సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ 2020 ఏడాదికి గాను నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) జాబితాను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విశ్వ విద్యాలయాలు, కళాశాలలకు సంబంధించిన ర్యాంకులను వెల్లడించింది. ఈ జాబితాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్(ఐఐటీ మద్రాస్) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం ట్విటర్‌లో వెబ్‌కాస్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సంజయ్ ధోత్రే, ఏఐసీటీఐ చైర్మన్ అనిల్ సహస్రబుధే, యూజీసీ చైర్మన్ డీపీ సింగ్ పాల్గొన్నారు. (ప్రధాని హత్య.. 34 ఏళ్ల తర్వాత కేసు క్లోజ్ )
ఉన్నత విద్యా సంస్థల జాబితాలో ఐఐఎస్‌సీ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా, ఐఐటీ ఢిల్లీ మూడో స్థానాన్నిదక్కించుకుంది. ఐఐటీ బొంబాయి, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్ నాలుగు, అయిదు, ఆరవ స్థానంలో ఉన్నాయి. ఏడవ స్థానంలో జేఎన్‌యూ, ఎమిమిదవ స్థానంలో న్యూఢిల్లీ, తొమ్మిదవ స్థానంలో ఐఐటీ గువాహటి, పదవ స్థానంలో బనారస్ హిందూ విశ్వ విద్యాలయం వారణాసి నిలిచాయి. కాగా కాలేజీలకు, వర్సిటీలకు జాతీయ స్థాయిలో సొంత ర్యాంకింగ్ వ్యవస్థ ఉండాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ గతంలో నిర్ణయించింది. ఇందులో భాగంగా నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్) పేరుతో 2016 నుంచి తొమ్మిది విభాగాల్లో ర్యాంకులను కేటాయిస్తోంది. (అద్భుతమైన ఎంఐ నోట్‌బుక్స్ లాంచ్)
నేషనల్యూ ఇన్నిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 6 యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. వాటిలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 15 స్థానం, ఐఐటీ హైదరాబాద్ 17వ స్థానం,ఆంధ్రా యూనివర్సిటీ 36వ స్థానం ఎన్‌ఐటీ 46వ స్థానం, ఉస్మానియా యూనివర్సిటీ 53 స్థానం, కేఎల్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ 70 వ స్థానంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment