చర్, న్యాయ విద్యలో 20 ర్యాంకులు, దంత వైద్య విద్యలో 30 ర్యాంకులు ప్రకటించారు. (అందుబాటు ధరలో కరోనా టెస్టింగ్ కిట్) టాప్–10 ఇండియా ర్యాంకులు (ఓవరాల్ కేటగిరీ) ఇనిస్టిట్యూట్ పేరు ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐఎస్సీ–బెంగళూరు 2 ఐఐటీ–ఢిల్లీ 3 ఐఐటీ–బాంబే 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–కాన్పూర్ 6 ఐఐటీ–గౌహతి 7 జేఎన్‌యూ–ఢిల్లీ 8 ఐఐటీ–రూర్కీ 9 బనారస్ హిందూ వర్శిటీ 10 యూనివర్శిటీ కేటగిరీలో టాప్–10 ర్యాంకులు ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్–బెంగళూరు 1 జేఎన్‌యూ, న్యూఢిల్లీ 2 బనారస్ హిందూ యూనివర్శిటీ, వారణాసి 3 అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు 4 జాదవ్‌పూర్ యూనివర్శిటీ, కోల్‌కతా 5 యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ 6 కలకత్తా యూనివర్శిటీ, కోల్‌కతా 7 మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్ 8 సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్శిటీ, పూణే 9 జామియామిలియాఇస్లామియా, న్యూఢిల్లీ 10 ఇంజినీరింగ్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ–మద్రాస్ 1 ఐఐటీ–ఢిల్లీ 2 ఐఐటీ–బాంబే 3 ఐఐటీ–కాన్పూర్ 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐటీ–రూర్కీ 6 ఐఐటీ–గౌహతి 7 ఐఐటీ–హైదరాబాద్ 8 ఐఐటీ–తిరుచిరాపల్లి 9 ఐఐటీ–ఇండోర్ 10 మేనేజ్మెంట్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐఎం–అహ్మదాబాద్ 1 ఐఐఎం–బెంగళూరు 2 ఐఐఎం–కలకత్తా 3 ఐఐఎం–లక్నో 4 ఐఐటీ–ఖరగ్‌పూర్ 5 ఐఐఎం–కోజికోడ్ 6 ఐఐఎం–ఇండోర్ 7 ఐఐటీ–ఢిల్లీ 8 ఎక్స్ఎల్ఆర్ఐ 9 మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్(గురుగ్రామ్) 10 కళాశాలల కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మిరండా హౌజ్ 1 లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ 2 హిందూ కాలేజ్, ఢిల్లీ 3 సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్, ఢిల్లీ 4 ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై 5 లయోలా కాలేజ్, చెన్నై 6 సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా 7 రామకృష్ణ మిషన్ విద్యామందిర, హౌరా 8 హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ 9 పీఎస్జీఆర్ కృష్ణమ్మల్ ఫర్ విమెన్, కోయంబత్తూర్ 10 ఫార్మసీ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు జామియా హమ్దర్ద్, న్యూఢిల్లీ 1 పంజాబ్ యూనివర్శిటీ, చంఢీగఢ్ 2 నైపర్, మోహలీ 3 ఐసీటీ, ముంబై 4 నైపర్, హైదరాబాద్ 5 బిట్స్, పిలానీ 6 మణిపాల్ కాలేజ్ ఆఫ్ ఫార్మా సైన్సైస్, ఉడిపి 7 నైపర్, అహ్మదాబాద్ 8 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఊటీ 9 జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మైసూర్ 10 మెడికల్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఎయిమ్స్, న్యూఢిల్లీ 1 పీజీఐఎంఈఆర్, చంఢీగఢ్ 2 క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్ 3 ఆర్కిటెక్చర్ కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు ఐఐటీ, ఖరగ్‌పూర్ 1 ఐఐటీ, రూర్కీ 2 ఎన్ఐటీ, కాలికట్ 3 న్యాయ విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు నేషనల్ లా స్కూల్, బెంగళూరు 1 నేషనల్ లా యూనివర్శిటీ, న్యూఢిల్లీ 2 నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా, హైదరాబాద్ 3 దంత విద్య కేటగిరీ ఇనిస్టిట్యూట్ ర్యాంకు మౌలానా ఆజాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ 1 మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి 2 డాక్టర్ డీవై పాటిల్ విద్యాపీఠం, పూణే 3 -
టాప్‌లో నిలిచిన ఐఐటీ మద్రాస్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ 2020 ఏడాదికి గాను నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు సంబంధించిన ర్యాంకులను వెల్లడించింది. ఈ జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీ మద్రాస్) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ట్విటర్లో వెబ్‌కాస్ట్ ద్వారా ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సంజయ్ ధోత్రే, ఏఐసీటీఐ చైర్మన్ అనిల్ సహస్రబుధే, యూజీసీ చైర్మన్ డీపీ సింగ్ పాల్గొన్నారు. (ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్ ) ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐఎస్సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానాన్నిదక్కించుకుంది. ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ నాలుగు, అయిదు, ఆరవ స్థానంలో ఉన్నాయి. ఏడవ స్థానంలో జేఎన్‌యూ, ఎమిమిదవ స్థానంలో న్యూఢిల్లీ, తొమ్మిదవ స్థానంలో ఐఐటీ గువాహటి, పదవ స్థానంలో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం వారణాసి నిలిచాయి. కాగా కాలేజీలకు, వర్సిటీలకు జాతీయ స్థాయిలో సొంత ర్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) పేరుతో 2016 నుంచి తొమ్మిది విభాగాల్లో ర్యాంకులను కేటాయిస్తోంది. (అద్భుతమైన ఎంఐ నోట్‌బుక్స్ లాంచ్) నేషనల్యూ ఇన్నిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 15 స్థానం, ఐఐటీ హైదరాబాద్ 17వ స్థానం,ఆంధ్రా యూనివర్సిటీ 36వ స్థానం ఎన్ఐటీ 46వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 53 స్థానం, కేఎల్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ 70 వ స్థానంలో ఉన్నాయి. -
ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే! కాలేజీలకు మాత్రం..
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా విజృంభిస్తన్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు ఇప్పట్లో తెరిచే అవకాశం లేనట్లు కనిపిస్తుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. శుక్రవారం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి..పరిస్థితి అదుపులోకి వచ్చాకే పాఠశాలలు పునఃప్రారంచాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైచెన్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించడం అలవాటు చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు నష్టపోకుండా సిలబస్‌ను పూర్తిచేసేలా ప్రణాళిక రూపోందించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. (లాక్డౌన్లో ఆన్లైన్ బోధన! ) యూజిసి మార్గదర్శకాల అనుగుణంగా సెప్టెంబర్ 1నుంచి విశ్వవిద్యాలయాల్లో తరగతులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు 82 వేలకు చేరువలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు ఇప్పుడే తెరవడం మంచిది కాదని భావిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పరిస్థితి సాధారణం అయ్యాకే 50 వాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా పాఠశాలలు ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 16 నుంచి దేశ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అన్ని రకాల పరీక్షలు రద్దుచేశారు. (ఫెయిలైన వారికి సీబీఎస్ఈ మరో చాన్స్ ) -
లాక్డౌన్లో ఆన్లైన్ బోధన!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో వచ్చే జూన్‌లో పాఠశాలలు ప్రారంభించడం అసాధ్యమని, అలాగని విద్యార్థులను ఖాళీగా ఉంచడం సరికాదని రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజ మాన్యాలు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ విద్యే ఉత్తమమైన ప్రత్యామ్నాయ మార్గమని అంటున్నాయి. అందుకే కొత్త విద్యా సంవత్సరం నష్టపోకుండా ఆన్లైన్ విద్యను తప్పనిసరి చేయాలని, తద్వారా జూన్‌లో అకడమిక్ ఇయర్‌ను ప్రారంభించవచ్చని వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌కు ఓ నివేదికను అందజేశాయి. మరోవైపు లాక్డౌన్ తర్వాత భౌతిక దూరం పాటించేలా షిఫ్ట్ పద్ధతిలో పాఠశాలలను నిర్వహించడం మేలని కేంద్ర మంత్రి వివరించినట్లు ఓ ప్రైవేటు విద్యా సంస్థ చైర్మన్ వెల్లడించారు. ఆ నివేదికలోని ప్రధానాంశాలు.. (చదవండి: వైరస్‌పై యుద్ధం.. ఇలా చేద్దాం) ఆన్లైన్ విద్యా బోధనతో ప్రయోజనాలు.. సాంకేతిక పరిజ్ఞానంపై కొంత అవగాహన కలిగిన వారు దీనిని అనుసరించడం సులభం. వినే అలవాటు ఎక్కువగా ఉన్న వారికి దీంతో ఉపయోగకరమే. టెక్నాలజీ ఫీచర్స్, యూట్యూబ్, పీపీటీ, ఆన్లైన్ బోధన, డిజిటల్ పాఠాలు, రికార్డ్ చేసిన టెలివిజన్, రేడియో పాఠాలను అందించవచ్చు. ఆన్లైన్ ఇంటరాక్షన్, ప్రశ్నలు అడగటం, సందేహాలను నివృత్తి చేయడం, పాఠ్యాంశాన్ని వివరించవచ్చు. అభ్యాసం, వర్క్షీట్లు, ప్రాజెక్ట్స్, హోంవర్క్ ఇవ్వొచ్చు. టెక్నాలజీ ద్వారా మొత్తం ప్రక్రియను వర్చువల్ క్లాస్‌రూమ్‌గా మార్చవచ్చు. ప్రతికూలతలేంటంటే.. టీచర్, విద్యార్థి మధ్య భావోద్వేగ, వ్యక్తిగత అనుసంధానం పోతుంది. అభ్యసన ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ సమస్యలు, ఇంటర్నెట్ సమస్యలు ఇబ్బందికరంగా మారవచ్చు. ఎక్కువ మంది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించినా ఇంటరాక్షన్ కొంత ఇబ్బందికరం కావచ్చు. అయినా అనుమతించాలి. ఆన్లైన్ విద్యలో కొన్ని ప్రతికూలతలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ బోధనకు సిద్ధంగా ఉన్న పాఠశాలలను జూన్ నుంచి తరగతులను నిర్వహించేందుకు అనుమతించాలి. ఇప్పటికే జాతీయ ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ), రాష్ట్ర ఉపాధ్యాయ విద్యా శిక్షణ మండలి (ఎస్జీఈఆర్టీ) ఆన్లైన్ కంటెంట్‌ను, డిజిటల్ పాఠాలను రూపొందించాయి. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు స్కూళ్లు వీటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇందుకు ప్రభుత్వం రంగంలో డీడీ జ్ఞాన్, డీడీ నేషనల్, డీడీ సప్తగిరి, డీడీ యాదగిరి, టీ–శాట్ వంటి టెలివిజన్ చానెళ్లు ఉన్నాయి. అయితే టీచర్లు ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాదు స్వచ్ఛందంగానే బోధించడం, నేర్చుకోవడం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే టీవీ చానెల్స్, లోకల్ కేబుల్ టీవీ చానెల్స్, మొబైల్స్, టాబ్స్ ద్వారా బోధన అందించవచ్చు. అలాగే పట్టణ ప్రాంతాల్లో మొబైల్స్, ట్యాబ్స్తోపాటు వర్చువల్ క్లాస్‌రూమ్స్, గూగుల్ మీట్, క్లాస్రూమ్, మైక్రోసాఫ్ట్ టీం, స్కైప్ వంటి యాప్‌ల ద్వారా, కంప్యూటర్, డెస్క్‌టాప్ ద్వారా కూడా బోధన నిర్వహించవచ్చు. ఆన్లైన్ బోధన కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరం.. సాంకేతిక వినియోగం, ఆన్లైన్లో పాఠాల బోధనపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. ఆన్లైన్లో బోధనకు అవసరమైన పాఠ్య ప్రణాళికలు సిద్ధం చేయాలి. డెమో సెషన్స్ నిర్వహించాలి. ఆన్లైన్ పాఠాలు, డిజిటల్ పాఠాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. వర్క్‌షీట్స్, అసెస్మెంట్ టూల్స్ సిద్ధం చేయాలి. ఆన్లైన్లో హోంవర్క్ ఇవ్వడం, వాటిని ఆన్లైన్లో పరిశీలించాలి. టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రుల నుంచి రోజువారీగా అభిప్రాయాన్ని తీసుకోవాలి. వీటిన్నింటిపై కనీసంగా జూలై 31వ వరకు సిద్ధం కావాలి. లాక్డౌన్ ఎత్తేశాక 50 శాతం పిల్లలతోనే.. లాక్డౌన్ ఎత్తేశాక భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. 50 శాతం పిల్లలతోనే పాఠశాలలను కొనసాగించాలి. అధ్యాపకులను కూడా అలాగే విభజించాలి. కరోనా విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకునేలా చర్యలు చేపట్టాలి. 50 ఎస్ఎఫ్టీ కలిగిన ప్రతి తరగతి గదిలో 20 మందికి మించకుండా చూడాలి. విద్యార్థులను రెండు సెక్షన్లుగా విభజించాలి. తరగతుల విభజన చేసి రెండు షిప్ట్‌లలో పాఠశాలను కొనసాగించాలి. ఈ క్రమంలో కొన్ని సమస్యలున్నా క్రమంగా వాటిని అధిగమించవచ్చు. లేదంటే మూడ్రోజులు తరగతి గదిలో బోధన, మూడ్రోజులు ఆన్లైన్ బోధన చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. చేపట్టాల్సిన భద్రతా చర్యలు.. పాఠశాలల్లో, రవాణా సమయంలో భౌతిక దూరం పాటించేలా చూడాలి. ప్రతి రెండు గంటలకోసారి పాఠశాల తరగతి గదులు, వాష్‌రూమ్‌లు, కారిడార్లు, ల్యాబ్‌లు, లైబ్రరీ, తలుపులు, కిటికీలను కెమికల్స్‌తో శానిటైజ్ చేయాలి. మాస్క్‌లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం, హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. మొబైల్ వైద్య సేవలను అందించాలి. తీవ్రమైన దగ్గు, తుమ్ములు లేదా జ్వరం వచ్చినప్పుడు తక్షణ పరీక్షల కోసం ఏర్పాట్లు చేయాలి. విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించాలి. పాఠశాలల్లో కోవిడ్ సూపర్వైజర్ను నియమించాలి. సర్టిఫైడ్ కౌన్సెలర్లను నియమించాలి. (చదవండి: స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్) -
దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదా వేయండి
న్యూఢిల్లీ: యూజీసీ–నెట్, సీఎస్ఐఆర్–నెట్, ఇగ్నో పీహెచ్డీ, ఎన్సీహెచ్ఎం జేఈఈ, జేఎన్‌యూ ప్రవేశ పరీక్ష, ఐసీఏఆర్ తదితర పరీక్షలకుగాను దరఖాస్తుల స్వీకరణ గడువును వాయిదావేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి(ఎన్టీఏ) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ గడువును మరో నెల రోజులపాటు వాయిదా వేయాలని పేర్కొంటూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సోమవారం ట్వీట్ చేశారు. (కరోనాకు 35,349 మంది బలి) చదవండి: కరోనాను మించిన భయం -
పాఠ‘శాలసిద్ధి’
జగదేవ్‌పూర్(గజ్వేల్): ప్రభుత్వ పాఠశాలైనా, ప్రైవేట్దైనా కావాల్సినవి వసతులు, వనరులు. ఈ విషయంలో తేడాలొస్తే ఇబ్బంది పడేది విద్యార్థులే. దేశ వ్యాప్తంగా పాఠశాలల్లో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల శాఖ ‘శాలసిద్ధి’ కార్యక్రమం చేపట్టింది. దేశంలోని అన్ని పీఎస్‌లు, యూపీఎస్‌లు, హైస్కూళ్ల సమగ్ర స్వరూపం క్షణాల్లో తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. త్వరలో దీన్ని ప్రైవేట్ పాఠశాలలకూ వర్తింపచేయాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పాఠశాలల సమగ్ర అభివృద్ధి పథకాన్నే ఆంగ్ల అక్షర క్రమంలో సంక్లిప్తంగా ‘శాలసిద్ధి’ అని పిలుస్తున్నారు. పథకంలో భాగంగా పాఠశాలల హెచ్ఎంలు శాలసిద్ధి ఆన్లైన్ పోర్టల్‌లో తొలుత యూపీఎస్‌లు, హైస్కూళ్ల సమగ్ర సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. ఇందుకోసం స్కూల్ యూడైస్ కోడ్ ప్రకారం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. శాలసిద్ధిలో వివరాలు అప్లోడ్ చేయడానికి ఇప్పటికే హెచ్ఎంలకు శిక్షణనిచ్చారు. ఇదే పనిలో హెచ్ఎంలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రాథమిక పాఠశాల సమాచారం కూడా అప్లోడ్ చేస్తున్నారు. నివేదికపై కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో వివరాలు పంపిన తర్వాత ఆ నివేదికలను జాతీయస్థాయిలో పరిశీలిస్తారు. వాస్తవాలపై ఆరా తీసేందుకు కేంద్ర బృందం ప్రత్యేక పరిశీలనకు వస్తుంది. పాఠశాలలో వనరుల వినియోగం ఒకేలా ఉండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం శాలసిద్ధి కార్యక్రమం చేపట్టింది. అన్ని రాష్ట్రాల్లోని పీఎస్, యూపీఎస్, హైస్కూళ్ల స్థితిగతులు, వనరులపై అంచనాకు వచ్చేందుకు ఈ వివరాల సేకరణ దోహదం చేస్తుంది. నిధుల మంజూరుకు సమాచారమే ప్రామాణికం శాలసిద్ధి ద్వారా ప్రతి పాఠశాల పూర్తి సమాచారం ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇక ఏ పాఠశాల సమాచారమైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. అప్పుడే వసతులు, వనరులు, సమస్యలు, అభివృద్ధికి ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుంది. భవిష్యత్‌లో పాఠశాలల అవసరాల మేరకు ప్రభుత్వం నిధుల మంజూరుకు ఈ సమాచారం దోహదపడుతుంది. – ఉదయ్‌భాస్కర్‌రెడ్డి, ఎంఈఓ -
విద్యార్థులను దండించొద్దు
ముంబై : పాఠశాలల్లో విద్యార్థులపై శారీరక, మానసిక దాడులను తీవ్రంగా పరిగణిస్తూ, టీచర్ల పైశాచిక చర్యలను అరికట్టేందుకు ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్(సీఐఎస్సీఈ) నడుం బిగించింది. ఇందులో భాగంగా తగిన సూచనలు, సలహాలను పాఠశాలల యాజమాన్యాలకు అందించింది. విద్యార్థులపై టీచర్ల అమానవీయ చర్యలను అరికట్టేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ) రూపొందించిన సూచనలను అమలు చేయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సూచింది. దండనతో దుష్ఫలితాలు ‘పెద్దవాళ్లు లేదా టీచర్లు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దండించడం మూలంగా వారి మృధుస్వభావం గాయ పడుతుంది. సమస్యకు పరిష్కారం దండన అనే భావన చిన్నతనంలోనే నాటుకుంటోంది. ఫలితంగా విద్యార్థులు దూకుడుగా వ్యవహరించడం, విధ్వంసక స్వభావాన్ని అలవర్చుకోవడంతోపాటు స్కూలు మానేయడం, స్కూలుకు దూరంగా ఉండడం, టీచర్లు అంటేనే వ్యతిరేతను ఏర్పరుచుకోవటం జరుగుతోంది. చిన్నతనంలోనే జీవితాన్ని అల్లకల్లోలం చేసుకొంటారు. ఇదంతా సమాజంపై దుష్ర్పభావాన్ని చూపిస్తోంది’ అని సీఐఎస్సీఈ పేర్కొంది. ‘అనుకూల ప్రభావం చూపే అంశాలు మాత్రమే విద్యార్థులకు బోధించాలి. జీవితంలో బతకడానికి, స్థిరంగా ఎదగడానికి ఏం కావాలి. ఎలాంటి విద్యాబుద్ధులు అవసరంమో గుర్తించి వాటిపై దృష్టి పెట్టాలి’ అని సూచించింది. హెచ్ఆర్డీ సూచనలు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది. విద్యార్థుల్లో సానుకూల దృక్పథం పెంపొందించేందుకు కృషి చేయాలని చెప్పింది. వివిధ స్థాయిల నుంచి వచ్చిన విద్యార్థులకు తగిన అవకాశాలను కల్పించాలి, మానసిక పరిపక్వతను పెంపొందించాలని పేర్కొంది. అదేవిధంగా చిన్నపిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని, వారితో సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి అధ్యయనం చేయాలి, అవసరాలను తెలుసుకొని సహకరించాలి. ఆ తర్వాత మాత్రమే శిక్ష గురించి ఆలోచించాలి అని చెప్పింది. ‘‘పాఠశాలలో ఏదైనా విద్యార్థికి సమస్య ఎదురైనప్పుడు టీచర్, యాజమాన్యం తొందరపడకూడదు. ఆ విషయంలోకి ఇతర విద్యార్థులను లాగడం మానుకోవాలి. తలిదండ్రులు పాల్గొనేలా చూడాలి. విద్యార్థి సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. లేకుంటే సమస్య తీవ్రమై విద్యార్థులు/ కుటుంబం, టీచర్/స్కూలు యాజమాన్యం/ విద్యార్థి కౌన్సిల్లో పరిష్కారాన్ని కనుగొనాలి’ అని సూచింది. తల్లిదండ్రుల సహాయం తప్పనిసరి : ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ కెన్నెత్ ఈ మేరకు నగరంలోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను దండించడం టీచర్లు మానుకోవాలని సూచిస్తూ ప్రిన్సిపాల్స్ నేతృత్వంలో మార్గదర్శకాలను రూపొందించాయి. సెయింట్ మేరీస్ స్కూల్(ఐసీఎస్ఈ) ప్రిన్సిపాల్ ఎఫ్ఆర్ కెన్నెత్ మిస్కై ్వటా మాట్లాడుతూ ‘‘ విద్యార్థుల చెడు ప్రవర్తన విషయంలో పాఠశాలలు ఎలా వ్యవహరించాలి, వారి నుంచి దేనిని వెలికితీయాలి అనే అంశంపై ఓ నిబంధనావళి ఉండాలి’’ అని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సహాయాన్ని తీసుకోవాలని చెప్పారు. వృత్తి నిపుణుల దృష్టికి తీసుకెళ్తాం హెచ్వీబీ గ్లోబల్ అకాడమీ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ప్రత్యేకమైన సమస్య ఎదురైనప్పుడు విద్యార్థితో మాట్లాడుతాం. కారణాలను తెలుసుకొని పరిష్కారానికి ప్రయత్నిస్తాం, అప్పటికీ విద్యార్థిలో మార్పురాకపోతే తల్లిదండ్రులకు విషయాన్ని వివరిస్తాం. స్కూల్ కౌన్సెల్లో కూడా చర్చిస్తాం. పరిష్కారం కాకపోతే సమస్యను వృత్తినైపుణ్యం కల్గిన వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం’ అని అన్నారు. దాదర్‌లోని బాల్మోహన్ విద్యామందిర్ టీచర్ విలాస్ పరాబ్ మాట్లాడుతూ ఖాళీ సమయాల్లో విద్యార్థులు నిర్మాణాత్మకమైన కార్యక్రమాల్లో పాల్గొనేలా చూడాలి, అలా చేయడం వలన మానసిక పరిపక్వత పెరుగుంతుందని చెప్పారు.