సాక్షి, హైదరాబాద్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో భారత రైజింగ్ స్టార్స్, తెలంగాణ క్రీడాకారిణులు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక కెరీర్ బెస్ట్‌ర్యాంక్‌లను అందుకున్నారు. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 23 ఏళ్ల సహజ మూడు స్థానాలు ఎగబాకి 295వ స్థానంలో... 22 ఏళ్ల రషి్మక 22 స్థానాలు పురోగతి సాధించి 318వ స్థానంలో నిలిచారు.
సహజ భారత నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... రషి్మక భారత మూడో ర్యాంకర్‌గా ఉంది. ఈ ఏడాది సహజ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) సర్క్యూట్‌లో నిలకడగా రాణిస్తోంది. మొత్తం 23 టోర్నీల్లో పోటీపడింది. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
లాస్‌ఏంజె లిస్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో సహజ సింగిల్స్ విభాగంలో టైటిల్ సాధించింది. మరోవైపు రష్మిక కూడా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. 21 టోర్నీల్లో పాల్గొన్న రషి్మక 25 మ్యాచ్‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఇండోర్‌లో జరిగిన ఐటీఎఫ్ డబ్ల్యూ35 టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment