Andhra Pradesh NEET Rank List 2021 Released - Sakshi
Sakshi News home page

ఏపీ నీట్‌ ర్యాంక్‌లు విడుదల

Published Wed, Nov 24 2021 5:01 AM | Last Updated on Wed, Nov 24 2021 9:54 AM

Andhra Pradesh State NEET Ranks Released - Sakshi

సాక్షి, అమరావతి: వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయస్థాయి అర్హత పరీక్ష నీట్‌ యూజీ–2021 రాష్ట్రస్థాయి ర్యాంకులను ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం విడుదల చేసింది. విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో జాబితాను ఉంచింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని వీసీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు.

విశ్వవిద్యాలయం పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్‌ చేపడతారు. ఈ ప్రక్రియ జరగడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

11 మందికి 100లోపు ర్యాంక్‌లు 
రాష్ట్రం నుంచి నీట్‌కు హాజరైన వారిలో 39,388 మంది అర్హత సాధించారు. రాష్ట్రంలో తొలి వందలోపు ఆల్‌ ఇండియా ర్యాంక్‌లను 11 మంది సాధించారు. వీరిలో ఎనిమిది మంది జనరల్‌ అభ్యర్థులు, ముగ్గురు ఓబీసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నారు. 

ఆలిండియా ర్యాంకులు 100లోపు సాధించిన వారు..
విద్యార్థి                                         ర్యాంకు
చందం విష్ణు వివేక్‌                         13
గొర్రిపాటి రుషిల్‌                             15
పి. వెంకట కౌశిక్‌ రెడ్డి                      27
కేతంరెడ్డి గోíపీచంద్‌ రెడ్డి               36
టి. సత్యకేశవ్‌                                 41
పరుచూరి వెంకటసాయి అమిత్‌    47
పి. కార్తీక్‌                                        53
ఎస్‌. వెంకటకల్పజ్‌                      58
కె. చైతన్య కృష్ణ                            71
పి. సాకేత్‌                                     84
వి. నిఖిత                                     89

కటాఫ్‌ మార్కులు ఇలా..
జనరల్‌ కేటగిరీ     138
జనరల్‌ పీడబ్ల్యూడీ కేటగిరీ     122
బీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూడీతో కలిపి)    108 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement